కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ: మాస్ టచ్‌తో నాని

By Rajababu

Recommended Video

Krishnarjuna Yuddham Cinema Review కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ

Rating:
2.0/5
Star Cast: నాని, అనుపమ పరమేశ్వరన్, రుస్కర్ మీర్
Director: మేర్లపాక గాంధీ

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రతీ సినిమాకు కలెక్షన్లపరంగానే కాకుండా నటనపరంగా పైచేయి సాధిస్తున్నారు నాని. మజ్ను, నిన్నుకోరి, ఎంసీఏ చిత్రాలు నాని ప్రతిభకు, స్టామినాకు అద్దం పట్టాయి. విభిన్నమైన చిత్రాల ఎంపికతో తన మార్కును సొంతం చేసుకొంటున్నారు. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నాని నటించిన తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం ద్వారా మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనుపమ పరమేశ్వరన్, రుస్కర్ మీర్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 12 రిలీజైంది. ఈ సినిమా నానికి మరో హిట్‌ను అందించిందా? ప్రేక్షకులను మెప్పించడానికి ఏ అంశాలు ఉపయోగపడ్డాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

 కృష్ణార్జున యుద్ధం కథ..

కృష్ణార్జున యుద్ధం కథ..

కృష్ణ (నాని) చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు. చాలా ముతకగా ఉంటాడు. చదువు సంధ్యలు పెద్దగా అబ్బకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటాడు. అలా సాగుతున్న కృష్ణ జీవితంలోకి రియా (రుస్కర్ మీర్) ప్రవేశిస్తుంది. రియా బాగా చదువుకొన్న అమ్మాయి కావడం, డబ్బున్న కుటుంబానికి చెందడంతో వారి ప్రేమకు పెద్దలు అంగీకారం లభించదు. దాంతో పెద్దలు రియాను హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. చిత్తూరులో కథ ఇలా ఉంటే.. యూరప్‌లోని ప్రాగ్‌లో నివసించే అర్జున్ (నాని) ఓ రాక్‌స్టార్. అమ్మాయిలంటే అర్జున్‌కు ప్రపంచం. అలాంటి జీవితంలో బతికే అర్జున్‌కు సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) తారసపడుతుంది. సుబ్బలక్ష్మిని తొలిచూపులోనే అర్జున్ ప్రేమిస్తాడు. కానీ అర్జున్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె అతడి ప్రేమను తిరస్కరించి హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకొంటుంది.

ముగింపు ఇలా

ముగింపు ఇలా

హైదరాబాద్‌కు బయలుదేరిన రియా, సుబ్బలక్ష్మిలు ఓ ఆపదలో చిక్కుకొంటారు. ఆ ఇద్దరికి ఎదురైన సమస్య ఏమిటి? ప్రాగ్‌లో ఉండే అర్జున్, చిత్తూరులో నివసించే కృష్ణ తమ ప్రియురాళ్లను సమస్యను ఎలా బయటపడేశారు. అందుకోసం వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే కృష్ణార్జున యుద్ధం సినిమా కథ.

ఫస్టాఫ్‌లో

ఫస్టాఫ్‌లో

తొలిభాగంలో చిత్తూరు, ప్రాగ్‌లో ఉండే కృష్ణ, అర్జున్ జీవితాలకు సంబంధించిన సన్నివేశాలతో కొంత ఆసక్తిగా సాగుతుంది. అర్జున్ జీవితం కొంత మోడర్ టచ్, కృష్ణ జీవితంలో రూరల్ టచ్‌ను బ్యాలెన్స్ చేయడం సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ప్రథమార్థంలో నిడివి ఎక్కువగా ఉండటంతో విరామం కోసం ప్రేక్షకుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడక్కడ బ్రహ్మానందం కామెడీ, సంగీత శిక్షణ అంశాలు ప్రేక్షకుల్లో కొంత జోష్‌ను పెంచడానికి దోహదపడుతాయి. కానీ ఓ రెగ్యులర్ పాయింట్‌తో ఇంటర్వెల్‌‌ కార్డు పడుతుంది.

