Kuberaa Critic Review: కుబేరా తెలుగు సినిమా క్రిటిక్ రివ్యూ!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కుబేరా ట్రైలర్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై మరింత పాజిటివిటీ పెరిగింది. ఈ క్రమంలో రిలీజ్‌కు కావాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొంటున్నది. ఈ క్రమంలోనే గల్ఫ్ కంట్రీస్‌లో రిలీజ్ కోసం దుబాయ్‌లో సెన్సార్ అధికారుల రివ్యూ జరిగింది. ఈ రివ్యూలో దుబాయ్ క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సంధూ ఈ సినిమాను వీక్షించి మూవీ గురించి ఫస్ట్ రివ్యూ అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. తన షార్ట్ రివ్యూలో ఉమేర్ సంధూ ఏం వెల్లడించారంటే?

Kuberaa Review by Umair Sandhu

కుబేరా మూవీ దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూశాను. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న తమ పాత్ర ద్వారా పవర్‌ఫుల్ ఫెర్మార్మెన్స్‌తో ఈ సినిమాను ఓ క్రేజీ థ్రిల్లర్‌గా మార్చారు. ఈ ముగ్గురు తెర మీద తమ పాత్రలతో కేక పుట్టించారు. ఈ ముగ్గురు స్టార్ల నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌ అవుతుంది. ఇక ఈ సినిమా కథ ఎంగేజింగ్‌గా ఉంది. క్లైమాక్స్ చాలా సూపర్‌గా ఉంది అని తన రివ్యూలో పేర్కొన్నారు.

ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌పై ఉమేర్ సంధూ సెటైర్ వేశాడు. ఈ సినిమాలోని ధనుష్ నటన చూసిన తర్వాత ఆయన అతడి నుంచి యాక్టింగ్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది. ఈ సినిమా చూసి నటన అంటే ఏమిటో ధనుష్ నుంచి నేర్చుకోవాలి అని కామెంట్ చేశాడు. ఇక కుబేరా సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ పైసా వసూల్ సినిమా. తప్పకుండా చూడాల్సిన సినిమా అని సెలవివ్చాడు.

ఇదిలా ఉండగా, కుబేరా గురించి బయటకు వచ్చిన ఇన్‌సైడ్ టాక్ ఏమిటంటే.. స్టోరీ లైన్ ప్రకారం జరిగే ఎమోషనల్ కథ. ఫస్టాఫ్‌లో కథ ఎస్టాబ్లిష్ కావడానికి కాస్త ఎక్కువగా సమయం తీసుకొన్నాడు. అందుచేత సినిమా ఫస్టాఫ్‌ స్లోగా ఉంటుంది. సెకండాఫ్‌లో ఉండే ట్విస్టులను శేఖర్ కమ్ములు బాగా డీల్ చేశాడు. ఆయన తరహాలో క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమా అన్ని వర్గాలను అకట్టుకొంటే భారీ విజయాన్ని సాధించడానికి అన్నీ అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపించింది.

ఇదిలా ఉండగా, ఉమేర్ సంధూ వెల్లడించే రివ్యూలు కొన్ని సార్లు దారుణంగా ఉంటాయి. సినిమాకు సంబంధం లేకుండా రివ్యూలు, రేటింగ్స్ ఇస్తుంటాడు. సోషల్ మీడియాలో ఆయన ఇచ్చిన రివ్యూలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. కుబేరా సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X