Laila Twitter Review: లైలా తెలుగు మూవీ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా?
తెలుగులో సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా, కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు అమెరికాలోను, కెనడాలో ప్రదర్శించారు. ఈ సినిమాపై నెటిజన్లు, అభిమానులు వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి చాలా మిస్ అండర్ స్టాండింగ్ జరిగింది. ఏవోవో సమస్యలు వచ్చాయి. మా తప్పు లేకపోయినా క్షమాపణలు అడిగాను. విద్వేషం ఎప్పటికీ గెలువదు. ఇండస్ట్రీకి సంబంధం లేకుండా నిలబడ్డాను. నేను గెలిస్తే మీరు గెలిచినట్టే.. మీరు ఎంకరేజ్ చేస్తే చాలా మంచి పాత్రలు చేయగలను. కడుపుబ్బ నవ్వించేందుకు ప్రయత్నించాం. కొత్త నటీనటులు, కొత్త డైరెక్టర్, అందరి లైఫ్ ఈ సినిమాపై అధారపడి ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత అపార్ధం ఎందుకు చేసుకొన్నామనే అభిప్రాయం కలుగుతుంది. థియేటర్లలో లైలాను చూసి ఎంకరేజ్ చేయండి అని విశ్వక్ సేన్ అభ్యర్థించారు.
లైలా సినిమా హీరో విశ్వక్ సేన్‌కు సాయి ధరమ్ తేజ్ విషెస్ తెలిపాడు. లైలా సినిమా చాలా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. విశ్వక్ సేన్‌కు లైలా చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించాలని కోరుకొంటున్నాను. గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతున్నది. చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.
లైలా సినిమా విశ్వక్ సేన్ నుంచి వస్తున్న మరో ఎంటర్‌టైనర్. ట్రైలర్ చూసిన తర్వాత సూపర్ ఫన్ కలిగించింది. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. థియేటర్లలో ఫుల్లుగా ఎంజాయ్ చేయండి అని హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు.
సినిమా బాగుందని పైరసీని కంట్రోల్ చేయాలని విశ్వక్‌సేన్ అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనే తండేల్ సినిమాను ప్రదర్శించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు విశ్వక్‌సేన్ అభిమానులు.
Piracy control cheyandi.#Thandel movie big producer…but movie is played in govt. buses without any political controversy
— Abhi (@abhi_is_online) February 13, 2025
Ippudu miru chesina political controversy ki first cheyalsindhi #Laila piracy stop chesi & save your producer
Already #DisasterLaila trending at 2 on X https://t.co/LIGT3AO1xc
ఫస్టాఫ్ బాగుందని , సోను క్యారెక్టర్ సహా కామెడీతో కడుపుబ్బా నవ్వుకున్నామని విశ్వక్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సెకండాఫ్ కూడా బాగుంటుందని , కంప్లీట్‌గా విశ్వక్‌సేన్ వన్ మేన్ షో అని ట్వీట్లు చేస్తున్నారు.
Decent 1st Half, Sonu model killed with the characterization and some decent comedy scenes!!
— Shiva Akunuri (@AkunuriShivaa) February 13, 2025
Expecting a huge comedy riot in 2nd Half😂❤️
Pure @VishwakSenActor Domination !!
#Laila pic.twitter.com/zw8EzBxzZv
వైసీపీ కేడర్ వార్నింగ్ నేపథ్యంలో విశ్వక్‌సేన్ అభిమానులు సినిమాను కాపాడాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమా అంటే వేల మంది పడిన కష్టమని.. ఎవరో ఏదో అన్నారని సినిమాని ఆపాలని చూడటం చాలా తప్పు అని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











