twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కు(సోం)బేరులు(రివ్యూ)

    By Staff
    |

    Kuberulu
    -జోశ్యుల సూర్య ప్రకాష్

    Kuberulu

    సంస్థ:గోదావరి టాకీస్‌
    నటీనటులు:శివాజీ,అలీ,కృష్ణభగవాన్‌,ఫర్జానా,
    కౌశ,శివప్రసాద్‌,భువనేశ్వరి,జ్యోతిలక్ష్మి తదితరులు.
    ‌కథ:శివ మరియు సురేష్
    కెమెరా:రామ్ పినిశెట్టి
    సంగీతం:జీవన్ ధామస్
    మాటలు:దాసరి బ్రహ్మం
    దర్శకత్వం:శ్రీనివాస్‌రెడ్డి
    నిర్మాతలు:కరుటూరి శ్రీనివాస్‌, యాగంటి శ్రీనివాస్
    రిలీజ్ డేట్:04 డిసెంబర్ 2008

    రెగ్యులర్ గా శ్రీనివాస రెడ్డి సినిమా అనగానే దూరదర్శన్ సీరియల్ స్టాండర్డ్స్ లో ఉన్నా కాస్సేపు నవ్వుకోవచ్చు కదా అని వెళతాం. అయితే కుబేరులతో ఈసారి ఆ అమూల్యమైన అవకాశం కూడా ఆయన మనకివ్వదలచుకోలేదు. ప్రతీ ఫ్రేమ్ లో చీప్ కామెడీని,శృతి మించిన శృంగారాన్ని కుప్పలుగా ఒలకపోసి, కథ,నటన,టేకింగ్ వంటివి వదిలేసి మరీ కష్టపడి రూపొందించాడు. మరో ప్రక్క ఎన్నికలు వస్తున్నాయనేమో వైయస్ ప్రభుత్వాన్ని పొగుడుతూ..ఆయన్ని చూపుతూ సినిమాని ప్రభుత్వ ప్రకటనలా పూర్తి చేసాడు.దాంతో కదలని కథతో ఎంతకీ పూర్తి కాని ఫీలింగుతో సహన పరీక్షను ప్రేక్షకుడు ఎదుర్కోవాల్సి వచ్చింది.ఆకర్షణీయంగా ఉన్న టైటిల్ ,పోస్టర్స్ ని బట్టి కొద్ది రోజులు ఆడితే...శ్రీనివాస రెడ్డి కున్న కామెడీ క్రెడిబులటీ తో బి,సి సెంటర్లలలో కొంతలో కొంత వర్కవుట్ అవ్వచ్చు.

    అనగనగా ఓ ఐదువందలకోట్లు విలవచేసే నగల చోరి. అయితే దాన్ని దొంగిలించిన వ్యక్తి పోలీసులు వెనకపడుతూంటే మొన్న బ్లేడు బాబ్జి సినిమాలోలా ఓ చోట గొయ్యి తీసి పాతి పెట్టి ఆ ప్లేస్ ని ఫొటో తీసి ఆ సెల్ ని ఓ ఇంట్లో పెట్టి తన బాస్ కి చెప్పి చచ్చిపోతాడు. ఇదిలా ఉంటే దేవరపల్లి నివాసులైన శివరామ్ ఉరఫ్ జూ.వై.యస్(శివాజి), చిట్టిబాబు(అలీ) తింగరమేళంలా తిరుగుతూంటారు. అలీ సలహాపై శివరామ్ ఆ ఊరి మంచి చేద్దామని ఓ మోసగాడు చేతిలో తాము మోసపోవటమే కాక ఊరివారందరిని మోసానికి గురి అయ్యేలా చేస్తారు.దాంతో ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో కోట్లు సంపాదించుకుని కుబేరులుగా తిరిగి వస్తామని హైదరాబాద్ వస్తారు. అక్కడ అనుకోని స్ధితిలో వారికి తమ బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు ఉరఫ్ రాంబో(కృష్ణ భగవాన్) కలుస్తాడు. వీళ్ళ పిచ్చి కష్టాలు విన్న రాంబో అటువంటివి తీరటానికి ఓ పిచ్చి ఐడియా చెప్తాడు. రీసెంట్ గా సిటీలో ఐదువందలు కోట్ల విలువ చేసే డైమండ్స్ చోరి జరిగిన వార్త చెప్పి దాన్ని సాధిద్దామంటాడు. దాంతో ముగ్గురూ వాటిని అంజనం వేసి డైమండ్స్ పట్టేద్దామని పొలోమంటూ ఓ స్వామీజీని(ఎల్.బి.శ్రీరామ్)ని ఆశ్రయిస్తాడు. ఆయన వీళ్ళని మిస్ గైడ్ చేసి డబ్బు సంపాదిద్దామనుకుంటాడు. ఈలోగా వీళ్ళకు కల్పన(ఫర్జనా)పరిచయమవుతుంది. ఆమె దగ్గర ఆ చోరి కి సంభందించిన ఓ క్లూ ఉంటుంది. మరో ప్రక్క ఓ డాన్ సలీం (శివప్రసాద్ రెడ్డి )ఆ డైమండ్స్ కోసం ట్రై చేస్తూంటాడు.అక్కడ నుండి వాళ్ళు ఆ డైమండ్స్ ని ఎలా సంపాదించారన్నది కుబైరులయ్యారన్నది తెరపై చూడాల్సిందే.

