twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మి మూవీ రివ్యూ & రేటింగ్

    By Rajababu
    |

    Recommended Video

    Lakshmi Movie Review and Rating లక్ష్మీ మూవీ రివ్యూ & రేటింగ్

    Rating:
    2.5/5
    Star Cast: ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్, ఏఎల్ విజయ్, దిత్య, సల్మాన్ యూసఫ్ ఖాన్
    Director: ఏఎల్ విజయ్

    ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ప్రత్యేక పాత్రలో మాస్టర్ దిత్య నటించిన చిత్రం లక్ష్మి. డ్యాన్స్ కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవ సరసన ఐశ్వర్యా రాజేష్ నటించింది. అభినేత్రి, కణం చిత్రాలను రూపొందించిన ఏఎల్ విజయ్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. డ్యాన్స్‌ను పిచ్చిగా ఆరాధించే ఓ చిన్నారి తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నదనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 24న రిలీజైంది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     లక్ష్మీ సినిమా కథ

    లక్ష్మీ సినిమా కథ

    లక్ష్మి (దిత్య భండే)కు డ్యాన్స్ అంటే పిచ్చి. తండ్రి లేకపోవడం వల్ల తల్లి నందిని (ఐశ్వర్య రాజేష్) సంరక్షణలో పెరుగుతుంటుంది. అయితే డ్యాన్స్ అంటే చెప్పలేనంత అసహ్యం. తల్లికి ఇష్టం లేకున్నా తనలో ఉండే కోరికను అణిచి పెట్టుకోలేకపోతుంది. తల్లికి తెలియకుండా రెస్టారెంట్ యజమాని క‌‌ృష్ణ అలియాస్ వీకే (ప్రభుదేవా) సహకారంతో డ్యాన్స్ అకాడమీలో చేరుతుంది. వీకే గొప్ప డ్యాన్సర్ అనే విషయం తెలుస్తుంది. చివరికి తనకు దూరమైన ప్రేయసి కుమార్తెనే లక్ష్మీ అని వీకే తెలుసుకుంటాడు. జాతీయ స్థాయిలో జరిగే పోటీకి లక్ష్మీ ఉండే గ్రూప్‌ను వీకే సన్నద్ధం చేస్తాడు.

    స్టోరిలో ట్విస్టులు

    స్టోరిలో ట్విస్టులు

    నందిని, వీకే ఎందుకు దూరమయ్యాడు. జాతీయ స్థాయి పోటీలో వీకే చాంఫియన్‌గా నిలువలేకపోయవడానికి కారణం ఏమిటి? లక్ష్మీ నేషనల్ ఛాంపియన్ అయిందా? నేషనల్ ఛాంపియన్ అవడానికి ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నది? నందిని, వీకే ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్మీ సినిమా కథ.

    ఫస్టాఫ్ రివ్యూ

    ఫస్టాఫ్ రివ్యూ

    లక్ష్మీకి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అనే విషయాన్ని తెలుపడం, అలాగే వీకే పరిచయం లాంటి అంశాలు తొలి భాగంలో ప్రధానంగా కనిపిస్తాయి. అలాగే స్కూల్‌లో డ్యాన్స్ చేయడం, హెడ్‌ మాస్టర్‌కు దగ్గరవ్వడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు కొంత వినోదం పంచేలా ఉంటాయి. కొన్ని రాజకీయాల వల్ల వీకే నేషనల్ ఛాంపియన్ కాలేకపోవడమనే అంశం కథలో కొంత ఆసక్తిని రేపడంతో తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ రివ్యూ

    సెకండాఫ్ రివ్యూ

    సెకండాఫ్‌లో తల్లికి తెలియకుండా వీకేతో కలిసి ముంబైలో ప్రైడ్ ఇండియా డాన్స్ పోటీలకు వెళ్లడం ప్రధాన భాగంగా మారుతుంది. డ్యాన్స్ పోటీలలో శిక్షణ, పోటీలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. కాకపోతే గొప్పగా ఆకర్షించేలా, సన్నివేశాల్లో భావోద్వేగం లేకపోవడంతో చప్పగా సాగిపోతుంటాయి. చివరికి లక్ష్మీకి యాక్సిడెంట్ జరిగి చెవుడు సంభవించడంతో కథ మలుపు తిరుగుతుంది. చెవిటితనంలో మ్యూజిక్ వినకుండా డ్యాన్స్ పోటీలో ఎలా నెగ్గిందనే విషయంపై దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశాడు.

    ఏఎల్ విజయ్ డైరెక్షన్

    ఏఎల్ విజయ్ డైరెక్షన్

    భావోద్వేగం పండించే కథాంశంగా సినిమాలకు రూపొందించే పేరు ఏఎల్ విజయ్‌కి ఉంది. అయితే లక్ష్మీ విషయానికి వస్తే కథలో ఎక్కడా ఎమోషనల్ కంటెంట్ ఉండదు. బుల్లితెర మీద డ్యాన్స్ ప్రొగ్రాం చూసిన ఫీలింగే తప్ప.. ఓ ఎమోషనల్ కథను చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించకపోవడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ప్రభుదేవాను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం మరో మైనస్.

