Krishna And His Leela movie ట్విట్టర్ రివ్యూ
గుంటూరు టాకీస్ చిత్రంతో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించాడు సిద్దు జొన్నలగడ్డ. ఆపై గరుడవేగ చిత్రంలో మరో డిఫరెంట్ పాత్రలో పలకరించాడు. తాజాగా కృష్ణ అండ్ హిజ్ లీల అంటూ టాలెంటెడ్ హీరోయిన్ జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్‌తో వచ్చాడు. ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అందరూ ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో నేడు కృష్ణ అండ్ హిజ్ లీల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అయిన చిత్రంపై ప్రేక్షకులు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి ట్విట్టర్‌లో ఏం మాట్లాడుకుంటున్నారో ఓ సారి చూద్దాం.


రొమాంటిక్-కామెడీ..
ఒకే సమయంలో ఇద్దరుముగ్గురు అమ్మాయిలను ప్రేమించడం, అందులోంచి పుట్టే కామెడీ, రొమాన్స్‌ల నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కించారని, ఒక సారి చూసేందుకు చక్కని స్టఫ్ ఉన్న చిత్రమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

శ్రద్దా శ్రీనాథ్‌పై ప్రశంసలు..
శ్రద్దా శ్రీనాథ్ నటన గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోనూ శ్రద్దా తన నటనతో అందర్నీ ఆకట్టుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోసారి తనలోని ప్రతిభతో ఈ సినిమాను నిలబెట్టిందని అంటున్నారు. అందరూ ప్రత్యేకంగా శ్రద్దా నటనను ప్రస్తావిస్తున్నారు.

ఆ రెండు చిత్రాలు..
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా బద్రి, డాడీ సినిమాల కలయికలా ఉందని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టైల్ స్వాగ్ మిస్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. బాగుంది.. నిజమైన రూమర్స్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమని చెప్పారు.. అయితే అది ఎవరి కథో తెలుసుకోవాలని ఉంది.. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని అంటున్నారు.

థియేటర్స్ మిస్ అయినట్టుగా..
కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాన్ని చూస్తుంటే థియేటర్స్ మిస్ అయిన ఫీలింగ్ వస్తోందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొత్తంగా ఈ చిత్రంలో ఐటీ బ్యాక్ డ్రాప్,పార్టీ కల్చర్ చెత్తగా ఉందని, చివర్లో ఛాయ్ బిస్కెట్ వాళ్లు వచ్చి నాశనం చేశారని అంటున్నారు.

ఈ తరణానికి..
కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రం ఈ తరానికి చక్కగా సరిపోతుందని, యూత్‌ను బాగా అలరిస్తుందని అంటున్నారు. మొత్తానికి సినిమా చూస్తున్నంతసేపు తెగ ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఒక్కసారి చూడదగ్గ చిత్రమని సలహా ఇస్తున్నారు.
Recommended Video

ఇరగదీసిన సిద్దు..
హీరోగా నటించిన సిద్దూ తన నటనతో మరోసారి ఇరగ్గొట్టేశాడని అంటున్నారు. దర్శకుడు రవికాంత్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు. మొత్తానికి చిత్రయూనిట్ సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











