L2: Empuraan Movie Review: L2: ఎంపురాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌, మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు
దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్
కథ: మురళీ గోపి
నిర్మాతలు: ఆంటోని పెరుంబవూర్, గోకుళం గోపాలన్
సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: అఖిలేష్ మోహన్
మ్యూజిక్: దీపక్ దేవ్
బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకుళమ్ మూవీస్
రన్ టైమ్: 180 నిమిషాలు
రిలీజ్ డేట్: 2025-03-27

కేరళలో జతిన్ రామ్‌దాస్ (టొవిన్ థామస్) రాష్ట్ర ఎన్నికలకు సిద్దమవుతూ తన తండ్రి పీకేఆర్ (సచిన్ ఖేడ్కర్) స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టాలనుకొంటాడు. అయితే తన సోదరుడి నిర్ణయంతో షాక్ తిన్న ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్) తన తండ్రి పార్టీ ఐయూఎఫ్‌లో చేరుతుంది. దాంతో సెంట్రల్ పార్టీ ఆమెను అరెస్ట్ చేస్తుంది. పీకేఆర్ కుటుంబ కలహాలను పరిష్కరించడానికి స్టీఫెన్ (మోహన్ లాల్) రంగంలోకి దిగుతాడు.

L2  Empuraan Movie Review in Telugu

పీకేఆర్ స్థాపించిన ఐయూఎఫ్ పార్టీ నుంచి జతిన్ ఎందుకు బయటకు వచ్చాడు? ప్రియదర్శిని ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? బల్రాజ్ అలియాస్ బాబా భజరంగీ కేరళ రాజకీయాల్లో ఎందుకు తలదూర్చాడు? నెడూంపల్లి నుంచి స్టీఫెన్ ఎందుకు? ఎక్కడికి వెళ్లిపోయాడు? నెడూంపల్లిలో డ్యామ్ కట్టే విషయంలో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకొన్నాయి? తన నియోజకవర్గాన్ని కాపాడుకొనేందుకు స్టీఫెన్ ఏం చేశాడు? స్టీఫెన్‌కు నీడలా ఉండే సయీద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? సయీద్ ఎవరిపై పగ తీర్చుకోవాలనుకొన్నాడు? చివరకు జతిన్ రామ్ దాస్‌ పరిస్థితి ఏమైంది? అబ్రామ్ ఖురేషి (మోహన్ లాల్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంపురాన్ సినిమా కథ.

ఎంపురాన్ మూవీ ఇరాక్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో మొదలై ఆసక్తిని రేపుతుంది. ఆ తర్వాత 2002 సంవత్సరంలో జరిగిన మతకల్లోల ఎపిపోడ్ హృదయాన్ని పిండేసేలా పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించాడు. సుదీర్ఘంగా ఎపిసోడ్‌తో దర్శకుడిగా తాను ఏం చెప్పబోతున్నాడో భారీ హింట్ ఇచ్చాడు. కానీ ఫస్టాఫ్‌ను సాగదీసి.. ఓ దశలో సహనానికి పరీక్ష పెట్టేలా చేశాడు. కానీ సన్నివేశాలు, భారీ ఎపిసోడ్స్ విషయంలో బోర్ కొట్టుకుండా తన ప్రతిభను చూపించాడు. కేరళ రాజకీయాలు, విదేశాల్లో కుట్రల నేపథ్యంగా అబ్రామ్ ఖురేషి పాత్రను పరిచయం చేసి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు.

ఇక సెకండాఫ్‌లో సాగదీత లేకుండా కేరళ పాలిటిక్స్‌‌తో కథను రసవత్తరంగా చెప్పాడు. వారసత్వం రాజకీయాలు, పదవి కోసం గొడవలు రొటీన్‌గా ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ చుట్టే స్టీఫెన్ అలియాస్ ఖురేషి పాత్ర తిరుగుతుంది. కథలో ట్విస్టులు, టర్నులతోపాటు హీరోయిజం, ఎలివేషన్‌తో పృథ్వీరాజ్ తన పని కానిచ్చేశాడు. అయితే పార్ట్ 2 విషయానికి వస్తే.. బలమైన, కొత్త పాయింటేమీ లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. ఇక పార్ట్ 3 కోసం మంచి ఎలివేషన్ ఎపిసోడ్ ఇచ్చి మరింత క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడనపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. సినిమాలోని అన్ని పాత్రలను బాలెన్స్ చేస్తూ.. ప్రతీ పాత్రకు తగిన క్యారెక్టరైజేషన్‌ డిజైన్ చేయడం ఈ సినిమాకు బ్యూటీగా మారింది. ఇక మోహన్ లాల్ పాత్ర సన్నివేశాలు రొటీన్ అవుతున్నాయనే సమయంలో ఎంట్రీ ఇచ్చి స్టోరీకి హై ఇచ్చే ప్రయత్నం చేసింది. మోహన్ లాల్ తన ఇమేజ్ ఏ మాత్రం తగ్గుకుండా హీరోయిజం, హుందాగా నటించాడు. ఇక జతిన్, మంజు వారియర్ కూడా సినిమాకు బలంగా నిలిచే విధంగా ఫెర్ఫార్మెన్స్ చేశారు. ప్రధానం మంజు వారియర్.. పొలిటికల్ ఎంట్రీ ఎపిసోడ్ సినిమాకు క్రేజీగా మారింది. చివర్లో సయీద్ పాత్ర ద్వారా పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌లో హీరోయిజాన్ని చూపించి సినిమాను పరిపూర్ణంగా మార్చే ప్లాన్ చేశారు. మతకల్లోలా ఎపిసోడ్‌లో అమీర్ ఖాన్ సోదరి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. కార్తీకేయ దేవ్ మంచి యాక్టింగ్‌తో ఫుల్ మార్కులు కొట్టేశాడు.

ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు దీపక్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి హైలెట్‌గా నిలుస్తాయి. విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి ఉందనిపిస్తుంది. ఫస్టాఫ్ నిడివి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ విషయంలో కొంత కేర్ తీసుకొని ఉంటే.. సినిమా కథనంలో వేగం పెరిగి ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. నటీనటుల ఎంపిక, లొకేషన్స్ సెలక్షన్‌తో సినిమాకు రిచ్‌నెస్ తెచ్చిపెట్టింది.

L2: ఎంపురాన్ సినిమా యాక్షన్, ఎమోషన్స్, పాలిటిక్స్ మిళితం చేసి రూపొందించిన చిత్రం. లూసిఫర్‌ సినిమాలో అనుసరించిన పంథానే ఈ మూవీకి పాటించి.. చాలా సేఫ్‌గా గేమ్ ప్లే చేశారు. మోహన్ లాల్ ఎలివేషన్స్‌పై ఎక్కువగా ఆధారపడి ఉండటం రొటీన్‌గా మారింది. కథ, కథనాల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ స్క్రీన్ ప్లే నార్మల్ ఆడియెన్స్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. లెంగ్త్ ఈ సినిమాకు కొంత మైనస్. యాక్షన్ లవర్స్, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్‌కు, లూసిఫర్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ చూడాలనే వారికి.. ఎంపురాన్ మంచి ఆప్షన్.

Take a Poll

More from Filmibeat

Read more about: mohanlal prithviraj sukumaran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X