సెకండాఫ్‌లో

సెకండాఫ్‌లో

సినిమా రెండో భాగం ఏమిటో ఇంటర్వెల్ కార్డుతోనే ప్రేక్షకుడికి అర్ధం అవుతుంది. ప్రేక్షకుడి బుర్రకు పెద్దగా పెట్టాల్సిన అవసరమే ఉండదు. కాకపోతే సెకండాఫ్‌లో బాగ వాడిపడేసిన పాయింట్‌తో సినిమాను ముందుకు నడిపించడం ఓ మైనస్ అని చెప్పవచ్చు. కథ ఎంత పాతదైనా పర్వాలేదు.. కనీసం కొత్తగా సీన్లు, స్క్రీన్‌ప్లే రాసుకొని గలిగి ఉంటే సినిమాను నాని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అవకాశం ఉండేది. కానీ రెగ్యులర్, రొటిన్ అంశాలు సహనాన్ని పరీక్ష పెట్టాయా అనేలా ఉంటాయి.

మేర్లపాక గాంధీ మేకింగ్

మేర్లపాక గాంధీ మేకింగ్

గత చిత్రాల సక్సెస్‌తో దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంపొందించుకొన్నాడు. గాంధీ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చే పరిస్థితి ఉంది. తాజాగా నానితో కలిసి సినిమా చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కృష్ణార్జునయుద్ధంలో చిత్తూరు యాస‌తో రాసుకొన్న పాత్రలు కొంత కొత్తదనాన్ని అందిస్తాయి. కానీ కథ, కథనాలపై జాగ్రత్త వహించాల్సిన చోట దర్శకుడు విఫలమయ్యారనే చెప్పవచ్చు. నాని లాంటి సక్సెస్ స్టార్‌తో సినిమా చేయడం కత్తి మీద సాము అనే విషయాన్ని మరిచిపోయాడా అనిపిస్తుంది. కేవలం పాత చింతకాయపచ్చడినే నమ్ముకొన్నాడేంటి అనే ఫీలింగ్ కలుగకమానదు.

మరోసారి నాని మరోసారి

మరోసారి నాని మరోసారి

నాని ద్విపాత్రాభినయం చేయడం కొత్తేమీ కాదు. ఈ చిత్రంలో కృష్ణార్జునులుగా కనిపించాడు. ఎప్పడు కొత్తదనం కోసం తపించే నాని ఈ చిత్రంలో కృష్ణ పాత్రతో ఆకట్టుకొన్నాడు. చిత్తూరు జిల్లా యాసతో నాని అదరగొట్టాడనే చెప్పవచ్చు. భాషను చాలా ఎఫెక్టివ్‌గా చెప్పడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. కాకపోతే రాక్‌స్టార్ అర్జున్‌ పాత్రలో నాని తేలిపోయాడనే చెప్పవచ్చు. కృష్ణ ముందు అర్జున్ అతి సాధారణంగా కనిపించాడు. ఆ రెండు పాత్రల మధ్య బ్యాలెన్స్ లేకపోవడం, తేడా ఊహించని స్థాయిలో ఉండటం మింగుడు పడని విషయమనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా నాని ఎప్పటిలానే సినిమాను నిలబెట్టడానికి వందశాతం శ్రమించాడు.

అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్

ఇక హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్‌ గురించి కాస్తో కూస్తో చెప్పుకోవచ్చు. తన టాలెంట్‌కు తగినట్టుగా సుబ్బలక్ష్మి పాత్ర లేకపోవడం అనుపమకు నిరాశే అనిచెప్పవచ్చు. పాత్ర పరిధి మేరకు ఉన్నంతలో న్యాయం చేసే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా అనుపమ కెరీర్‌కు ప్లస్ అయ్యే పాత్ర మాత్రం కాదని చెప్పవచ్చు. గత చిత్రాలతో పోల్చుకొంటే సాదాసీదా పాత్రలోనే కనిపించింది. గ్లామర్ పరంగా ఒకే అనిపించింది.

రుస్కర్ మీర్‌ పాత్ర

రుస్కర్ మీర్‌ పాత్ర

రియా పాత్రలో కనిపించిన రుస్కర్ మీర్‌కు పెద్దగా స్కోప్ లేని పాత్రే లభించింది. తొలిభాగంలో కొన్ని సీన్లలో పర్వాలేదనిపించింది. కానీ ఇంకా నటనపరంగా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తొలిచిత్రంలో అదీ నాని లాంటి హీరో సినిమాలో రుస్కర్ నుంచి పెద్దగా ఆశించడం తప్పే అవుతుంది.

