Sweet Karam Coffee Review: అత్తా కోడలు కూతురు గోవా ప్రయాణం.. 'స్వీట్ కారం కాఫీ' రివ్యూ

రేటింగ్: 3/5

టైటిల్: స్వీట్ కారం కాఫీ
నటీనటులు: లక్ష్మీ, మధుబాల, శాంతి బాలచంద్రన్, కెవిన్ జయ్ బాబు, వంశీ కృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: క్రిష్ణన్ వసంత్, విరాజ్ సింగ్, రేమి దలాయి
సంగీతం: గోవింద్ వసంత
క్రియేటర్, నిర్మాత: రేష్మ ఘటాల
దర్శకత్వం: క్రిష్ణ మారిముత్తు, స్వాతి రఘురామన్, బిజోయ్ నంబియార్
విడుదల తేది: జూలై 6, 2023
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 8, నిడివి: సుమారు 40 నిమిషాలు

మూడు జనరేషన్స్ అనుభవాల నేపథ్యంతో తెరకెక్కిన వెబ్ సిరీస్ స్వీట్ కారం కాఫీ (Sweet Karam Coffee). ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి, అలనాటి స్టార్ హీరోయిన్ మధుబాల, యువ నటి శాంతి బాల చంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీసుకు క్రిష్ణ మారిముత్తు, స్వాతి రఘురామన్, బిజోయ్ నంబియార్ ముగ్గురు దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం (Sweet Karam Coffee Review Telugu).

Lakshmi Madhubala Sweet Karam Coffee Web Series Review And Rating In Telugu

కథ:భర్త మరణించిన సుందరి (లక్ష్మీ) తన కొడుకు రాజారత్నం (కెవిన్ జయ్ బాబు) ఇంట్లోనే ఉంటుంది. రాజారత్నంకు భార్య కావేరి (మధుబాల), కొడుకు బాలా (బాలా సురేష్), కూతురు నివేదిత (శాంతి బాలచంద్రన్) ఉంటారు. సుందరి ఇంట్లో ఖాలీగా ఉంటే కావేరీ ఇంటి పనులు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. బాలా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటే.. నివేదిత క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటుంది. అయితే ఒకరోజు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సుందరి, కావేరి, నివేదిత గోవాకు ట్రిప్ ప్లాన్ చేసి వెళ్తారు.

ట్విస్టులు:ముగ్గురు ఆడవాళ్లు ట్రిప్ కు ఎందుకు వెళ్లారు? గోవా అనుకున్న ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? ఏయే చోట్లకు వెళ్లారు? అప్పటికీ బాయ్ ఫ్రెండ్ ఉన్న నివేదితకు పరిచయం అయిన విక్రమ్ (వంశీ కృష్ణ) వారిని ఎక్కడికీ తీసుకెళ్లాడు? వాళ్లకు ఎదురైన సంఘటనలు ఏంటీ? ఆ ముగ్గురికి ఉన్న గతం ఏంటీ? సుందరి ఎవరిని కలవాలని ఆరాటపడింది? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ స్వీట్ కారం కాఫీ రుచి (Sweet Karam Coffee Web Series) చూడాల్సిందే.

Lakshmi Madhubala Sweet Karam Coffee Web Series Review And Rating In Telugu

విశ్లేషణ:స్వీట్ కారం కాఫీ వెబ్ సిరీస్.. ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు జనరేషన్ల కథ. అత్తయిన 60 ఏళ్ల బామ్మ, అమ్మయినా 40 ఏళ్ల మహిళ, కూతురు, మనవరాలు అయినా 20 ఏళ్ల యువతి తమ అనుభవాలు, ఆలోచనలు, ఆశలతో కలిసి చేసిన ప్రయాణాన్ని ఇందులో చూపించారు. పాత్రల పరిచయంతో స్లోగా స్టార్ట్ చేసిన ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 3 ఏజెస్ వాళ్లు కలిసి చేసే ఊహించని జర్నీని అందంగా మలిచారు. జర్నీలో వారికి ఎదురయ్యే సంఘటనలు, మనుషులు, వెనక్కి రప్పించేందుకు రాజారత్నం చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తూ ఆసక్తిగా సాగుతాయి.

