Kranthi Movie Review 9 రోజుల్లో క్రైమ్ థ్రిల్లర్.. రాకేందు మౌళి, ఇనయ సుల్తానా ఎలా చేశారంటే?

Rating: 2.5/5

నటీనటులు: రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి శెట్టి, యుమునా శ్రీనిధి, కార్తీక్, భవానీ చౌదరీ వీ తదితరులు
కథ, దర్శకత్వం: వీ భీమ శంకర్
నిర్మాత: భార్గవ్ మన్నె
మ్యూజిక్: గ్యాన్ సింగ్
సినిమాటోగ్రఫి: కిషోర్ బోయిడపు
ఎడిటర్: కేసీ హరి
బ్యానర్: స్వాతి పిక్చర్స్
సమర్పణ: నిర్విక, జాన్విక
ఓటీటీ రిలీజ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-03-03

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలని కోరికతో ఉండే యువకుడు రామ్ (రాకేందు మౌళి) సంధ్య (ఇనయ సుల్తానా)ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఎస్సై ట్రైనింగ్ వెళ్లే ముందు సంధ్య అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. సంధ్య మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోతాడు. అలా మనో వేధనలో రామ్ ఉంటున్న సమయంలోనే తమ ప్రాంతంలో నివసించే... తనకు సోదరి లాంటి రమ్య (శ్రావణి శెట్టి) అదృశ్యం కావడం కాకినాడలో సంచలనం రేపుతుంది. రమ్య కనిపించకుండా పోయిన సంఘటన రామ్‌ను కదలిస్తుంది. రమ్య కేసుపై ఆరా తీస్తే.. మరికొంత మంది అమ్మాయిలు కూడా కనిపించకుండా పోయారనే విషయం తెలిసి.. కామన్ మ్యాన్‌గా ఇన్వెస్టిగేషన్ చేపడుతాడు.

సంధ్య ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది? సంధ్య మర్డర్ రామ్‌ను మానసికంగా ఎలా కుంగదీసింది. రమ్య తరహాలోనే మరికొంత మంది అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు. మిస్ అయిన రమ్య ఎక్కడుంది? ఆమె ఆచూకిని రామ్ ఎలా కనిపెట్డాడు? అమ్మాయిలు తప్పిపోవడం వెనుక అసలు కుట్ర ఎవరిది? చివరకు సంధ్య మరణానికి రామ్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? రమ్యను కథ సుఖాంతమైందా అనే ప్రశ్నలకు సమాధానమే క్రాంతి సినిమా కథ.

Kranthi Telugu Movie Review and Rating: Rakendu Mouli and Inaya Sultana gives their best

నూతన దర్శకుడు భీమ శంకర్ ఎంచుకొన్న పాయింట్ కొత్తగా ఉంది. ఎస్సై ట్రైనింగ్‌కు వెళ్లాల్సిన సమయంలో తన జీవితంలో జరిగిన సంఘటన పట్ల ఎలా స్పందించారు? అమ్మాయిల మిస్సింగ్ సంఘటనలు జరిగే కాకినాడ ప్రాంతంలో మహిళలను ఎలా జాగృతి చేశాడనే పాయింట్ బాగుంది. కానీ బడ్జెట్ పరంగా ఉండే పరిమితులు పలు విషయాల పట్ల దర్శకుడు రాజీ పడేలా చేశాయనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అయితే కేవలం 9 రోజుల్లో మంచి క్వాలిటీ‌తో సినిమాను తీయడమే కాకుండా రిలీజ్ చేయడం అభినందించ దగిన విషయం. కొత్త నటీనటులతో ఫెర్ఫార్మెన్స్‌ రాబట్టుకొన్న విషయాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. పరిమితమైన బడ్జెట్‌తో కథను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో భీమ శంకర్ సఫలమయ్యాడు. మంచి నిర్మాత దొరికితే తనకు తాను నిరూపించుకొనే సత్తా తనలో ఉందని విషయాన్ని క్రాంతి ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

ప్రముఖ గేయ రచయిత, స్వర్గీయ వెన్నెలకంటి కుమారుడు, సినీ గేయ రచయిత, గాయకుడు రాకేందు మౌళి నటుడిగా కొత్త అవతారం ఎత్తి చేసిన సినిమా ఇది. రామ్ పాత్రలో రాకేందు అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రను పండించాడు. కీలకమైన సన్నివేశాల్లో నటుడిగా మంచి పరిణతిని చూపించాడు. సినిమా మొత్తాన్ని భుజాన వేసుకొని మోసిన ఆయనలో ఎక్కడ కూడా ఫెర్ఫార్మెన్స్ పరంగా తడబాటు కనిపించదు. నటుడిగా పూర్తి మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. ఇనయ సుల్తానా తన ఇమేజ్‌కు భిన్నంగా చాలా సంప్రదాయంగా కనిపించింది. పాత్ర పరిధి చిన్నదైనా గుర్తుండిపోయేలా నటించింది. శ్రావణి శెట్టి, యమునా శ్రీనిధి తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. గ్యాన్ సింగ్ మ్యూజిక్, కిషోర్ సినిమాటోగ్రఫి, కేసీ హారి ఎడిటింగ్ తమ తమ విభాగాల్లో మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. భార్గవ్ మన్నె అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ ఖర్చులో కూడా మంచి క్వాలిటీతో సినిమాను అందించిన విధానానికి అభినందించాల్సిందే.

మర్డర్ మిస్టరీ, అమ్మాయిల మిస్పింగ్ కేసు పరిశోధనా అంశాలుగా సాగే థ్రిల్లర్ మూవీ క్రాంతి. రాకేందు మౌళి, ఇనయ సుల్తానా, శ్రావణి, యుమన శ్రీనిధి యాక్టింగ్ ఈ సినిమాకు బలంగా మారాయి. కొత్త నటీనటులు, నూతన సాంకేతిక నిపుణులు మంచి అవుట్‌పుట్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. వీలు చూసుకొని ఒకే స్ట్రెంచ్ మూవీ చూస్తే మంచి అనుభూతిని కలిగిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X