twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి 'లక్ష్మి'

    By Staff
    |

    Laxmi
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: లక్ష్మి
    విడుదల తేదీ: 14/1/2006
    నటీనటులు: వెంకటేశ్‌, ఛార్మి, నయనతార, సాహిజీ షిండే,
    ప్రదీప్‌ రావత్‌, సునీల్‌, రాజీవ్‌ కనకాల, సర్వానంద్‌, షమీర్‌,
    సంజాయ్‌, బాలాజీ, సుధ, వేణుమాధవ్‌, బ్రహ్మానందం,
    ఎల్బీ శ్రీరాం, శకుంతల, తదితరులు.
    సంగీతం: రమణ గోగుల
    కెమెరా: ఛోటా కె. నాయుడు
    కథ, మాటలు: ఆకుల శివ
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి. వినాయక్‌
    నిర్మాత: నల్లమలుపు బుజ్జి

    తెలుగు సినిమా ఫార్ములాని తుచ తప్పకుండా తీసిన చిత్రం 'లక్ష్మి' . వెంకటేశ్‌ సినిమాల్లో తరుచుగా దర్శనమిచ్చే మహిళా సెంటిమెంట్‌కి వినాయక్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి నడిపిన కథ ఇది. సెకండాఫ్‌లో కథ రొటీన్‌ అయినా ఫ్యామిలీస్‌ను టార్గెట్‌ చేయడంతో మంచి ప్రేక్షకాదరణ పొందే అవకాశం ఉంది.

    లక్ష్మీ ఇండస్ట్రీస్‌ ఎండి లక్ష్మీనారాయణ (వెంకటేష్‌) వురప్‌ లక్ష్మి అంటే అటు కుటుంబంలోనే కాకుండా ఇటు కార్మికుల్లోనూ ఎనలేని అభిమానం. నిజాయితీకి విలువనిస్తూ తండ్రిలేని తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఇద్దరు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముళ్లు (సర్వానంద్‌, రాజీవ్‌ కనకాల) అతని క్రమశిక్షణకు చిరాకు పడినా బయటపడరు. అలాంటి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడానికి జనార్దన్‌ రావు (సాహిజీ షిండే) అనే విలన్‌ బయలుదేరుతాడు. జనార్దన్‌ రావు గతంలో ఫోర్జరీ నేరంపై లక్ష్మి చేత ఫ్యాక్టరీ నుండి గెంటివేయబడ్డ ఉద్యోగి. అతను పగ తీర్చుకోవడానికి రొటీన్‌గా లక్ష్మీ తమ్మున్ని చేరదీసి వ్యసనాలకు అలవాటు చేస్తుంటాడు. విషయం తెలిసిన లక్ష్మీ వార్నింగ్‌ ఇస్తాడు. మరో పక్క లక్ష్మి తన చిన్న చెల్లెలను వేరుగా తక్కువగా చేసి చూస్తుంటాడు. పెద్ద చెల్లెలు పెండ్లికి కోట్లలో ఖర్చు చేస్తే చిన్న చెల్లెలి పెళ్లికి ఎక్కువ కట్నం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. బాధతో ఎదురు తిరిగిన చెల్లెలికి తాను అలా ఎందుకు చేయవలసి వచ్చిందో గతాన్ని విప్పి వివరిస్తాడు. తాను, ఆమె ఆ కుటుంబంలో రక్తసంబంధం లేని వ్యక్తులమని, అనాథలమని తెలియజేస్తాడు.

    విషయం తెలిసిన తమ్ముళ్లు లక్ష్మీని ఇంటి నుండి బయటకు గెంటేస్తారు. మరోపక్క లక్ష్మి కోసం కలకత్తా డాన్‌ ప్రదీప్‌ రావత్‌ నిద్రాహారాలు మాని వెతుకుతుంటాడు. శైలజ (చార్మి) లక్ష్మీని మూగగా ఆరాధిస్తూ పాటలు పాడుకుంటుంది. ఇంకో చోట నయన తార ఆస్పత్రిలో కోమాలో ఉంటుంది. ఆమె ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమిటి? లక్ష్మి తను ప్రేమించిన కుటుంబంలో సభ్యుడిగా చేరుతాడా అనేది తెరపై చూడాల్సిందే.

    సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఈ చిత్రంలో కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ అల్లిన కథ ఇది. గతంలో వచ్చిన సంక్రాంతి, రాము (బాలకృష్ణ), అన్నయ్య (చిరంజీవి) సినిమాల ఛాయలను కనబరుస్తూ సింహాద్రిని గుర్తు చేసే ఫ్లాష్‌బ్యాక్‌తో కథ ఉంటుంది. కథలో ఉండే కొన్ని అంశాలను స్క్రేన్‌ప్లేతో దాస్తూ అవసరాన్ని బట్టి రివీల్‌ చేస్తూ వుంటే ఆసక్తిని రేపుతుంది. భాష చిత్రం నుండి పాపులర్‌ అయిన ఈ ఫార్ములాని రెండు సార్లు ఫ్లాష్‌బ్యాక్‌లు ఉపయోగించడం కొంత అతిగానే అనిపిస్తుంది. కానీ వినాయక్‌ కథ నడపడంలో చూపే స్పీడ్‌, హీరోను పరిచయం చేసే పద్ధతి, చక్కని ఫ్రేమింగ్‌ దాన్ని మరుగున పరిచాయి. ఏదేమైనా సెకండాఫ్‌లో హీరో తనని తాను నిలబెట్టుకోవడానికి ఏ చర్యలూ చేయకపోవడం, విలనే అన్నీ చేస్తున్నాడని తెలిసినా సహించడం సెంటిమెంట్‌ను పండించినా హీరోపరంగా కొంత నిరాశ. డైరెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథను నడపడంతో ఈ విషయం పెద్దగా కనపడదు. అలాగే ఓ వయస్సుకు వచ్చిన తమ్ముళ్లను బెల్టుతో కొట్టి క్రమశిక్షణలో పెట్టాలనుకోవడం సినీ విచిత్రమే. విలన్‌ కొడుకు వెంకటేష్‌ను తలుచుకుంటూ భయపడే సన్నివేశం సినిమాలో హైలెట్‌. నయనతారతో 'లక్ష్మీంబావ' అనే పాట, చార్మితో ఓ పాట మాస్‌ టచ్‌తో ఆకట్టుకుంటాయి. కార్టూన్‌ కారెక్టర్‌ల ద్వారా వేణుమాధవ్‌, శకుంతల ఫైట్స్‌ చూపెట్టడం కారు రోబొ యానిమేషన్‌ పిల్లలను ఆకట్టుకునే మంచి ప్రయోగాలు. బ్రహ్మానందం, సునీల్‌ ఉన్నది కాసేపే అయినా బాగానే నవ్వించారు. ఏదమైనా విభిన్న షేడ్స్‌తో లక్ష్మిగా వెంకటేష్‌ నటన, సెంటిమెంట్‌ ఫ్యామిలీలకు పట్టి సంక్రాంతి హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X