For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna Vrinda Vihari Review ఫన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. నాగశౌర్య ఎలా చేశాడంటే?

  |

  Rating:
  2.5/5

  నటీనటులు: నాగశౌర్య, షెర్లీ సెతియా, రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్, రాధిక శరత్ కుమార్, బ్రహ్మజీ తదితరులు
  దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ
  నిర్మాత: ఉషా ముల్పూరి
  సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్
  ఎడిటింగ్: తమ్మిరాజు
  మ్యూజిక్: మహతి స్వర సాగర్
  బ్యానర్: ఐరా క్రియేషన్స్
  రిలీజ్ డేట్: 2022-09-23

  కథ విషయానికి వస్తే..

  కథ విషయానికి వస్తే..

  సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన యువకుడు కృష్ణ (నాగశౌర్య). హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా చేరిన కృష్ణ తొలిచూపులోనే వ్రింద (షెర్లీ సెతియా)ను ప్రేమిస్తాడు. అయితే వ్రింద తన ప్రేమను నిరాకరించినా గానీ.. వెంటపడి పెళ్లికి ఒప్పిస్తాడు. తనకు పిల్లలు పుట్టరనే విషయాన్ని తన కుటుంబానికి చెప్పి కృష్ణ షాక్ గురిచేస్తాడు. అయితే పెళ్లి తర్వాత వ్రిందాకు ప్రెగ్నెంట్ అవ్వడంతో కృష్ణ కుటుంబ సభ్యులకు అనుమానాలు తలెత్తడంతో కృష్ణ, వ్రిందా విడాకుల వరకు వెళ్తారు.

  స్టోరీలో ట్విస్టులు ఇలా

  స్టోరీలో ట్విస్టులు ఇలా

  తనకు పిల్లలు కలగరనే అబద్దాన్ని కృష్ణ ఎందుకు ఆడాల్సి వచ్చింది? కృష్ణతో పెళ్లికి వ్రిందా ఎందుకు నిరాకరించింది? వ్రిందాను పెళ్లికి కృష్ణ ఎలా ఒప్పించాడు? వ్రిందా విందా ప్రెగ్నెన్సీపై కృష్ణ తల్లి అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) ఎందుకు అనుమానాలు కలిగాయి? విడాకుల వరకు వచ్చిన కృష్ణ, విందాకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. తమ కాపురంలో ఏర్పడిన సమస్యలకు కృష్ణ, వ్రిందా ఎలాంటి పరిష్కారం చూపారు అనే ప్రశ్నలకు సమాధానమే కృష్ణ వ్రిందా విహారి సినిమా కథ.

  దర్శకుడు అనీష్ గురించి

  దర్శకుడు అనీష్ గురించి


  దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రాసుకొన్న సింగిల్ పాయింట్ బాగుంది. కాకపోతే కథ, కథనాలను విస్తరించే క్రమంలో కొంత తడబాటుకు గురయ్యాడు. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్‌కు కాస్త సమయం ఎక్కువగానే తీసుకొన్నట్టు అనిపిస్తుంది. కృష్ణ, వ్రిందా మధ్య లవ్ ట్రాక్ చాలా రొటీన్‌గా, ముందే ఊహించే విధంగా ఉంటుంది. వారి ప్రేమ కథలో వ్రిందా క్యారెక్టర్‌కు సంబంధించిన ఓ ట్విస్టు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. చిన్న ట్విస్టుతో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై మంచి అంచనాలే పంచే ప్రయత్నం చేశారు.

  ఫన్‌తో సెకండాఫ్ ఫీల్‌గుడ్‌గా

  ఫన్‌తో సెకండాఫ్ ఫీల్‌గుడ్‌గా

  ఇక ఫస్టాఫ్‌లో కనిపించిన తడబాటు సెకండాఫ్‌లో కనిపించకుండా దర్శకుడు అనీష్ చాలా జాగ్రత్తపడ్డారు. సెకండాఫ్‌లో కొన్ని ఎమోషన్స్ బాగా పండటమే కాకుండా ఫన్ ఫుల్లుగా జనరేట్ అయింది. సత్య, వెన్నెల కిషోర్, నాగశౌర్య, రాహుల్ రామకృష్ణ మధ్య కామెడీ ట్రాక్‌ అదిరిపోతుంది. వెన్నెల కిషోర్ కోమా ఎపిసొడ్ నవ్వులు పూయించింది. చివర్లలో అంతకుమించిన క్లైమాక్స్ కథకు లేకపోవడం వల్ల సినిమా మరీ రొటీన్‌గా ముగుస్తుంది.

