Don't Miss!
- Finance
Job loss policy: ఈ పాలసీ ఉంటే ఉద్యోగం పోయినా ఇబ్బంది లేదు.. కానీ.. ??
- News
నాగబాబుకు పోలీసుల నోటీసులు... హైటెన్షన్!
- Sports
INDvsAUS : కోహ్లీనే కాదు.. వాళ్లు కూడా రంజీలు ఆడితేనే బెటర్.. మాజీ లెజెండ్ సలహా!
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Automobiles
టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు: రితేష్ దేశ్‌ముఖ్ నుంచి ముఖేష్ అంబానీ వరకు..
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Laththi Movie Review: విరగని పోలీస్ లాఠీ.. విశాల్ చితకబాదుడు ఎలా ఉందంటే?
నటీనటులు: విశాల్, సునైనా, ప్రభు, మనీష్ కాంత్, తలైవాసల్ విజయ్, రమణ, సన్నీ పీఎన్ తదితరులు
దర్శకత్వం: ఏ వినోద్ కుమార్
రచన: పోన్ పార్తీబన్
నిర్మాతలు: నంద, రమణ
సినిమాటోగ్రఫి: బాలసుబ్రమణ్యం, బాలకృష్ణ తోట
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్
స్టంట్స్: పీటర్ హెయిన్స్
రిలీజ్ డేట్: 2022-12-22

లాఠీ కథ ఏమిటంటే?
నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో మురళీ కృష్ణ (విశాల్) నిజాయితీపరుడైన కానిస్టేబుల్. భార్య కవిత (సునైనా), కొడుకు రాజుతో ఆనందంగా జీవితం కొనసాగిస్తుంటాడు. అయితే డ్యూటీలో భాగంగా జరిగిన ఓ సంఘటన కారణంగా ఉద్యోగం నుంచి సస్పెడ్ అవుతాడు. అయితే సస్పెండ్ కావడం వెనుక తన తప్పులేదని డీఐజీ కమల్ (ప్రభు)తో ప్రాధేయపడటం వల్ల తిరిగి ఉద్యోగంలో చేరుతాడు. ఈ క్రమంలో స్థానికంగా మాఫియా ముఠాను నడిపే సూర్య కుమారుడు వీర వల్ల డీఐజీ ఫ్యామిలీకి ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాంతో సూర్య ముఖానికి ముసుగు వేసి డీఐజీ ఆదేశాలతో అరెస్ట్ చేసి మురళీ కృష్ణతో చితకబాదిస్తారు. తనను విపరీతంగా కొట్టింది ఎవరు అని సూర్య వేటాడుతూ మురళీ కృష్ణ కుమారుడిని ఎత్తుకెళ్తారు.

లాఠీ మూవీలో ట్విస్టులు
మురళీ కృష్ణ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? కానిస్టేబుల్ మురళీ కుమారుడికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? తండ్రి మురళీకృష్ణపై కొడుకు రాజుకు ఉన్న ఫిర్యాదు ఏమిటి? డీఐజీ కమల్ ఫ్యామిలీకి సూర్య నుంచి ఎదురైన చేదు అనుభవం ఏమిటి? తనను కొట్టి మురళీకృష్ణపై ఎలా పగ తీర్చుకోవాలని అనుకొంటాడు? మురళీకృష్ణ కుమారుడు రాజును ఎత్తుకెళ్లిన తర్వాత ఏం జరిగింది? మురళీ కృష్ణ తనపై దాడి చేయాలనుకొన్న సూర్య, వీర గ్యాంగ్‌ను ఎలా ఎదురించాడు అనే ప్రశ్నలకు సమాధానమే లాఠీ సినిమా కథ.

దర్శకుడు పనితీరు ఎలా అంటే..
దర్శకుడు వినోద్ కుమారు రాసుకొన్న పాయింట్ ఎమోషనల్‌గానే అనిపిస్తుంది. కాకపోతే సినిమా మొత్తాన్ని హింస, రక్తంతో నింపేయడం ఫ్యామిలీ ఆడియెన్స్ చూడటం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే ఇక సింగిల్ పాయింట్‌పై కథ నిదానంగా, ఆసక్తికరంగా లేని సన్నివేశాలతో సాగిపోతుంది. అయితే సినిమా తొలి భాగం అదోలా కథలో బలం లేకుండా అదోలా సాగిపోతుంది.ఇక సెకండాఫ్‌లో కొడుకును మురళీకృష్ణను రక్షించుకొనే ఎపిసోడ్ నుంచి కథ భావోద్వేగంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఉండే మితిమీరిన హింస కథలోని ఎమోషన్స్‌ను దెబ్బ తీశాయనే ఫీలింగ్ కలుగుతుంది.

విశాల్ వన్ మ్యాన్ షో.. కానీ..
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కానిస్టేబుల్ మురళీకృష్ణ పాత్రలో విశాల్ ఒదిగిపోయాడు. అయితే ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోల్చుకొంటే.. మురళీకృష్ణ పాత్రలో హీరోయిజం కంటే.. ఎక్కువగా ఎమోషనల్‌గా ఎలివేట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సన్నివేశాల్లో అవార్డు విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. అయితే యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ కథకు కావాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఆ క్యారెక్టర్‌తో కనెన్ట్ కావడానికి ఇబ్బందిగా మారుతుంది. ముఖానికి తీవ్ర గాయాలు, రక్తం ఓడుతున్న విశాల్ ముఖం చూడాలంటే.. ఫ్యామిలీ ప్రేక్షకులకు కష్టంగానే అనిపిస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల ప్రాధాన్యం మేరకు ఒకే అనిపించారు.

లాఠీ మూవీలో టెక్నికల్ వ్యాల్యూస్
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా పాటల పరంగా మెప్పించలేకపోయాడు. కానీ యాక్షన్ సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్‌లో పలు సన్నివేశాలు యువన్ మ్యూజిక్‌తో బాగా ఎలివేట్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. నైట్ ఎఫెక్ట్‌తో సాగే కథకు తగినట్టుగా బాలసుబ్రమణ్యం, బాలకృష్ణ తోట ప్రతిభను చాటుకొన్నారు. పీటర్ హెయిన్స్ సమకూర్చిన ఫైట్స్ కొత్తగా ఉన్నాయి.

ఫైనల్‌గా లాఠీ ఎలా ఉందంటే?
నిబద్దత, నిజాయితీగా వ్యవహరించే కానిస్టేబుల్ మాఫియాపై ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పే చిత్రం లాఠీ. ఫాదర్ సెంటిమెంట్, విశాల్ యాక్టింగ్ ఈ సినిమాకు బలంగా మారాయి. అయితే మితిమీరిన హింస, కథను డామినేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ఎమోషనల్ కథను నీరుగార్చాయి. విశాల్ సినిమాలను ఇష్టపడే వారికి, అలాగే యాక్షన్, స్టంట్స్ ఓరియెంటెడ్ సినిమాలను ఆదరించే వారికి లాఠీ నచ్చే అవకాశం ఉంది.