L2: Empuraan First Review: L2: ఎంపురాన్ ఫస్ట్ రివ్యూ! లూసిఫర్ కంటే బెటర్‌గా ఉందా? అంటే!

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, స్టార్ హీరో అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం L2: ఎంపురాన్. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం మార్చి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

తన సవతి తల్లి కుమారుడు జతిన్‌ రాందాస్ (టొవినో థామస్)కు రాజ్యాధికారం అప్పగించడంలో స్టీఫెన్ (మోహన్ లాల్) సఫలమవుతాడు. దాంతో తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని పాలిస్తుంటాడు. ఇది తొలి భాగం లూసిఫర్‌లో జరిగిన కథ. ఇక రెండో భాగం ఎంపురాన్‌లో జతిన్ పాలిస్టున్న రాష్ట్రానికి ఎన్నికలు ఆసన్నమవుతాయి. ఈ క్రమంలో శత్రు వర్గాలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్లాన్ చేస్తారు. దాంతో తన శక్తి మించిన నిర్ణయాలు తీసుకొనే అవసరం ఏర్పడుతుంది. ఆ క్రమంలో స్టీఫెన్ అలియాస్ లూసిఫర్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడు.

L2  Empuraan First Review

ఖురేషి అబ్రహం అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి గత చరిత్ర ఏమిటి? ఖురేషి అబ్రహం ఏం చేసేవాడు? తాను కాపాడుతున్న రాజ్యాన్ని క‌బ‌లించ‌టానికి బ‌ల‌వంతులైన శ‌త్రువులంద‌రూ ఏక‌మై యుద్ధం ప్రకటిస్తే.. స్టీఫెన్ ఏం చేశాడు? జతిన్‌కు స్టీఫెన్ ఎలాంటి సహాయం చేశాడు. చీకటి గ్రహాల మధ్య రాజకీయ వ్యూహాలు ఎలా కొనసాగాయి. వాటిని స్టీఫెన్ ఎలా తిప్పి కొట్టాడు? జాయెద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎలాంటి పాత్ర పోషించాడు? ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్), గోవర్దన్ (ఇంద్రజిత్ సుకుమారన్) రాజకీయంగా ఎలాంటి పావులు కదిపారు? దైవపుత్రుడే అన్యాయం చేశాడా? సైతాన్‌ను సహాయం ఎందుకు కోరారు? త‌న రాజ్యాన్ని, ప్ర‌జ‌ల‌ను స్టీఫెన్ ఎలా కాపాడుకున్నాడ‌నేదే క‌థాంశం

ఎంపురాన్ చిత్రంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు నటించారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి, దీపక్ దేవ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 59 నిమిషాల 52 సెకన్లుగా కట్ చేశారు.

L2  Empuraan First Review

ఎంపురాన్ సినిమాకు ఇటీవల సెన్సార్ జరిగింది. ఈ సినిమాను వీక్షించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికేషన్ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా క్లీన్ చిట్ ఇచ్చారు. తొలి భాగం లూసిఫర్ మూవీని మించిన ట్విస్టులు, ట‌ర్నులు ఉన్నాయి. రాజకీయ వ్యూహాలు, ప‌న్నాగాలు, వాటిని తిప్పి కొట్టే ప్ర‌తి వ్యూహాలు, ధీటైన హీరోయిజం.. వావ్ అనిపించే స‌న్నివేశాలు, నిర్మాణాత్మ‌క విలువ‌లతో L2E: ఎంపురాన్ రూపొందింది అనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. లూసిఫర్ 2: ఎంపురాన్ ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడం ఖాయంగా కనిపిస్తున్నది.

లూసిఫర్ ఎంట్రీ, ఖురేషి బ్యాక్ స్టోరి ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో L2E: ఎంపురాన్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. యూకే, దుబాయ్, అమెరికాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించిన యాక్షన్ సీన్లు, బాంబ్ బ్లాస్టింగ్ సీన్లు నేచురల్‌గా తగిన జాగ్రత్తలు తీసుకొని చేశామని దర్శకుడు సుకుమార్ ఇటీవల వెల్లడించారు. చాలా తక్కువగా గ్రాఫిక్స్ వాడామని స్పష్టం చేశఆరు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన లూసిఫ‌ర్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. మూడు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఇది రెండో భాగం అనేది తెలిసిన విషయమే.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X