  ఆకట్టుకొన్న నాగశౌర్య

  ఆకట్టుకొన్న నాగశౌర్య

  నాగశౌర్య మరోసారి తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. బుద్దిమంతుడైన కుర్రాడిగా, లవర్ బాయ్‌గా, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా, తల్లి, భార్య మధ్య నలిగిపోయే భర్తగా పలు వేరియేషన్స్‌ ఉన్న క్యారెక్టర్ బాగా చేశాడు. సెకండాఫ్‌లో ఫన్, ఎమోషన్స్ మిక్స్ చేసి నటనతో మెప్పించిన తీరు బాగుంది. పాత్ర కోసం ఆయన కష్టపడిన ప్రతీ విషయం తెరమీద కనిపిస్తుంది. ఇక వ్రిందగా షెర్లీ కరెక్ట్‌గా సూట్ కాలేదనిపిస్తుంది. భారమైన పాత్రలో ఆమె తేలిపోయింది. కొంత అనుభవం, తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న హీరోయిన్ అయితే.. సినిమా మరింత కనెక్ట్ అయి ఉండేదనిపిస్తుంది. గ్లామర్‌ పరంగా కూడా మెప్పించలేకపోయింది.

  సత్య, రాహుల్, వెన్నెల కిషోర్ ఫన్ గురించి

  సత్య, రాహుల్, వెన్నెల కిషోర్ ఫన్ గురించి

  ఇతర క్యారెక్టర్ల విషయానికి వస్తే.. సీరియస్ పాత్రలో అమృతవల్లిగా రాధిక శరత్ కుమార్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. చాలా ఎమోషనల్, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో ఆమె నటన భావోద్వేగానికి గురిచేస్తుంది. హాస్పిటల్ ఎపిసోడ్‌లో సత్య, వెన్నెల కిషోర్, రాహుల రామకృష్ణ కామెడీతో నవ్వులు పూయించారు. మిగితా పాత్రల్లో కనిపించిన నటీనటులు పర్వాలేదనిపించారు.

  టెక్నికల్‌గా ఎలా ఉందంటే...

  టెక్నికల్‌గా ఎలా ఉందంటే...

  సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి బాగుంది. లవ్ ట్రాక్, యాక్షన్ సీన్లను చక్కగా చిత్రీకరించారు. మహతి సాగర్ బీజీఎం బాగుంది. ఒక్కపాట తప్ప మిగితా పాటలు ఆకట్టుకొనేలా అనిపించలేదు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. ఇక ఫ్యామిలీ చిత్రాలను రూపొందించే నిర్మాతగా ఉషా ముల్పూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, ట్రీట్‌మెంట్‌పై ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయ్యేదనిపించంది.

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?


  లవ్, యూత్‌ఫుల్ ఎలిమింట్స్‌తో ఫన్, ఫ్యామిలీ అంశాలతో రూపొందిన చిత్రం కృష్ణ వ్రిందా విహారి. టైటిల్‌కు తగినట్టే ఫీల్‌గుడ్ మూవీ. ఫస్టాఫ్‌ రొటీన్‌గా సాగడం, రొటీన్ కథ, కథనాలు తప్పితే పెద్దగా మైనస్‌లు కనిపించవు. సెకండాఫ్ మంచి హ్యుమర్, వెన్నెల కిషోర్ కామెడీతో సినిమా ఆహ్లాదకరంగా మారింది. ఫన్, ఫ్యామిలీ చిత్రాలను ఆదరించే వారికి కృష్ణ వ్రిందా విహారి సినిమా నచ్చుతుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా ఓసారి చూడవచ్చు. ఫన్, ఫ్యామిలీ, సెంటిమెంట్ అంశాలు మంచి అనుభూతిని పంచుతాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్స్
  నాగశౌర్య ఫెర్ఫార్మెన్స్
  నిర్మాణ విలువలు
  వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ కామెడీ

  మైనస్ పాయింట్స్
  హీరోయిన్ ఫెర్ఫార్మెన్స్
  రొటీన్ కథ, కథనాలు

  English summary
  Naga Shourya's latest movie is Krishna Vrinda Vihari. This movie hits the theatres on 23rd September. Here is the Telugu filmibeat exclusive Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X