    ప్రభుదేవా పెర్ఫార్మెన్స్

    ప్రభుదేవా పెర్ఫార్మెన్స్

    ప్రభుదేవా లక్ష్మీ లాంటి డ్యాన్స్ నేపథ్యం ఉన్న చిత్రాలు కొట్టిన పిండే అనడం గొప్ప విషయం కాదు. అలాంటి వ్యక్తి నుంచి డ్యాన్స్ నేపథ్యంగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉంటాయి. కానీ ప్రభుదేవ స్థాయిని మించి ఆశించేలా సినిమా లేకపోయింది. లక్ష్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే చిత్రంలో అక్కడక్కడ ప్రభుదేవా మెరుపులు మెరిపించాడు. వీకే పాత్రలో భావోద్వేగాలు లేకపోవడం ప్రభుదేవా గొప్పగా నటించడానికి అవకాశం లేకపోయింది.

     లక్ష్మీ పాత్రలో దిత్య

    లక్ష్మీ పాత్రలో దిత్య

    ఇక దిత్య విషయానికి వస్తే లక్ష్మీ పాత్రలో ఒదిగిపోయింది. తొలిభాగంలో చాలా చలాకీగా కనిపించింది. సెకండాఫ్‌లో ఆమె సింగిల్ ఫెర్ఫార్మెన్స్ స్కోప్ తక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే మంచి ఈజ్‌తో తెర మీద ఓ మ్యాజిక్ చేసింది. ఇక గ్రూప్‌లో ఉండే మిగితా పిల్లలు చిచ్చరపిడుగుల్లా కనిపించారు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    లక్ష్మీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ సింగిల్ మదర్‌ పాత్రలో కనిపించింది. ప్రియుడికి దూరమైన భగ్న ప్రేమికురాలిగా, ఓ బిడ్డకు తల్లి లాంటి రెండు విభిన్నమైన పాత్రల్లో నటించింది. కొన్ని సన్నివేశాల్లో మెప్పించింది. సత్యం రాజేష్ పాత్రకు అంతగా స్కోప్ లేకపోయింది. ప్రభుదేవా నిర్వహించే రెస్టారెంట్‌లో సహాయకుడి పాత్రలో అప్పడప్పుడు నవ్వించాడు. సెకండాఫ్‌లో హెడ్మాస్టర్ కోవై సరళ సీన్లు పడిపడేలా ఉంటాయి. రెగ్యులర్‌గా కనిపించే సినిమాలో కోవై సరళ కామెడీ కొంత ఫ్రెష్‌గా ఉంటుంది.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    లక్ష్మీ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. రీరికార్డింగ్ బాగుంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. డ్యాన్స్ పోటీల సందర్బంగా తన పనితీరు మెరుగ్గా కనిపించింది. ఆడిటోరియం బేస్డ్‌ కథ కావడంతో అతని ప్రతిభను బయటకు పెట్టుకోవడానికి అవకాశం చిక్కలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ప్రభుదేవా, డ్యాన్స్‌పై ఇష్టపడే ప్రేక్షకులకు లక్ష్మీ సినిమా నచ్చుతుంది. దిత్యా, డ్యాన్స్ యాక్టింగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. వారాంతంలో పిల్లలలతో ఎంజాయ్ చేయడానికి కాలక్షేపంగా లక్ష్మీని చూడటానికి ఓ ఛాన్స్ తీసుకోవచ్చు.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్
    ప్రభుదేవా
    దిత్య డాన్స్ ప్రతిభ
    సెకండాఫ్

    మైనస్ పాయింట్స్
    రొటీన్ కథ
    భావోద్వేగం పండకపోవడం
    ఫస్టాఫ్‌లో సాగదీత

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్, ఏఎల్ విజయ్, దిత్య, సత్యం రాజేశ్, సల్మాన్ యూసఫ్ ఖాన్
    దర్శకత్వం: ఏఎల్ విజయ్
    నిర్మాతలు: ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్ రవీంద్రన్
    సంగీతం: సామ్ సీఎస్
    సినిమాటోగ్రఫి: నిరవ్ షా
    బ్యానర్: ప్రమోద్ ఫిల్మ్స్, ట్రైడెంట్ ఆర్ట్స్
    రిలీజ్ డేట్: 2018-08-24

    English summary
    Lakshmi is a 2018 Indian Tamil language musical film written and directed by A. L. Vijay. The film stars Prabhu Deva, Ditya Bhande and Aishwarya Rajesh in the lead roles, with a supporting cast including Salman Yusuff Khan and Karunakaran. Produced by Prateek Chakravorty, Shruti Nallappa and R. Ravindran under the banner of Pramod Films and Trident Arts, the film features music composed by Sam C. S. and cinematography by Nirav Shah. The film released on 24 August 2018 on the eve of Varalakshmi Vratam and based on the theme of goddess Lakshmi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X