twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Laal Singh Chaddha Review అమీర్ ఖాన్ మార్కుకు దూరంగా.. నాగచైతన్య మెప్పించాడా అంటే?

    |

    Rating:
    2.5/5

    Recommended Video

    లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia

    అమీర్ ఖాన్ అంటే మిస్టర్ ఫర్‌ఫెక్ట్. కథ, కథనాలు, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రతిభావంతుడు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో చిత్రాలతో మెప్పించారు. ఇలాంటి మిస్టర్ ఫర్‌ఫెక్ట్ నుంచి వచ్చిన చిత్రం లాల్ సింగ్ చద్దా. హాలీవుడ్‌ చిత్రం ఫారెస్ట్ గంప్ చిత్రానికి ఈ సినిమా రీమేక్. ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రం కావడంతో లాల్ సింగ్ చద్దాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మునుపటి మాదిరిగానే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాడా? తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేసుకొన్నాడా అనే విషయాలు తెలుసుకొనే ముందు లాలా సింగ్ చద్దా గురించి చర్చించుకొందాం పదండి.

    లాల్ సింగ్ చడ్డా కథ ఏమిటంటే?

    లాల్ సింగ్ చడ్డా కథ ఏమిటంటే?


    సైన్యంలో సేవలందిస్తూ అమరులైన కుటుంబానికి చెందిన లాల్ సింగ్ చద్దా (అమీర్ ఖాన్) బాల్యంలో రెండు కాళ్లు పనిచేయని అంగవైకల్యంతో బాధపడుతుంటాడు. తల్లి చాటు బిడ్డగా పెరిగిన లాల్‌కు బాల్యంలో కొన్ని అవమానాలను ఎదుర్కొంటారు. అయితే తన బాల్య స్నేహితురాలు రూప (కరీనా కపూర్ ఖాన్) అందించిన మానసిక స్థైర్యంతో కొన్ని పరిస్థితుల వల్ల అంగవైకల్యం నుంచి బయటపడటమే కాకుండా జీవితంలో పరుగు మొదలుపెడుతాడు. తల్లి కోరిక మేరకు ఆర్మీలో చేరుతాడు. కార్గిలో యుద్ధంలో గాయానికి గురైన లాల్ సైన్యం నుంచి రిటైర్ అవుతాడు.

    లాల్ సింగ్ చద్దా మూవీలో ట్విస్టులు

    లాల్ సింగ్ చద్దా మూవీలో ట్విస్టులు

    లాల్ సింగ్ బాల్యంలో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏమిటి? స్నేహితురాలైన రూప ప్రేమలో ఎందుకు పడ్డాడు. సినీ నటి కావాలనుకొన్న రూప ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నది? లాల్ జీవితంలో తారసపడిన బాలరాజు (నాగచైతన్య) కథేంటి? బాలరాజు జీవిత లక్ష్యాన్ని లాల్ పూర్తి చేశాడా? సైన్యంలో ఉండగా లాల్‌కు బాలరాజు ఎలా అండగా ఉన్నాడు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రూప‌తో జీవితం ఎలా సాగింది? రూప, లాల్ కలుసుకోవడానికి ఏర్పడిన అవాంతరాలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే లాల్ సింగ్ చద్దా సినిమా కథ.

    లాల్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    లాల్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    పఠాన్ కోట్ నుంచి చంఢీగడ్‌ వరకు లాల్ సింగ్ చద్దా తాను చేసే రైలు ప్రయాణంలో తన జీవిత అనుభవాలను చెప్పడం ద్వారా సినిమా కథ ప్రారంభమవుతుంది. బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ నిడివి ఎక్కువగా ఉండటంతో నిదానంగా, నిస్సారంగా కథ సాగుతుంది. ఇక సైన్యంలో చేరడానికి ముందు అథ్లెట్‌గా లాల్ జీవితం కొంత వినోదంగా, అప్పడప్పుడు కొంత హాస్యాన్ని అందిస్తుంది. ఇక బాలరాజు, లాల్ పాల్గొన్న కార్గిల్ యుద్ధ సన్నివేశాలు భారీగానే చిత్రీకరించారు. కానీ యుద్ధం సీన్‌లో కావాల్సిన ఎమోషన్స్ పండించలేకపోయారు. బాలరాజుకు సంబంధించిన ఒక ఎమోషన్ సీన్‌తో ఫస్టాఫ్ ఏదో అలా ముగిసిందనిపిస్తుంది.

    లాల్ సెకండాఫ్ ఇలా..

    లాల్ సెకండాఫ్ ఇలా..

    ఇక సెకండాఫ్‌లోనైనా రూప, లాల్ మధ్య అఫైర్‌లో ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ బలంగా ఉంటుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతంది. విపరీతమైన సాగదీత సహనానికి పరీక్షను పెడుతుంది. కార్గిల్ యుద్ధంలో కాపాడిన పాక్ మిలిటెంట్ మహ్మద్ ఎపిసోడ్‌కు ముంబై బాంబు పేలుళ్లను లింక్ చేయడం ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాదాసీదాగా నాసిరకంగా సన్నివేశాలు సాగుతాయి. సినిమా చివరి 20 నిమిషాలు మరీ అధ్వాన్నంగా ఉంటుంది.

