Kumari Srimathi Review: మహిళ బార్ పెడితే ఏం జరిగింది? నిత్యా మీనన్ కుమారి శ్రీమతి రివ్యూ!

Rating: 3/5

వెబ్‌సిరీస్‌ రివ్యూ: కుమారి శ్రీమతి
నటీనటులు: నిత్యామేనన్‌, గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీ మోహన్‌
దర్శకత్వం: గోమఠేష్‌ ఉపాధ్యాయి
కథ: బలభద్రపాత్రుని రమణి, మల్లిక్‌రామ్‌
స్క్రీన్‌ప్లే, సంభాషణలు, షో క్రియేట్‌: శ్రీనివాస్‌ అవసరాల
నిర్మాత: స్వప్న సినిమా
సినిమాటోగ్రఫి: మోహన కృష్ణ
ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి
మ్యూజిక్: స్టెక్కటో అండ్ కమ్రాన్
రిలీజ్ డేట్: 2029-09-28
స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

నిత్యా మీనన్ కుమారి శ్రీమతి కథ ఏమిటంటే?: రామరాజులంక అనే గ్రామంలో శ్రీమతి (నిత్యా మీనన్), ఆమె బాబాయి కేశవరావు (ప్రేమ్ సాగర్) మధ్య ఆస్తికి సంబంధించిన విభేదాలు ఉంటాయి. అయితే తమ ఇంటిని అమ్మమని శ్రీమతి తాతయ్యకు (మురళి మోహన్)కు చిన్నతనంలో మాట ఇస్తుంది. అయితే కేశవరావు మాత్రం ఆ ఇల్లు తనదే అంటూ తన అన్నయ్య (నరేష్) తనకు రాసిచ్చాడని కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఇక ఆ ఇంటిని అమ్మి.. ఆస్తి మొత్తాని కాజేయాలని కేశవరావు ప్రయత్నం చేస్తుంటాడు. కోర్టులో కేసు 18ఏళ్లుగా నడుస్తుండగా.. చివరకు కోర్టు శ్రీమతికి 6 నెలల గడువు ఇస్తుంది. 6 నెలల్లో 38 లక్షలు కట్టి ఇంటిని సొంతం చేసుకోవచ్చని తీర్పుని ఇస్తుంది. మరి తన ఇంటి కోసం శ్రీమతి ఏ విధంగా డబ్బులు సంపాదించింది.. ఊళ్లో బార్‌ పెట్టడానికి ఆమె పడిన కష్టం ఏంటి? మహిళ బార్ పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనే కథాంశంతో ఈ సీరిస్ తెరకెక్కింది.

  Kumari Srimathi Telugu Review

కుమారి శ్రీమతి వెబ్ సిరీసులో ట్విస్టులు: శ్రీమతి 6 నెలల్లో 38 లక్షలు సంపాదించాలి. ఉద్యోగం చేస్తే కేవలం 13వేలు.. ఇక పక్కింటి అబ్బాయి శ్రీరామ్ (నిరుపమ్) సలహాతో బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. మరి వయసు 30 దాటినా.. ఇంకా పెళ్లి కాని ఓ మహిళ ఊర్లో బార్ పెట్టడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. బార్ పెట్టడానికి ఆమె పడిన కష్టం ఏంటి.. ఇంట్లో వాళ్లు పెళ్లి పెళ్లి అంటూ ఫోర్స్ చేస్తున్నా.. తన లక్ష్యం సాధించుకునేందుకు శ్రీమతి ఏం చేసింది.. అసలు శ్రీమతి తండ్రి.. తన వాళ్లను వదిలి ఎక్కడికి వెళ్లారు... శ్రీమతి చిన్ననాటి స్నేహితుడు అభి, కళాశాల మిత్రుడు దొరబాబు చేసిన సాయం ఏంటి.. చివరకు శ్రీమతి బార్ పెట్టి సక్సెస్ అవుతుందా అనేది ఈ సిరీస్ కథ.

మొత్తానికి ఈ సిరీస్ ఎలా ఉందంటే... రామరాజులంక అనే గ్రామంలో శ్రీమతి అనే మహిళ 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా తన ఇంటికోసం పోరాటం చేస్తూ ఉంటుంది. తాతకు ఇచ్చిన మాట కోసం తన ఇంటిని కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఈ సిరీస్ లో కామెడీ చూపిస్తునే.. ఎమోషన్ వైపు దర్శకుడు మళ్లీస్తాడు. ఓ వైపు ఊర్లో అంతా పెళ్లి చేసుకోలేదు.. అంటూ ఎత్తిపోడుస్తూ ఉంటారు. శ్రీమతి తల్లిగా గౌతమి నటించింది.

