twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాహిరి..లాహిరి..

    By Staff
    |

    Lahiri
    - జలపతి

    చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో..
    నటీనటులు: హరికృష్ణ, సుమన్‌, వినిత్‌, ఆదిత్యా,
    కె.విశ్వనాథ్‌, భానుప్రియ, రచన, సంఘవి, అంకిత, లక్ష్మి
    సంగీతం: కీరవాణి
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: వై.వి.ఎస్‌.చౌదరి

    ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. కానీ పాటలను ఉపయోగించుకొని పవర్‌ ఫుల్‌ స్క్రీన్‌ ప్లే రూపొందించుకొనే దర్శకులు చాలా తక్కువమంది. ఒకవేళ ప్రయత్నించినా, మంచి సినిమాగా రూపొందించడం కష్టమే. కానీ దర్శకుడు వై.వి.ఎస్‌ చైదరి తన తాజా చిత్రం- లాహిరి లాహిరి లాహిరిలొ- ఇదే పద్దతిలో అందంగా రూపొందించాడు. కీరవాణి అందించిన ఎనిమిది అద్భుతమైన పాటలతో ఈ చిత్రాన్ని చౌదరి చూడచక్కని విధంగా మలిచాడు. కొత్త టేకింగ్‌ స్టైల్‌ లో రూపొందించిన ఈ చిత్రం ఈ సీజన్‌ లో బెస్ట్‌ చిత్రం.

    ఈ చిత్రంలో నటించిన నటీనటులెవరికీ, మార్కెట్‌ లో పెద్ద సేలబులిటీ లేదు(ఒక్క హరికృష్ణ మినహా). ఐనా నాలుగు జంటలతో, సీనియర్‌ నటులతో బోర్‌ కొట్టించకుండా సినిమా తీయడం నిజంగా సాహసమే. పాటలతో కథనాన్ని భిన్నంగా చెప్పడమే ఈ చిత్రంలోని ప్రధాన విశేషం. కృష్ణా, గోదావరి బెల్ట్‌ లోని ప్రకృతి రమణీయతను చాలా అందంగా చూపించాడు దర్శకుడు. పూర్తి పల్లెటూరి వాతావరణంలో, పచ్చని పొలాల మధ్య జరిగే ఈ ప్రేమాయణం, డైరక్టర్‌ పోయిటిక్‌ లుక్‌ ను ఆవిష్కరించింది.

    ఇది నలుగురు ప్రేమ జంటల కథ. హరికృష్ణ, సుమన్‌, వినీత్‌ ముగ్గురు అన్నదమ్ములు. వీరికి ఒక చెల్లెలు(అంకిత). భానుప్రియ, రచన, సంఘవి ముగ్గురు అక్కాచెల్లెలు. వీరి జాతకం ప్రకారం ముగ్గురు అన్నదమ్ములైన వారికే కట్టాబెట్టాలి. వీరి అమ్మమ్మ(రమాప్రభ) ఆ బాధ్యతను పెళ్ళిళ్ళ బ్రోకర్‌ ఆదిత్యకు అప్పచెప్పుతుంది. ఆదిత్య హరికృష్ణ, సుమన్‌, వినీత్‌ లను సెలెక్ట్‌ చేస్తాడు.

    ఈ మూడు జంటల మధ్య ప్రేవు చిగురించేలా చేస్తూ...ఆదిత్య కూడా అంకిత ప్రేమలో పడుతాడు. కానీ వీరందరికీ విలన్‌- అచ్చిమాంబ(లక్ష్మి). అచ్చిమాంబ హరికృష్ణ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. చివరికి హరికృష్ణ అచ్చిమాంబకు బుద్ధిచెప్పి నలుగురు ప్రేమ జంటలు ఎలా ఏకమయ్యేలా చేస్తాడనేది కథ.

    కథ చాలా సింపుల్‌ గా ఉంటుంది. కానీ కథనం బాగుంది. టైటిల్స్‌ పడేటప్పుడే, మూడు జంటలను పరిచయం చేయడం, దానికి బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఓ పాట పెట్టడంతోనే...ఇది సంగీతభరిత ప్రేమకథ అని దర్శకుడు చెపుతాడు. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌. అలాగే హరికృష్ణ నటన. హరికృష్ణ నటన చాలా హుందాగా ఉంది. కొత్త కుర్రాడు ఆదిత్యే కాస్తా చికాకు కలిగిస్తాడు.

    అతని చేష్టలు, ముఖ కవళికలు అన్ని వికారంగా ఉన్నాయి. కొత్త హీరోయిన్‌ అంకిత చాలా అందంగా ఉంది. బాగా నటించింది కూడా. విలన్‌ పాత్రలో లక్ష్మి అందర్నీ డామినేట్‌ చేసింది. కొద్దిగా కామెడీ ఉంటే ఈ చిత్రం ఇంకా బాగుండేది. దిల్‌ ఛాహతా హైలో మాదిరిగా పాత కాలం మాదిరి డ్రెస్‌ లు వేసి పాట తీయడం బాగుంది. చౌదరిలో ఇంత టాలెంట్‌ ఉందా అని అనిపించే చిత్రం ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X