For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ladki movie review.. అమ్మాయి మూవీతో వర్మ మ్యాజిక్ చేశారా అంటే?

  |

  rating: 2/5

  నటీనటులు: పూజా భలేకర్, మియా ముఖి,అభిమన్యు సింగ్, రాజ్‌పాల్ యాదవ్ తదితరులు
  దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
  నిర్మాతలు: నరేష్ టీ, శ్రీధర్, రాంగోపాల్ వర్మ
  మ్యూజిక్: రవి శంకర్
  సినిమాటోగ్రఫి: రమ్మీ
  ఎడిటర్: సాన్ లోకేష్
  రిలీజ్ డేట్: 2022-07-15

  లడ్కీ మూవీ కథ

  లడ్కీ మూవీ కథ


  పూజా (పూజా భలేకర్)‌కు బ్రూస్ లీ అంటే అమితమైన ఇష్టం. బ్రూస్‌ లీ స్పూర్తితో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదిస్తుంది. అయితే తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువుకు సంబంధించిన ఇన్స్‌స్టిట్యూట్‌పై ల్యాండ్ మాఫియా కన్నుపడుతుంది. కోచింగ్ సెంటర్ లాండ్‌ను కబ్జా పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఓ దశలో తనకు ప్రాణకంటే ఇష్టమైన కోచ్‌ను ల్యాండ్ మాఫియా చంపేస్తారు.

  లడ్కీ మూవీలో ట్విస్టులు

  లడ్కీ మూవీలో ట్విస్టులు


  చిన్నతనంలో పూజాపై మనసుపై బలంగా ప్రభావం చూపిన చెడు సంఘటన ఏంటి? పూజా ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకొన్నది? ల్యాండ్ మాఫియా బెదిరింపులకు పూజా భయపడిందా? తన కోచ్ హత్య తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? పూజా చేరుకోవాలనే లక్ష్యాన్ని రీచ్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే లడ్కీ (అమ్మాయి) సినిమా కథ.

  లడ్కీ మూవీ ఎలా సాగిందంటే

  లడ్కీ మూవీ ఎలా సాగిందంటే


  అమ్మాయి (లడ్కీ) చిత్రం కాఫీ షాప్‌లో ఓ ఎమోషనల్ సన్నివేశంతోపాటు మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో కథ మొదలవుతుంది. తన జీవితంలో జరిగిన సంఘటనను తన ప్రియుడు (మియా ముఖి)తో రెండు ముక్కల్లో చెప్పుకొని అసలు కథలోకి వెళ్లడంలో ఎలాంటి ఆలస్యం జరగదు. ఇక పూజా మనసుకు దగ్గరనైన ప్రియుడితో రొమాంటిక్ సన్నివేశాలు మొదల్లో బాగానే ఉన్నా.. కొద్దిసేపటి తర్వాత నాసిరకంగా, అసందర్భంగా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కోచ్ మరణం తర్వాత కథలో వేగం పుంజుకొంటుంది. అయితే కథ లేకుండా కేవలం పూజా మార్షల్ ఆర్ట్ ప్రతిభ, అలాగే రొమాంటిక్ అంశాలపై ఫోకస్ చేయడం వల్ల ప్రేక్షకుడిని పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది.

   వర్మ టేకింగ్..

  వర్మ టేకింగ్..


  దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంచుకొన్న పాయింట్ బాగానే ఉంది. తన విజన్‌కు తగినట్టుగా పూజా భలేకర్ లభించడం ప్లాస్ పాయింట్. కానీ పాత చింతకాయ పచ్చడి లాంటి కథతో మరోసారి సాదాసీదా అటెంప్ట్ చేయడం ప్రేక్షకులు నిరుత్సాహం కలిగించే విషయం. కాకపోతే ఇటీవల కాలంలో వచ్చిన వర్మ సినిమాలతో పోల్చితే.. కంటెంట్ పరంగా, ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా బెటర్‌గా ఉంటుంది. అయితే ఈ కథను ఇంకా బెటర్‌గా చేయడానికి స్కోప్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా ఆర్జీవి దృష్టి పెట్టలేకపోయారనిపిస్తుంది.

   పూజా భలేకర్ ఫెర్ఫార్మెన్స్

  పూజా భలేకర్ ఫెర్ఫార్మెన్స్


  అమ్మాయి సినిమా పూజా భలేకర్ వన్ ఉమెన్ షో అని చెప్పవచ్చు. కథ, కథనాలు పురాతన కాలం నాటివి కావడంతో ఆమె ప్రతిభ ఎలివేట్ కాకపోవచ్చు. రొటీన్, రెగ్యులర్ కథను కూడా తన ప్రతిభతో పూజా మెప్పించింది. అమ్మాయి కెమెరాకు కొత్తైనా యాక్షన్ సీన్లలో గానీ, రొమాంటిక్ సీన్లతో అదరగొట్టింది. బీచ్ బికినీ డ్రస్సులో యదేచ్ఛగా అందాలను ఆరబోసింది. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

   సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు


  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫి స్పెషల్ ఎట్రాక్షన్, ఛేజింగ్ సీన్లు, ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్స్‌ను రమ్మీ అద్బుతంగా తెరకెక్కించాడు. పూజా ఫైట్స్‌లో ఉండే వేగాన్ని కెమెరాలో చక్కగా బంధించాడు. ఇక రవి శంకర్ అందించిన మ్యూజిక్‌‌లో వర్మ మార్క్ ఎక్కువగా కనిపించిందని చెప్పవచ్చు. వర్మ సినిమాలోని పాత ట్యూన్లను కొంత మార్చి కొత్తగా వినిపించే ప్రయత్నం చేశారు. సాన్ లోకేష్ ఎడిటింగ్ బాగుంది. కథ లేకపోయినా సీన్లను పరుగు పెట్టించడంలో ఎడిటర్ తన నైపుణ్యం చాటుకొన్నాడు.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్


  అమ్మాయి సినిమాను ఇండియాలో తొలి మార్షల్ ఆర్ట్ మూవీగా కొంత క్వాలిటీతో నిర్మాతలు నరేష్ టీ, శ్రీధర్ రూపొందించారు. పరిమితమైన బడ్జెట్‌తో రిచ్‌నెస్‌ను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. నరేష్, శ్రీధర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

  ఫైనల్‌గా ఎలా ఉందంటే..

  ఫైనల్‌గా ఎలా ఉందంటే..


  యాక్షన్, రొమాన్స్ అంశాలు కలబోసి రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం లడ్కీ. పాత కాలపు నాటి కథ, కథనాలు ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. కాకపోతే పూజా భలేకర్ తెర మీద మార్షల్ ఆర్ట్స్ టాలెంట్‌తో బాగా ఆకట్టుకొన్నది. యాక్షన్ చిత్రాలను, అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా వచ్చే సినిమాలను, ఆర్జీవి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్స్
  పూజా భలేకర్ మార్షల్ ఆర్ట్స్ పెర్ఫార్మెన్స్
  టెక్నికల్ వాల్యూస్
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్
  రాంగోపాల్ వర్మ తరహా మేకింగ్
  రొటీన్, రెగ్యులర్ కథ, కథనాలు

  English summary
  Ram Gopal Vama's latest movie Ladki. This movie released with title ammayi in Telugu. Here is the Telugu Filmibeat exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X