  Kumari Srimathi Telugu Review

మొదటి ఎపిసోడ్ లో శ్రీమతి కుటుంబం నేపథ్యంతో పాటు.. పాత్రలను ఇంట్రడ్యూస్ చేశారు. తన తాతయ్య ఇల్లు.. దక్కించుకునేందుకు రూ.38లక్షలు సంపాదించడం.. అందుకు ఊళ్లో బార్‌ పెట్టాలని శ్రీమతి నిర్ణయం తీసుకోవడం.. వంటి కీలక అంశాలతో మొదటి ఎపిసోడ్‌ను ముగిస్తారు. ఇక తర్వాతి ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందోననే ఆసక్తిని కలిగించారు. శ్రీమతి బార్‌ పెట్టేందుకు పడే అవస్థలను దర్శకుడు బాగా చూపించాడు. ఇక కేశవరావు, అతని కొడుకుల సీన్స్ కాస్త కామెడీని కలిగించాయి.

ఇక శ్రీమతిని పక్కింటి అబ్బాయి శ్రీరామ్ ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఆ విషయం చెప్పలేక తనలోనే దాచుకుంటాడు. ఇంతలో శ్రీమతి చిన్ననాటి స్నేహితుడు అభిరామ్ రాకతో కథలో మలుపులు చోటుచేసుకుంటాయి. ఇక ఓ వైపు శ్రీమతి బార్ ప్రయత్నాలకు అభి సాయం చేయడం.. వారి మధ్య లవ్ ట్రాక్ నడవడం.. ఆసక్తిగా ఉంటుంది. అయితే వారి జోడి మాత్రం అంతగా స్క్రీన్ పై సెట్ అవ్వలేదని భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.

ఇక తర్వాతి ఎపిసోడ్స్ శ్రీమతి తాజ్ మహాల్ అనే బార్ పెడుతుంది. కానీ ఊర్లో వాళ్లు వచ్చి బార్ ను నాశనం చేస్తారు. మా మొగుళ్లు తాగి కొడుతున్నారంటూ బార్ లోని సామగ్రిని నాశనం చేసి వెళ్తారు. ఇక ఆ తర్వాత శ్రీమతి ఆ ఊరి వాళ్లను ఎలా ఒప్పించింది... మధ్యలో నాని గెస్టు రోల్ లో వచ్చి.. శ్రీమతికి ఎలా సాయం చేశాడు.. ఇంతకీ శ్రీమతి 38 లక్షలను సాధించిందా... వాళ్ల నాన్న నరేష్ ఏమయ్యాడు.. చివరకు ఆ ఇంటిని దక్కించుకుంటుందా.. అనేది ఈ సీరిసు చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ఈ కుమారి శ్రీమతి సిరీస్ చూసిన ప్రేక్షకుల మదిలో కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి.ఈ సిరీస్ లో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే దర్శకుడు సిరీస్ ను ముగించాడు. మరీ ముఖ్యంగా శ్రీరామ్‌ తన ప్రేమను శ్రీమతికి చెప్పాడా? లేదా? అలాగే ఇంట్లో దొరికిన కాగితాలను శ్రీమతి ఎందుకు చింపుతుంది.. భార్య పిల్లలను వదిలి విశ్వేశ్వరరావు ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నాడు? చివరకు విశ్వేశ్వరరావుకు కాల్ చేసింది ఎవరు... తదితర ప్రశ్నలకు సమాధానం లేదు. బహుశా 'కుమారి శ్రీమతి2' ఉంటుందేమో చూడాలి.

  Kumari Srimathi Telugu Review

ఫైనల్ గా ఎలా ఉందంటే... శ్రీమతిగా నిత్యా మీనన్ వన్ ఉమెన్ షో అని చెప్పవచ్చు. ఇక నిరుపమ్ కార్తీక దీపం తర్వాత వెబ్ సిరీస్ లో నటించారు. ఆయన నటన కూడా ఆకట్టుకుంది. ఇక నాని గెస్టు రోల్ లో వచ్చి కథను మలుపు తిప్పుతాడు. ఇది ఒక భావోద్వేగ పరమైన మహిళా సాధికారత సిరీస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సీరిస్ ను ఇంటి వాళ్లందరితో కలిసి చూడొచ్చు. ఎలాంటి అసభ్యత, అశ్లీల పదాలు లేకుండా నీట్ గా తెరకెక్కించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పాత్రలన్నీ పల్లెటూళ్లలో మన పక్కింట్లో ఉన్న వాళ్లలానే అనిపిస్తాయి. ఈ వీకెండ్‌లో టైమ్‌ పాస్‌ కోసం ఏదైనా వెబ్‌సిరీస్‌ చూడాలనుకుంటే 'కుమారి శ్రీమతి' కచ్చితంగా చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X