బ్రహ్మాజీ కామెడీ మెరుపులు

బ్రహ్మాజీ కామెడీ మెరుపులు

కృ‌ష్ణార్జునయుద్ధం చిత్రంలోని పాత్రల్లో బాగా ఆకట్టుకొనేది బ్రహ్మాజీ పాత్ర. తనదైన కామెడీతో బ్రహ్మాజి మరోసారి గుర్తుండిపోయేలా నటించాడు. ప్రధానంగా సంగీత శిక్షణ, రాక్‌స్టార్‌తో కొన్ని సీన్లు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. కోమా నుంచి బయటకు వచ్చిన సీన్లు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. ఈ మధ్యకాలంలో మరో మంచి పాత్రలో బ్రహ్మాజీ కనిపించాడు. ఇక నాని స్నేహితులుగా నటించిన ఇద్దరు మాత్రం కొన్ని సీన్లలో ఇరుగదీశారు.

హిప్ హాప్ తమిజా మ్యూజిక్

హిప్ హాప్ తమిజా మ్యూజిక్

హిప్ హాప్ తమిజా సంగీతం గొప్పగా లేకపోయినా ఒకే అనే మాదిరిగా ఉంది. చిత్తూరు బ్యాక్‌డ్రాప్ కావడం మూలంగానో తమిళ వాసన కూడా ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది. రిలీజ్‌కు ముందే దారి చూడు పాటకు విశేష ఆదరణ లభించింది. మిగితా పాటలు సో.. సోగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో మినహాయిస్తే రీరికార్డింగ్ నార్మల్‌గానే ఉంది.

కార్తీక్ సినిమాటోగ్రఫీ

కార్తీక్ సినిమాటోగ్రఫీ

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. కథలో మెట్రో కల్చర్, రూరల్ కల్చర్‌కు మధ్య ఉండే వేరియేషన్‌ను కార్తీక్ ఘట్టమనేని చక్కగా తెరకెక్కించాడు. ఛేజింగ్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. రాక్‌స్టార్‌కు సంబంధం ఉన్న పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి.

డైలాగ్స్, ఇతర టెక్నికల్ అంశాలు

డైలాగ్స్, ఇతర టెక్నికల్ అంశాలు

కృష్ణార్జునయుద్ధం సినిమాలో చిత్తూరు జిల్లా యాస, భాష ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాకు డైలాగ్స్ ప్లస్ పాయింట్స్. కథ దృష్టిలో పెట్టుకొంటే ఈ సినిమా నిడివి కాస్త ఎక్కువే. దాంతో ఎడిటింగ్ విభాగానికి మరింత పని ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అనవసరమైన సీన్లు అక్కడ కథావేగానికి అడ్డుపడేలా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు.

మధ్య తరగతి యువకుడు

మధ్య తరగతి యువకుడు

మధ్య తరగతి యువకుడు, సాధారణ యువకుడి పాత్రలతో నాని తన కెరీర్‌లో ఎనిమిది సక్సెస్‌లోను అందుకొన్నాడు. దాంతో నానిపై, ఆయన నటించే సినిమాలపై ప్రేక్షకుల అంచనాల అసాధారణంగా పెరుగుతున్నాయి. ప్రేక్షకులను మెప్పించడానికి విభిన్న పాత్రలను ఎంచుకొన్నాడు. తాజాగా తన సహజంగా వచ్చిన ఇమేజ్‌ను దూరంగా పెట్టి చేసిన చిత్రం కృష్ణార్జునయుద్దం. కృష్ణుడి పాత్రలో మరోసారి మెరిశాడు. కానీ రాక్‌స్టార్‌గా మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించ లేకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. నాని నుంచి ఏదో ఆశించే ప్రేక్షకులకు మాత్రం కృష్ణార్జున యుద్ధం కొంత నిరాశను కలిగిస్తుంది. కేవలం మాస్ హీరోగా మెప్పించడానికి, ఎస్టాబ్లిష్ కావడానికి చేసిన ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

నాని యాక్టింగ్
మ్యూజిక్
సినిమాటోగ్రఫి
ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్
విలనిజం
కథ, కథనం
టేకింగ్
నిడివి
ఎడిటింగ్
సెకండాఫ్

నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రుస్కర్ మీర్, బ్రహ్మాజీ, నాగినీడు తదితరులు

నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రుస్కర్ మీర్, బ్రహ్మాజీ, నాగినీడు తదితరులు

కథ, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: హిప్‌హాప్ తమిజా
సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: సత్య జీ
నిడివి: 154 నిమిషాలు
రిలీజ్ డేట్: 12 ఏప్రిల్ 2018

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X