    దర్శకుడు అద్వైత్ చందన్ గురించి

    దర్శకుడు అద్వైత్ చందన్ గురించి

    ఫారెస్ట్ గంప్ సినిమా కథలోని ఆత్మను తీసుకొని.. భారతీయ చరిత్రలో జరిగిన ఇందిరాగాంధీ హత్య, మండల్ కమిషన్, సిక్కుల ఊచకోత, అద్వానీ రథయాత్ర, ముంబై బాంబు పేలుళ్ల సంఘటనలతో కథను అల్లుకొన్న తీరు బాగుంది. కానీ ఆ సంఘటనలు కథకు లింక్ లేకపోవడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించదు. ఆ సంఘటన ద్వారా కథైనా ఎమోషనల్‌గా డ్రైవ్ అయినట్టు కనిపించదు. ఈ విషయంలో దర్శకుడు అద్వైత్ చందన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక లాల్ కథకు ఎక్కడ ముగింపు పలకాలో తెలియని గందరగోళంలో దర్శకుడు పడినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.

    అమీర్ ఖాన్ ఫెర్ఫార్మెన్స్

    అమీర్ ఖాన్ ఫెర్ఫార్మెన్స్

    ఎలాంటి పాత్రనైనా తన నటనా ప్రతిభతో ఆకట్టుకోవడం అమీర్ ఖాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ సినిమా బలమైన కథ, ఆకట్టుకొనే సన్నివేశాలు, గుండెను పిండేసే ఎమోషన్స్ లేకపోవడం వల్ల అమీర్ ఖాన్ పాత్ర డీలా పడింది. ఏ స్టేజ్‌లో కూడా కథ, పాత్రలతో కనెక్ట్ చేయలేకపోవడం సినిమాకు మైనస్. సినిమా భారాన్నంతా తానే మోసాడు కానీ.. తన పాత్ర భారాన్ని, ఎమోషన్స్‌ను ప్రేక్షకుడికి షిఫ్ట్ చేయడంలో వైఫల్యం కనిపిస్తుంది. పీకేకు కొనసాగింపుగా పాత్ర ఉందా అనిపిస్తుంది.

    బాలరాజుగా నాగచైతన్య

    బాలరాజుగా నాగచైతన్య

    కరీనాకపూర్ మోడల్‌గా, బాలీవుడ్‌లో అవకాశాల కోసం మాఫియా బారిన పడిన ఔత్సాహిక నటిగా రూప పాత్రలో కనిపించింది. గతంలో మాఫియా కేసులో అరెస్ట్ అయిన మోనికా బేడి పాత్రను పోలీ ఉంటుంది. క్లైమాక్స్‌లో కరీనా కపూర్ పాత్ర కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక నాగచైతన్య ఏ మాత్రం తన కెరీర్‌కు, ప్రేక్షకుల గుర్తింపుకు నోచుకోలేని బాలరాజు పాత్రలో కనిపించాడు. బలంగా క్యారెక్టర్ లేకపోవడం ఒకటైతే.. నోట్లో డెంటల్ క్లిప్ పెట్టి.. చైతును మరింత ఇబ్బందిగా చూపించడం వెనుక కారణం ఏమిటో అర్ధం కాదు. అక్కినేని ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చాడు. చద్దా తల్లిగా మోనా సింగ్ ఫర్వాలేదనిపించింది. మహ్మద్‌గా మానవ్ విజ్ కూడా ఒక సన్నివేశంలో ఆకట్టుకొన్నాడు.

    టెక్నికల్ టీమ్ పనితీరు

    టెక్నికల్ టీమ్ పనితీరు


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కార్గిల్ ఎపిసోడ్స్, లడఖ్, పంజాబ్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు బాగుంటాయి. ఎడిటర్‌గా హేమంత్ సర్కార్‌‌కు ఇంకా బోలెడంత పని ఉంది. తనుజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రీతమ్ పాటలు ఆకట్టుకోలేకపోయాయి. అమీర్ ఖాన్, వయాకామ్, పారమౌంట్ బ్యానర్ నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    భారమైన పాత్రలు, భావోద్వేగాలు, దేశభక్తి లాంటి అంశాలకు స్కోప్ ఉన్న చిత్రం లాల్ సింగ్ చద్దా. అలాంటి అంశాలను తెర మీద పూర్తిస్థాయిలో పండించలేకపోవడం ఈ సినిమాకు మైనస్. ఈ సినిమాకు నిడివి మరో శాపం. కథలో అనేక లోపాల కారణంగా క్లైమాక్స్‌లో స్టోరి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియని సందిగ్ధంతో లాగి లాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినంత పనిచేశారు. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా వీక్. అమీర్ ఖాన్ ఫ్యాన్స్‌కు నచ్చే అవకాశం ఉంది. సాధారణ ప్రేక్షకులకు సలహా ఏమిటంటే?. మీ వద్ద చాలా సమయం ఉండి.. ఏమీ పనిలేకపోతే.. థియేటర్‌కు వెళ్లి చూడండి.. బెస్ట్ ఆఫ్ లక్..

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    సినిమాటోగ్రఫి
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    అమీర్ ఖాన్, కరీనా పెర్ఫార్మెన్స్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    ఎమోషన్స్ పండకపోవడం
    సాంగ్స్
    నిడివి

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, నాగచైతన్య, కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు
    దర్శకత్వం: అద్వైత్ చందన్
    రచన: అతుల్ కులకర్ణి
    నిర్మాత: అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
    సినిమాటోగ్రఫి: సత్యజిత్ పాండే
    ఎడిటింగ్: హేమంతి సర్కార్
    మ్యూజిక్: తనుజ్ టికు, ప్రీతమ్
    బ్యానర్: అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్
    రిలీజ్ డేట్: 2022-08-11

    ట్యాగ్ లైన్: లాంగ్ సింగ్ చడ్డా.

    English summary
    Aamri Khan's laal singh chaddha released on August 11th worldwide. Here is the exclusive review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X