Kuberaa First Review: కుబేరా మూవీ ఫస్ట్ రివ్యూ
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్, అఫీషియల్స్ రివ్యూ వివరాల్లోకి వెళితే..
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఇండియా, ఓవర్సీస్ మార్కెట్‌లో కలిపి సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని తెలిసింది.

వీధుల్లో బిక్షాటన చేసే వ్యక్తి ఏ పరిస్థితుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎలా మారారనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా సోషల్ థ్రిల్లర్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినీ, బిజినెస్ వర్గాల్లో అంచనాలు పెంచింది. పాటలు, టీజర్లు, గ్లింప్స్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌ను నాగార్జున, రష్మిక, అనుపమ్ ఖేర్ ముంబైలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌కు ముందు ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారుల రివ్యూకు సమర్పించారు.
ఇక కుబేరా సినిమాను చూసిన తర్వాత సెన్సార్ బోర్డు అధికారుల తమ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. ఈ సెన్సార్‌కు సమర్పించిన కాపీ సుమారుగా 195 నిమిషాల 27 సెకన్లు అంటే.. 3 గంటల 27 సెకన్లు అనే విషయాన్ని నిర్ఱారించారు. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి ఉన్న సినిమా వస్తున్నదనే వార్త తొలుత అన్ని వర్గాలకు షాక్ కలిగించింది.
అయితే నిర్మాత సునీల్ నారంగ్ వెల్లడించిన ప్రకారం.. కుబెరా సినిమా 175 నిమిషాలు అంటే.. 2 గంటల 55 నిమిషాలు ఉంటుందన్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ అయిన తర్వాత సుమారుగా 20 నిమిషాల నిడివిని తగ్గించారు. తాజా రన్ టైమ్ ప్రకారం.. అన్ని రకాల ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది ఇక నామమాత్రమే. రిలీజ్ తర్వాత అదే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుందనే విషయంపై చిత్ర యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తున్నది.
కుబేరా సినిమాలో ధనుష్ క్యారెక్టర్ హైలెట్‌గా నిలుస్తుంది. ఈ మూవీ విడుదల తర్వాత ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకొంటారు. శేఖర్ కమ్ముల ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ సినిమాకు నాగార్జున అక్కినేని స్పెషల్ ఎట్రాక్షన్. ధనుష్, నాగ్ పోటాపోటీగా నటించారు. రష్మిక మందన్న కెరీర్‌లో గుర్తుంచుకొనే పాత్రను చేసింది. సెకండాఫ్‌లో కొంత ల్యాగ్ ఉంటుంది. క్లైమాక్స్ వరకు కొన్ని సీన్లు సాగదీసినట్టుగా ఉంటాయి. కానీ చివరి 15 నిమిషాలు డ్రామా అన్ని లోపాలను సవరిస్తుంది అనే టాక్ సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది. ఈ సినిమా శేఖర్ కమ్ములకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











