twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణుడు 'కులుమనాలి'(రివ్యూ)

    By Srikanya
    |

    సంస్థ: జాహ్నవి ప్రొడక్షన్స్‌
    నటీనటులు: విమలారామన్‌, అర్చన, గౌరీశర్మ, సమీక్ష, కృష్ణుడు, శశాంక్‌, అక్షయ్‌, ప్రియ తదితరులు.
    నిర్మాత: బొప్పన చంద్రశేఖర్‌
    దర్శకత్వం: సతీష్‌ వేగేశ్న


    రచయిత నుంచి దర్శకుడుగా మారిన సతీష్ వేగేశ్న మరో కొత్త ప్రయత్న కులుమనాలి మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. విమలారామన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఓ ధ్రిల్లర్. అనేక హాలీవుడ్ చిత్రాల మిశ్రమంగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమవుతోంది. ధ్రిల్లింగ్ గా ఎలిమెంట్స్ తక్కువై,నస పెట్టే అంసాలు ఎక్కవై బోర్ గా మారింది.

    ఈ చిత్రంలో కృష్ణ (కృష్ణుడు) రుషి(శశాంక్‌) అక్షయ్‌ (అక్షయ్‌) అను (ప్రియ) వీరంతా మంచి స్నేహితులు. విహారయాత్ర కోసం హైదరాబాద్‌ నుంచి కులుమనాలి వెళ్తారు. అయితే ఈ బృందంలోని వారంతా ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మిస్టీరియస్ మాస్క్ వేసుకున్న ఒక కిల్లర్ వీరందిరీనీ చంపుతున్నారు. అస్సలు ఆ కిల్లర్ ఎవరు.. వారందరినీ ఎందుకు చంపుతున్నారు? ఎందుకోసం అనే విషయాలు మాత్రం అంతుపట్టవు. ఈ రహస్యం ఛేదించడానికి ఇన్సెపెక్టర్ ప్రవళిక (విమలారామన్‌) రంగంలోకి దిగుతుంది. ఆమెకు లోకల్ గైడ్ హర్ష(హర్షవర్దన్)సహకరిస్తూంటాడు. ఆమె ఆ కిల్లర్ చంపటానికి కారణం..ఓ డార్క్ సీక్రెట్ ఆ చనిపోయిన వారి జీవితాల్లో ఉందని అర్దం చేసుకుంటాడు. ఇంతకీ ఆ డార్క్ సీక్రెట్ ఏమిటి..ఇంతకీ ఆమె హంతకులెవరో ఆమె కనుక్కొందా? లేదా? అనేది తెరపైనే చూడాలి.


    విమలారామన్,అర్చన్ చాలా డీసెంట్ గా ఈ చిత్రంలో తమ పాత్రల్లో కనపిస్తారు. ముఖ్యంగా విమలారామ్ పాత్ర జస్టిఫికేషన్ వదిలేస్తే ఆమె చాలా చక్కగా ఫైట్స్,డాన్స్ లు చేసి మురిపిస్తుంది. ఇక శశాంక్,కృష్ణుడు పెద్దగా చేసిందేమీ లేదు. హర్షవర్దన్, వినయ్ మోహన్ అక్కడక్కడా నవ్వించటానకి ప్రయత్నిస్తూంటారు. ఇక ఈ చిత్రం ధిల్లర్ సినిమాలు ఎలా తీయకూడదనేదానకి ఉదాహరణగా మిగిలిపోతుంది. ముఖ్యంగా కథ,కథనం విషయంలో ఈ చిత్రం ఫెయిలైంది. రచయిత,దర్శకుడు అయిన సతీష్ ..డైలాగులు మీద పెట్టిన శ్రద్ద కథ,కథనాలమీద పెట్టలేదని అర్దమవుతుంది. ముఖ్యంగా సస్పెన్స్ గా ఉండాల్సిన ఎలిమెంట్స్ కామిడీగా మారిపోవటం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇక మిగతా డిపార్టమెంట్ ల గురించి పెద్దగా చెప్పుకునేదేమీ లేదు.

    English summary
    Krishnudu's new film Kulumanali released and get Flop talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X