»   » ఆకట్టుకుంటుంది..(కృష్ణ గాడి వీర ప్రేమ గాధ- రివ్యూ)

ఆకట్టుకుంటుంది..(కృష్ణ గాడి వీర ప్రేమ గాధ- రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

హైదరాబాద్: ‘అందాల రాక్షసి' చిత్రంతో పరిచయమైన దర్శకుడు హను రాఘవపూడి. ఆయన ఆ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘కృష్ణగాడి వీరప్రేమగాథ' అంటూ ఓ ప్రేమకథని ఆవిష్కరించాడు. నాని గత చిత్రం భలే భలే మగాడివోయ్ పెద్ద సక్సెస్ ను సాధించింది. మరో వైపు ఈ సినిమాలో నాని బాలయ్య అభిమానిగా సరికొత్త పాత్రలో కనిపించడం, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు ముందు నుండీ భారీగానే ఉన్నాయి.

కథ విషయానికొస్తే..
అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన కృష్ణ(నాని) బాలయ్యకు పెద్ద అభిమాని. ఎంతంటే చేతిపై జై బాలయ్య అని పచ్చబొట్టు వేయించుకునేంత. చూట్టూ ఫ్యాక్షన్ వాతావరణం ఉన్నా నాని మాత్రం గొడవలకు చాలా దూరం. ఒక రకంగా గొడవలంటే భయం. అదే గ్రామంలో మహాలక్ష్మి(మెహరీన్), కృష్ణ చిన్నతనం నుండి ప్రేమించుకుంటారు. కానీ బయటకు మాత్రం అలా కనిపించరు. మహాలక్ష్మి అన్నయ్య రామరాజు పెద్ద ఫ్యాక్షనిస్ట్. అతనంటే అందరికీ భయం అందుకే కృష్ణ, మహాలక్ష్మిలు కూడా తమ ప్రేమ విషయాన్ని బయట పడుకండా జాగ్రత్త పడతారు. కనీసం తమ స్నేహితుల వద్ద కూడా ఆ విషయంలో బయట పడరు. పైకి ఇద్దరూ ఎప్పూడు పోట్లాడుకున్నట్లు నటిస్తారు. ఒకరోజు ధైర్యం చేసిన తన ప్రేమ విషయం చెబుతాడు కృష్ణ. అయితే మహాలక్ష్మి అన్నయ్య తాను చెప్పిన పని చేస్తే తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. మరి అతడు కృష్ణకు అప్పగించిన పనేంటి? అసలే భయస్తుడైన కృష్ణ తన ప్రేమను ఎలా గెలచుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.


పెర్ఫార్మెన్స్..
హీరో నాని పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టాడు. కృష్ణ పాత్రలో సహజంగా నటించాడు. భయస్తుడిగా.... తన ప్రేమను దక్కించుకోవడానికి వీరుడిగా సహజమైన నటన కనబరిచాడు. ప్రేమ గురించే చెప్పలేని పిరికివాడి పాత్రలో ఒదిగిపోయాడే. పిరికి వాడిగా, వీరుడిగా మంచి వేరియేషన్ చూపించాడు. ఇక పలు సన్నివేశాల్లో నాని కామెడి టైమింగ్ కూడా అదరగొట్టాడు. మెహ‌రీన్ కు ఇది తొలి సినిమా అయినా చ‌క్క‌గా నటించింది. లుక్ పరంగా కూడా బావుంది. పృథ్వీ, బ్ర‌హ్మాజీ, ప్రభాస్ శీను, సత్యం రాజేష్ లు మంచి కామెడీ అందించారు. రాజన్నగా మహదేవన్, రామరాజుగా రామకృష్ణలు ఫ్యాక్షనిస్టుల పాత్రలో బాగా నటించారు. పవర్ ఫుల్ అండ్ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సంపత్ నటన బావుంది. దుబాయ్ డాన్ డేవిడ్ పాత్రలో మురళిశర్మ సినిమాకు బాగా ప్లస్సయ్యాడు. ముగ్గురు పిల్లలు నైనా, మోక్ష‌, శ్రీ ప్ర‌థ‌మ్‌లు బాగా నటించారు.


చాలా కాలం తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టు శశి..గుర్తిండిపోయే( సంపత్ కు అసిస్టెంట్ పోలీస్ అధికారిగా) పాత్రలో కనిపించాడు. . క్యారక్టర్ ఎండ్ లో ఎక్సపెక్ట్ చేయని పంచ్ , అనంతరం వచ్చే ఎమోషన్ లో జీవించాడనే చెప్పాలి. కీలకమైన కీ రోల్స్ కు మరో క్యారక్టర్ ఆర్టిస్టు దొరికినట్లే.


స్లైడ్ షోలో పూర్తి రివ్యూ...


టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

టెక్నికల్ అంశాల విషయానికొస్తే...


యువరాజ్ సినిమాటోగ్రఫీ టెక్నికల్ అంశాల్లో హైలెట్ అయింది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ యావరేజ్. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. వర్మ ఎడిటింగ్ ఫర్వాలేదు.


14 రీల్స్..

14 రీల్స్..

విజయ్ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలు బాగా కంపోజ్ చేసాడు. 14 రీల్స్ సంస్థ నిర్మాణం విషయంలో ఎక్కడా తత్వం కాదు. అందుకే సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. ఇతర విభాగాలు ఒకే...


డైరెక్టర్

డైరెక్టర్

మొదటి చిత్రం అందాల రాక్షసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. లవ్ విత్ ఫ్యాక్షన్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పొచ్చు.


మెప్పించాడు

మెప్పించాడు

స్క్రీన్ ప్లేలో కొన్ని చోట్ల స్లో అయినా సినిమాను బాగా తెరకెక్కించాడు. అందాల రాక్షసి దర్శకుడు కాబట్టి అలాంటి ఛాయలే ఈ సినిమాలో ఉంటాయనే భావన ఉండేది. కానీ ఈ సినిమా చూస్తే పూర్తి డిఫరెంటుగా ఉంటుంది.


రక్తపాతం లేకుండా

రక్తపాతం లేకుండా

లవ్, ఫ్యాక్షన్ స్టోరీని నడిపిస్తూ మధ్యలో కామెడీ జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా రక్తపాతం లేకుండా ప్రేక్షకులకు మెచ్చేలా సినిమాను నడిపించాడు.


ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

నాని పెర్ఫార్మెన్స్, హను డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పృథ్వీ, బ్రహ్మాజీ, సత్యం రాజేష్ కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్


మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

రోటీన్ స్టోరీ, సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు ఉంది, కొన్ని సాంగ్స్ కూడా


ఫైనల్ వర్డ్

ఫైనల్ వర్డ్

ఓవరాల్ గా చెప్పాలంటే.....‘కృష్ణగాడి ప్రేమగాధ' సగటు తెలుగు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. లవ్, ఎంటర్టెన్మెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్.
English summary
Krishna Gaadi Veera Prema Gaadha written and directed by Hanu Raghavapudi. Produced by Ram Achanta, Gopichand Achanta and Anil Sunkara under their 14 Reels Entertainment, KVPG features Nani and Mehrene Kaur Peerzada in the lead roles while Murali Sharma and Sampath Raj appear in crucial supporting roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X