Laila Movie Review: లైలా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.5/5

నటీనటులు: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల, 30 ఇయర్స్ పృథ్వీ, బబ్లూ పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్ తదితరులు
దర్శకత్వం: రామ్ నారాయణ్
నిర్మాత: సాహు గారపాటి
సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: సాగర్ దాడి
మ్యూజిక్: లియోన్ జేమ్స్
బ్యానర్: షైన్ స్క్రీన్స్
రిలీజ్ డేట్: 2025-02-14

బ్యూటీ పార్లర్ నిర్వహించే సోను మోడల్ ఎప్పటికైనా టాప్ మోడల్ కావాలనే కోరికతో ఉంటాడు. తాను ఉండే ఏరియాలో మహిళలందరికీ సౌందర్య పోషణ విషయంలో మార్గదర్శకుడిగా ఉంటాడు. సోను తప్ప మరొకరితో బ్యూటీ పనులు చేయించుకోనంత క్రేజ్ ఆయనకు ఉంటుంది. ఈ నేపథ్యంలో సోనుపై ఓ కేసు నమోదు అవుతుంది. ఆ క్రమంలో ఆ ప్రాంతంలోని దాదా రుస్తుం (అభిమన్యు సింగ్), ఎస్ఐ శంకర్ (బబ్లూ పృథ్వీ) నుంచి సోను మోడల్ తనకు తాను తప్పించుకోవడానికి ఆడవేషం వేసుకొంటాడు.

Laila Movie Review in Telugu  Vishwak Sen s failed to impress with different genre

బ్యూటీ పార్లర్ బిజినెస్‌ను సోను మోడల్ ఎందుకు నడుపుతుంటాడు. బ్యూటీ పార్లర్‌ను నడపడం వెనుక కారణం ఏమిటి? ప్రియురాలు (ఆకాంక్ష శర్మ)తో ఎలా ప్రేమలో పడ్డాడు? ఎస్ఐ శంకర్ (బబ్లూ పృథ్వీరాజ్) నుంచి ఎదురయ్యే సమస్యలు ఏమిటి? అభిమన్యు భార్య (కామాక్షి భాస్కర్ల)కు ఎదురైన సమస్య ఏమిటి? ఆడవేషంలో అందర్నీ ఎలా బురిడీ కొట్టించాడు? రుస్తుం, ఐస్ఐ శంకర్‌కు ఎలా గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే లైలా సినిమా కథ.

లైలా సినిమా విషయానికి వస్తే.. 80 దశకంలో కూడా ఇలాంటి సినిమాలు రాని పరమ రొటీన్ చిత్రం. పేలవమైన కథ, నాసిరకం స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. ఇక కథకు తగినట్టు నిర్మాణ విలువలు కూడా అంతే ఉన్నాయి. ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే సినిమాలు తీసే షైన్ స్క్రీన్ నుంచి ఇలాంటి మూవీ రావడం జీర్ణించుకోలేకపోయారనే చెప్పాలి. పూర్తిగా ఎలాంటి కొత్తదనం లేని సినిమాగా చెప్పుకోవచ్చు.

Laila Movie Review in Telugu  Vishwak Sen s failed to impress with different genre

లైలా సినిమాలో ఏదైనా పాజిటివ్ అంశం ఉందా అంటే.. అది విశ్వక్ సేన క్యారెక్టర్. రెగ్యులర్ స్టోరీలో కూడా విశ్వక్ తన పాత్ర ద్వారా సినిమాను నిలబెట్టేంతగా పెర్ఫార్మెన్స్ చేశాడు. లేడీ గెటప్‌లో చాలా అందంగా ఉన్నాడు. హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చక్కగా ప్రదర్శించాడు. ఆ తర్వాత కామాక్షి భాస్కర్ల ఆకట్టుకొనే విధంగా నటించారు. బబ్లూ పృథ్వీ, అభిమన్యు సింగ్, పృథ్వీ ఇతర పాత్రలన్నీ రొటీన్, నాటు రకం కామెడీతో కొనసాగాయి.

లైలా సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే మ్యూజిక్ కొంతలో కొంత బాగుంది. పాటలు ఆడియో పరంగానే కాకుండా స్క్రీన్ మీద కొంత జోష్ పుట్టించాయి. సినిమాటోగ్రఫి విభాగం పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. కథలో దమ్ము లేకపోవడం వల్ల సాంకేతిక నిపుణులు పనితీరు ఎలివేట్ కాలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. బడ్జెట్ విషయంలో రాజీ పడని షైన్ స్క్రీన్ కథ, కథనాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

Laila Movie Review in Telugu  Vishwak Sen s failed to impress with different genre

లైలా గురించి చివరగా చెప్పాలంటే. కొత్త సీసాలో పాత సారా లాంటింది. ఎలాంటి కొత్తదనం, ఉత్సాహం కనిపించని రొటీన్ సినిమా. విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ తప్పా.. మరో పాజిటివ్ అంశం ఒక్కటి కూడా కనిపించదు. ఏమైనా బీ, సీ సెంటర్లలో ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఓ మోస్తారుగా ఈ సినిమా ఫలితం ఉండొచ్చనిపిస్తుంది. విశ్వక్ సేన్ కెరీర్‌లో పరమ రొటీన్ సినిమాగా చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X