Kuberaa Trailer Review: కుబేరా ట్రైలర్ రివ్యూ.. డబ్బున్న వాళ్లతోనే తేల్చుకొంటా.. ధనుష్ పవర్‌ఫుల్‌గా
కింగ్ నాగార్జున అక్కినేని, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కుబేరా. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా మారి రూపొందించారు. జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా వేడుకలో ముఖ్య అతిథిగా ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఆయన చేతులు మీదుగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ గురించిన వివరాల్లోకి వెళితే..
సంపన్న వర్గానికి, పేద వర్గానికి మధ్య జరిగిన సంఘర్షణగా కుబేరా చిత్రంగా ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రం కథ మొత్తం డబ్బు, పరపతి, అధికారం అనే అంశాల చుట్టూ తిరిగింది. సంపన్న వర్గానికి బిచ్చగాళ్లకు మధ్య లింకు ఏమిటి? ఇందులో దీపక్‌గా నాగార్జున అక్కినేని పోషించిన పాత్ర ఏమిటి? సంపన్న వర్గాలకు, పేద వర్గాలకు మధ్య ఆయన ఎందుకు నలుగాల్సి వచ్చింది? ఇక బతుకు మీద రష్మిక మందన్న ఎందుకు ఆశను వదులుకొన్నది లాంటి ఎన్నో ప్రశ్నలను ట్రైలర్ రేకెత్తించింది.

కోట్లు కోట్లు అంటే ఎంత సార్ అంటూ దేవాగా ధనుష్ చెప్పిన డైలాగ్స్‌తో ట్రైలర్‌ను మొదలుపెట్టారు. ఇక బిజినెస్ మ్యాగ్నెట్ పలుకుబడి, పరపతి, తన పవర్ గురించి సిద్దప్ప అనే పాత్ర ద్వారా హరీష్ చెప్పడం ద్వారా జిమ్ సరబ్ క్యారెక్టర్ ఏమిటో చెప్పకనే చెప్పారు. ఈ దేశంలో డబ్బు, పవర్ మాత్రమే పనిచేస్తాయి. ఇది చరిత్ర అంటూ దీపక్ పాత్ర నాగార్జున చేత కథలోని ఇంపార్టెంటెన్స్ చెప్పారు. దేవా గ్యాంగుపై చేయి వేయకూడదు అంటూనే.. దేవాను చూశావా? అంటూ రష్మికను చంపడానికి కూడా వెనుకాడని పాత్రలో నాగ్ కనిపించారు.
ఈ ప్రపంచమంతా డబ్బు ఉన్న వాళ్లదే.. వాళ్లది తప్ప ఇక్కడా ఏది ఉండదు అని రష్మిక అంటే.. ఈ ప్రపంచం డబ్బు ఉన్న వాళ్లది కాదు. అందులో నేను కూడా ఉన్నాను. అందులో నా ప్రపంచం కూడా ఉంది. అక్కడే నేను తేల్చుకొంటాను అంటూ ధనుష్ కథలోని కాన్‌ప్లిక్ట్ క్రియేట్ చేసి సినిమా కథను ముందుకు తీసుకెళ్లాడనే విషయం స్పష్టమైంది.
కుబేరా సినిమాకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ వర్క్ గురించి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఆయన పాటలు ఆదరణ పొందగా.. ట్రైలర్‌లోని బీజీఎం సినిమా ఎలా ఉంటుందో అని శాంపిల్‌గా చూపించింది. తో తరణి ప్రొడక్షన్ డిజైన్, బ్యాక్ డ్రాప్ అద్బుతంగా కనిపించాయి. ఇక నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫి ద్వారా కథను బాగా విజువల్స్ ఎలివేట్ చేశాయనిపించింది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు అత్యంత బలంగా మారే అవకాశం ఉందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల కన్విక్షన్, కథలోని వైవిధ్యం కోత్తగా అనిపించింది. ఇలాంటి అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచింది. ఈ అంచనాలకు తగినట్గుగా శేఖర్ కమ్ముల సక్సెస్ అవుతాడా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