    కథ సరిగా అల్లుకోకుండా షూటింగ్ కి బయిలుదేరిన కంగారు చిత్రంలా ఈ సినిమా ఏడ్పిస్తుంది. ఎక్కడా హీరోలు తమ స్వయం శక్తితో గానీ ప్లాన్స్ తో గానీ ఆ డైమండ్స్ గురించి ఎంక్వైరీ చేయరు...ఫన్ పుట్టించరు. కాసేపు స్వామీజి దగ్గర అంజనం వేసి ఆ డైమండ్స్ ఎక్కడున్నాయో కనుక్కుందామనుకుంటారు..తర్వాత హీరోయిన్ ఇచ్చిన క్లూ అయిన ఓ సెల్ ఫోన్ కోసం వెతకులాట ప్రారంభిస్తాడు. సరే సెల్ ఫోన్ ఎడ్రస్ కోసమన్నా సీరియస్ ప్రయత్నాలు చేస్తారా అంటే అదీ ఉండదు. ఆ సెల్ ఫోన్ డైరక్ట్ గా వచ్చి వీరి చేతికి వచ్చి చేరుతుంది. ఇలా మొయిన్ పాత్రలు ప్యాసివ్ గా మారటం స్క్రీన్ ప్లే లోపమై నిలిచింది. దాంతో కుబేరులు కాస్తా ఏ పనీ చేయక,కథనీ నడిపించక,నవ్వించునూ లేక సోంబేరుల్లా మిగిలి స్క్రీన్ టైం ని,ప్రేక్షకుడు డబ్బుని వేస్ట్ చేసాKuరు.ఏం చేయని హీరోలకు జై కొట్టేదెవరు...అసలు భరించేదెవరు.

    నటీనటుల్లో శివాజి,అలీ ఇద్దరూ వైయస్,చంద్రబాబు లను అనుకరించటం బాగుంది. ఇక కృష్ణ భగవాన్ వి రొటీన్ పంచ్ లు.అవి మనకు ఎంతగా అలవాటు పడిపోయాయంటే తర్వాత డైలాగ్ చెప్పేయవచ్చు. ఫర్జానా తన పెరిగిన శరీరంతో హీరోయిన్ గా చాలా కష్టం అనే ఫీలింగ్ తెప్పించింది . ఇక మిగతావాళ్ళు సొ..సొ.టెక్నికల్ గా విశ్లేషించే రీతిలో ఏ విభాగం కనపడదు.ఇక జ్యోతిలక్ష్మి ని ఎందుకు పెట్టారో డైరక్టర్ కే తెలియాలి. శ్రీనివాస రెడ్డి తన కెరీర్ లో అతి వీక్ స్క్రిప్టు ఇదే నేమో.

    నవ్వులాటకైనా ఈ సినిమాకి వెళ్ళితే ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఇక కామిడీ అంటారా...కొద్ది రోజులు పోతే టీవీల్లో ఎలాగూ బాగున్న సీన్స్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి రోజూ వేస్తూనే ఉంటారు. అన్నీ కలిపి రెండు గంటలు పైగా భరించటం కంటే రెండు నిముషాలు పాటు వాటిని ఎంజాయ్ చేయటం మేలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X