హైలెట్స్:ఫోక్ ఫెస్టివల్, అక్కడ అత్తాకోడళ్లు అయిన సుందరి, కావేరి మాట్లాడుకునే మాటలు నవ్వు తెప్పించడమే కాదు.. స్త్రీలోని లైంగిక కోరికలను బయటపెడతాయి. గోవా అనుకున్న ట్రిప్ పూణే, భటేశ్వర్, హిమాచల్ ప్రదేశ్ ఇలా అనుకోని ప్రాంతాలు చుట్టడం జీవితంలో అలాంటి టూర్స్ చేయాలనిపిస్తుంది. అసలు ఆ ముగ్గురు బయటకు ఎందుకు రావాలనుకున్నారు, వాళ్లు ఇంట్లో ఎలా ఫీలయ్యారు, వాళ్లను రాజారాం, కొడుకు బాలా ఎలా అర్థం చేసుకున్నారు వంటి అంశాలు చక్కగా చూపించారు.

Lakshmi Madhubala Sweet Karam Coffee Web Series Review And Rating In Telugu

ఎక్కువైన ఎపిసోడ్స్:కొడుకుతో తండ్రి కోడలితో అత్తయ్య నిజ జీవితంలో మాట్లాడలేని విషయాలు ఇందులో మెచ్యూర్డ్ గా చూపించే ప్రయత్నం చేశారు. భార్యాభర్తల ఫోన్ కన్వర్జేషన్ సీన్, పలు ఎమోషనల్ సీన్స్ అలరిస్తాయి. డైలాగ్స్ ఆకట్టుకునేలా, నవ్వించేలా ఉన్నాయి. అయితే సుందరి, కావేరికి ఉన్న ప్లాష్ బ్యాక్ లను చూపించడంలో కాస్తా స్పష్టత లేదు. సుందరి గతం చెప్పుకునేంత ఎఫెక్టివ్ గా లేకున్నా ఆమె వెతుకుతున్న వ్యక్తిని మాత్రం అస్సలు ఊహించలేం. ఏడో ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్ట్ బాగుంది. ఫైనల్ ఎపిసోడ్ నెమ్మదిగా సాగిన క్లైమాక్స్ లో వచ్చే ఐదో రూల్ కాన్సెప్ట్ షాక్ ఇస్తుంది.

బీజీఎమ్ అలా:సినిమాటోగ్రఫీ, లొకేషన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఇక సిరీసులో ప్రధాన హైలెట్ సంగీతం. పాటలు అర్థం కాకపోయినా మ్యూజిక్ ఆస్వాదించేలా ఉంది. బీజీఎమ్ కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ 96 సినిమా ఫ్లేవర్ ఎక్కువగా వినిపిస్తుంది. 96 కు బీజీఎమ్ అందించిన గోవింద్ వసంతనే ఈ సిరీసుకు మ్యూజిక్ అందించారు. మిగతా నిర్మాణ విలువలు అంతా బాగున్నాయి.

Sweet Karam Coffee

ఎవరెలా చేశారంటే? :సీనియర్ నటి లక్ష్మీ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సుందరి పాత్రలో అద్భుతంగా చేశారు. ఈ సిరీసులో మరో ప్రధాన హైలెట్ ఆమె నటనే. తర్వాత మధుబాల కూడా ఎంతో మెప్పిస్తారు. శాంతి బాలచంద్రన్, కెవిన్ జయ్ బాబు, వంశీ కృష్ణ తదితర పాత్రలన్నీ ఆకట్టుకున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే.. 3 ఏజెస్ బ్యూటిఫుల్ జర్నీ నెమ్మదిగా సాగినా స్వీట్ గా ఉంటుంది. వీకెండ్ లో టైమ్ ఉంటే ఫ్యామిలీతో చూడొచ్చు. (Sweet Karam Coffee Web Series Review)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X