Miss Perfect Review: మెగా కోడలు లావణ్య మిస్ పర్‌ఫెక్ట్‌ అనిపించుకుందా... వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

వెబ్ సిరీస్ : మిస్ పర్‌ఫెక్ట్‌
రేటింగ్:2.25/5
ప్రధాన నటీనటులు : లావణ్య త్రిపాఠి, అభిజిత్ దుద్దల, అభిజ్ఞ వుతలూరు, ఝాన్సీ, హర్షవర్దన్, మహేశ్ విట్టా, హర్ష్ రోహన్, సునైనా, మోహన శ్రీ
కథ, స్క్రీన్‍ప్లే : ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్
ఎడిటర్: రవితేజ గిరిజల
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రశాంత్ ఆర్ విహారీ
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది
నిర్మాత : సుప్రియ యార్లగడ్డ
డైరెక్టర్ : విశ్వక్ కండేరావ్
స్ట్రీమింగ్ : డిస్నీ+ హాట్‍స్టార్

హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహానంతరం నటించిన తొలి ప్రాజెక్ట్​ మిస్ పర్‌ఫెక్ట్‌ (వెబ్​సిరీస్​). బిగ్‍బాస్ విన్నర్ అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌తో ఈ సిరీస్‍పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రమోషన్లు కూడా బానే చేశారు. మరి, ఈ మిస్ పర్‌ఫెక్ట్‌ సిరీస్ ఎలా ఉందో ఈ స్టోరీలో చదివి తెలుసుకుందాం..

Lavanya Tripathi Abijeet Miss Perfect Review Web Series OTT Review

కథ ఇదే: లావణ్య త్రిపాఠి దిల్లీలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌. జాబ్‍లో భాగంగా హైదరాబాద్‍కు వచ్చి ఓ అపార్ట్​మెంట్​లో ఉంటుంది. అయితే లావణ్యకు క్లీనింగ్ అంటే ప్రాణం. తన చుట్టూ ఉన్న ప్రతీది క్లీన్‍గా, పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటుంది. అయితే లావణ్య ఇంట్లో జ్యోతి (అభిజ్ఞ) పని మనిషిగా ఉంటుంది. లావణ్య ఉండే అపార్ట్‌మెంట్లోనే మరో ఫ్లాట్‍లో రోహిత్ (అభిజిత్) కూడా ఉంటాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్​కు చెందిన వారు. కానీ ఈ విషయం రోహిత్​కు తెలీదు. అయితే లావణ్య హైదరాబాద్ వచ్చాక కరోనా వల్ల లాక్‍డౌన్ పడుతుంది.

దీంతో కరోనా కారణంగా తాను పనికి రాలేకపోతున్నానని లావణ్యకు చెబుతుంది జ్యోతి. అలాగే ఇదే విషయాన్ని రోహిత్‍కు కూడా చెప్పాలని లావణ్యను చెప్తుంది. దీంతో రోహిత్ ఉండే ఫ్లాట్‍కు లావణ్య వెళ్తుంది. కానీ అక్కడ ఈ విషయం చెప్పకుండా అక్కడ అపరిశుభ్రతను చూసి తట్టుకోలేక వెంటనే ఇంటిని క్లీన్‌ చేస్తుంది. దీంతో లావణ్యను పని మనిషిగా భావిస్తాడు రోహిత్.

లావణ్య నిజం చెబుదామనే ప్రయత్నిస్తూనే, ఫైనల్​గా చెప్పకుండా అతడితో ప్రేమలో పడిపోతుంది. లక్ష్మి అనే పేరుతో ప్రతి రోజూ అతడి ఇంటికి వెళ్లడం, ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం జరుగుతుంది. మరి చివరికి లావణ్య పని మనిషి కాదని, తన పైఆఫీసర్ అని రోహిత్‍కు తెలిసిందా? లావణ్య నిజం చెబుతుందా? మరి ఇద్దరి ప్రేమ సక్సెస్ అయిందా? అనేదే ఈ మిస్ పర్‌ఫెక్ట్‌ వెబ్ సిరీస్‍ కథ.

Lavanya Tripathi Abijeet Miss Perfect Review Web Series OTT Review

ఎలా ఉందంటే ? లాక్‌డౌన్‌ నాటి పరిస్థితులు, ఓసీడీ కాన్సెప్ట్‌పై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటిదే. అవి చూసిన వారికి ఈ సిరీస్​లో కొత్తగా ఏం కనిపించదు కానీ టైమ్​ పాస్ అవుతుంది. అపార్ట్మెంట్ వాతావరణంలో సరదా సరదాగా సాగే హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటిదే ఈ 'మిస్ పర్ఫెక్ట్' సిరీస్​.

చుట్టుపక్కల ఫ్లాట్స్​లో ఉండే రకరకాల మనుషులు, వారి మనస్తత్వం, ఉండే విధానం.. ఇలా మన చుట్టూ తిరిగే పాత్రలతోనే సిరీస్​ను లైవ్లీగా తెరకెక్కించారు యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావ్. ఒకరి ప్రవర్తన చుట్టుపక్కల మనుషుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూపించారు. ప్రతి ఒక్కరి పర్సనల్, ప్రొఫెషనల్ స్ట్రగుల్స్​లోని సున్నితమైన అంశాలను టచ్ చేశారు.

ఎవరెలా చేశారంటే?: లావణ్య/లక్ష్మిగా లావణ్య త్రిపాఠి, రోహిత్​గా అభిజీత్​ నటన బాగుంది. అభిజ్ఞ గజ్వేల్‌ అమ్మాయిగా మంచిగా ఎంటర్‌టైన్‌ చేసింది. హర్ష్‌ రోషన్‌, మహేశ్‌ విట్టా కామెడీ బాగుంది. హర్ష వర్ధన్‌, ఝాన్సీ తమ పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారు. టెక్నికల్ విషయానికొస్తే ప్రశాంత్‌ ఆర్.విహారి మ్యూజిక్​తో మ్యాజిక్ చేశారు. ఆదిత్య సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. ఎడిటర్‌ రవితేజ గిరిజాల సిరీస్‌ నిడివిని ఇంకాస్త తగ్గించాల్సింది. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం పర్వాలేదనిపించింది.

చివరకు.. మిస్ ఫర్ఫెక్ట్ నాట్ సో మచ్ ఫర్ఫెక్ట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X