L2: Empuraan Twitter Review: L2: ఎంపురాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ హిట్ కొట్టారా?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ హీరో అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం L2: ఎంపురాన్. లూసిఫర్ మూవీకి సీక్వెల్‌గా రూపొందించిన ఎంపురాన్‌లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు నటించారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి, దీపక్ దేవ్ మ్యూజిక్ అందించారు.

శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం మార్చి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే?

L2  Empuraan Movie Twitter Review

ఫస్టాఫ్ చాలా యావరేజ్‌గా ఉంది. సెకండాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది. చివరి 20 నిమిషాల్లో స్టీఫెన్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయడం పీక్స్‌లో ఉంది. ఇద్దరు మోహన్ లాల్‌లు స్క్రీన్ మీద కలుసుకోవడం స్క్రీన్ బద్దలైందా అనిపిస్తుంది. ఎయిర్‌పోర్టులో బాణాసంచా కాల్చడం, బాంబ్ స్క్వాడ్ సీక్వెన్స్ అదిరిపోయాయి. పార్ట్ 3 కోసం ఇచ్చిన హింట్ అదిరిపోయింది అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.


ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ల డెప్త్ బాగుంది. సెకండాఫ్‌లో కథ కోసం వేసిన స్క్రీన్ ప్లే ఆసక్తిని పెంచింది. సెకండాఫ్ డిజాపాయింట్ చేయదని అనుకొంటున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఎంపురాన్ సినిమా ఫస్టాఫ్ ఒకేలా ఉంది. అన్ని క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ వల్ల కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్టాఫ్ 1.38 నిమిషాలు ఉంది. కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా ఫుల్లుగా రిచ్‌గా ఉంది. సినిమా టాప్ లెవెల్‌లో ఉంది. బీజీఎం, డైరెక్షన్, సినిమాటోగ్రఫి అదిరిపోయాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఎంపురాన్ సినిమా చూస్తున్నాను. సయీద్ ఫ్లాష్ బ్యాక్ తొలి 30 నిమిషాల్లో ముగిసింది. మురళీ గోపి డైలాగ్స్ అదిరిపోయాయి. లాలెట్టా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఈ సినిమా ఎక్సలెంట్, ట్రూ క్లాసిక్ అంటూ ఎంపురాన్ గురించి నెటిజన్ కామెంట్ చేశాడు.

ఎంపురాన్ షో మొదలైంది. ఇరాక్‌లో కథ ప్రారంభఇంచారు. అక్కడ మత కల్లోలను చాలా బ్రూటల్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ అనేది నా అభిప్రాయం అంటూ ఓ నెటిజన్ తొలి షో ఆరంభమైన తర్వాత ట్వీట్ చేశాడు.

ఎంపురాన్ సినిమా రిలీజ్ నేపథ్యంలో సూపర్ స్టార్ మమ్ముట్టి ట్వీట్ చేశారు. చారిత్రాత్మక విజయానికి సిద్దమవుతున్న ఎంపురాన్ చిత్ర యూనిట్‌కు, నటీనటులకు నా బెస్ట్ విషెస్. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సరిహద్దులను చెరిపేసింది. మలయాళ సినిమా రంగాన్ని గర్వంగా తలఎత్తుకొనేలా చేసింది. ఇలాంటి బాటను వేసిన నా ప్రియమైన లాల్, పృథ్వీకి ధన్యవాదాలు అంటూ మమ్ముట్టి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎంపురాన్ సినిమాలో పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్లను పోషించిన నటీనటులను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. ఈ సినిమాను బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా మార్చేందుకు యూనిక్ ఫ్లేవర్‌ను వారు తీసుకొచ్చారు. ఈ సినిమాను మార్చి 27 తేదీ నుంచి థియేటర్లలో చూడండి అని నెటిజన్ కామెంట్ చేశారు.

ఎంపురాన్ సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ సాధించాలని మా ప్రియమైన లాలెట్టన్ (మోహన్‌లాల్) కోరుతున్నాం. ఈ సినిమా విజయం సాధించాలని కేరళ దళపతి విజయ్ ఫాన్స్ తరఫున చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాం అని నెటిజన్లు చూపించారు.

ఎంపురాన్ సినిమా యూనిట్‌కు నందమూరి బాలకృష్ణ అభిమానులు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ గారికి, స్టార్ యాక్టర్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి, చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ సినిమా ఇప్పటికే బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున అభినందనలు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: mohanlal prithviraj sukumaran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X