Laila First Review: లైలా ఫస్ట్ రివ్యూ.. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ పరిస్థితి ఏంటంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా. ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది. లైలా చిత్రం ఫిబ్రవరి 14 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా గురించి ఇన్‌సైడ్ రిపోర్ట్ వివరాల్లోకి వెళితే..
విశ్వక్ సేన్ తన కెరీర్‌లో అనేక రకాలుగా ఎక్స్‌పరిమెంట్స్ చేస్తూ విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఆయన లైలా చిత్రంలో ఆడవేషంలో కనిపించబోతున్నారు. పూర్తిస్థాయిలో అమ్మాయి గెటప్‌లో కనిపించడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లోని కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచింది. దాంతో లైలాపై మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక సాఫీగా సాగుతున్న లైలా ప్రమోషన్స్‌లో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకొన్నాయి. 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 11 గొర్రెలు అంటూ చేసిన కామెంట్స్‌తో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లైలాను బాయ్‌కాట్ చేయాలని పిలుపు నివ్వడంతో విశ్వక్ సేన్ సారీ చెప్పి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
ఇలా మిక్స్‌డ్ రెస్సాన్స్‌తో ముందుకెళ్తున్న లైలా సినిమా గురించిన రిపోర్టు బయటకు వచ్చింది. లైలా చిత్రంలో విశ్వక్ సేన్ మరోసారి అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన తన పాత్ర ద్వారా అందించిన ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలెట్‌గా ఉందని చెబుతున్నారు.

లైలా సెకండాఫ్‌లో వచ్చే ఆడవేషం క్యారెక్టర్ ద్వారా విశ్వక్ సేన్ ఆయన నటనలోని కొత్త కోణం కనిపించింది. ఈ సినిమాను విశ్వక్ తన ప్రతిభతో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమాలోని ఆయన చెప్పిన సింగిల్ లైనర్ డైలాగ్స్, టైమింగ్, ఎనర్జీ హైలెట్ బాగున్నాయి. ఫస్ట్ సినిమా నుంచి చివరి సన్నివేశం వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. దాంతో లైలాను గ్యారెంటీగా బ్లాక్‌బస్టర్ చేసే ప్రయత్నాన్ని విశ్వక్ సేన్ చేశాడు అనేది ఇన్‌సైడ్ టాక్.


Click it and Unblock the Notifications











