Leader Movie Review: లీడర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: లెజెండ్ శరవణన్, షామ్, ఆండ్రియా జెర్మియా, పాయల్ రాజ్‌పుత్, సంతోష్ ప్రతాప్, అమృతా అయ్యర్, వీటీవీ గణేష్, జార్జ్ మార్యన్ తదితరులు
దర్శకత్వం: ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్
సినిమాటోగ్రఫి: వెంకటేష్ ఎస్
ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్
సంగీతం: జిబ్రాన్ వైబోధా
బ్యానర్: లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-04-03
తూతుకూడి ప్రాంతంలో కారు మెకానిక్‌గా శక్తివేల్ (లెజెండ్ శరవణన్) తన కూతురుతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. తూతుకూడి పోర్టులో సాల్డ్ ( బాహుబలి ప్రభాకర్) తన ముఠాతో ఇంటర్నేషనల్ మాఫియా రాకెట్‌ను నడుపుతుంటాడు. డెవిల్ (సంతోష్ ప్రతాప్) అక్రమంగా అమ్మోనియం నైట్రేట్ రవాణా చేస్తుంటాడు. వీరి అక్రమ దందాను అడ్డుకొనేందుకు చంద్ర సత్యమూర్తి (ఆండ్రియా జెర్మెయా) ప్రయత్నిస్తుంటుంది. కొత్తగా నియమితుడైన ఎస్పీ భక్తవత్సలం (షామ్) ఆమెను విధుల నుంచి తప్పిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాల్ట్ నిర్వహించే పోర్టు దందా వద్ద కారు రిపేర్ చేయడానికి వెళ్లిన శక్తివేల్ వారికి టార్గెట్ అవుతాడు. దాంతో శక్తివేల్ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు.

కారు మెకానిక్ శక్తివేల్ జీవితంలో ఏం జరిగింది? శక్తివేల్‌కు భార్య(పాయల్ రాజ్‌పుత్) ఎందుకు దూరమైంది? శక్తివేల్‌కు మారన్ అనే మారు పేరు ఎందుకు ఉంది? సాల్ట్ చేసే ఇంటర్నేషన్ మాఫియా ఏంటి? డెవిల్ అమ్మోనియం నైట్రేట్ అక్రమ వ్యాపారాన్ని ఎందుకు చేస్తున్నాడు? సాల్ట్, డెవిల్ అక్రమ వ్యాపారాలను చంద్ర ఎలా బట్టబయలు చేయాలనుకొన్నది? డెవిల్ కూతుర్ని కిడ్నాప్ చేసిన తర్వాత శక్తివేల్ రియాక్షన్ ఏమిటి? అసలు శక్తివేల్ గతం ఏమిటి? ఫ్లాష్ బ్యాక్‌లో శక్తివేల్ లైఫ్‌కు సంబంధించిన ట్విస్ట్‌లు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లీడర్ సినిమా కథ.
సాల్ట్, డెవిల్ చేసే ఇంటర్నేషనల్ మాఫియా వ్యవహారాలతో సినిమా యాక్షన్ మోడ్‌లో ఓపెన్ అవుతుంది. కానీ అండర్ డాగ్‌గా శక్తివేల్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి కథను మెల్లగా ఆడియెన్‌కు కనెక్ట్ చేసే దర్శకుడు దర్శకుడు దురై సెంతిల్ కుమార్ తీరు ఆకట్టుకొనేలా ఉంది. శక్తవేల్ పాత్రలో లెజెండ్ శరవణన్‌ను చూపించిన విధానం, అతడి బాడీలాగ్వేంజ్, హావభావాలకు మంచి క్యాప్చర్ చేసి ఆ పాత్రలో కూర్చుండబెట్టిన విధానంతో సినిమా ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతో ఫస్టాఫ్ బాగా డిజైన్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక సెంకడాఫ్‌లో శక్తివేల్ క్యారెక్టర్ మారన్‌గా మారిన విధానం.. ఆ క్యారెక్టర్‌లో శరవణన్‌ను ప్రొజెక్ట్ చేసిన స్టైల్ బాగుంది. సెకండాఫ్‌లో స్టోరీ వేరియేషన్ బాగుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు ఇచ్చిన ట్విస్టులతో సినిమా నెక్ట్స్ లెవెల్ అనిపించేలా చేసింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కేవలం దురై సెంథిల్ కుమార్ కే దక్కాలి అనిపించేంతగా లీడర్‌ను తీర్చిదిద్దారు. లవ్, యాక్షన్, చైల్డ్ సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మార్చారు. ఇటీవల కాలంలో వచ్చిన సీక్రెట్ ఏజెంట్ సినిమాలో బెస్ట్ థ్రిల్లర్‌గా చెప్పుకోవచ్చు.
లెజెండ్ సినిమా సమయంలో శరవణన్‌కు నటుడిగా చాలా పరిమితులు ఉన్నాయి. యాక్టర్‌గా ఆయన చాలా ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ లీడర్ సినిమాతో అలాంటి విమర్శకులకు సమాధానం చెప్పేలా తనను తాను యాక్టర్'గా మార్చుకొన్నారు. యాక్టర్‌గా లుక్ వైజ్, పెర్ఫార్మెన్స్ వైజ్ పూర్తిగా మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్‌పుత్ పాత్ర చిన్నదైనా డీసెంట్‌గా నటించింది. ఆండ్రియా తన పాత్రలో ఒదిగిపోయింది. బాహుబలి ప్రభాకర్, సంతోష్ ప్రతాప్ తదితరులు గుర్తుండిపోయే క్యారెక్టర్లలో కనిపించారు.
లీడర్ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, ఎడిటింగ్ ఈ చిత్రానికి కీలకంగా మారాయి. ఈ మూవీకి జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించింది. కొన్ని సీన్లను బాగా హైలెట్ చేసింది. శరవణన్ క్యారెక్టర్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోయింది. కానీ నాసిరకంగా ఉన్నాయి. ప్రదీప్ రాఘవన్ ఎడిటింగ్ ఈ సినిమా స్క్రీన్ ప్లేను బాగా ప్రొజెక్ట్ చేసింది, మంచి నేరేషన్‌తో ట్విస్టులను సరైన ప్లేస్‌లో పెట్టారు. దాంతో ఈ సినిమాకు ఓ బ్యూటీ వచ్చింది. నిర్మాణ విలువలు రిచ్‌గా, చాలా ప్రొఫెషనల్ స్థాయిలో ఉన్నాయి.
లీడర్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. సీక్రెట్ ఏజెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాకు బలం దర్శకుడు దురై సెంథిల్ కుమార్. లెజెండ్ శవరణన్ బ్యాలెన్స్ పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్. అంచనాలు లేకుండా వెళితే.. ఈ సినిమాను ప్రతీ సన్నివేశంలోను ఎంజాయ్ చేయవచ్చు. ఈ వారం మంచి మాస్ యాక్షన్ థ్రిల్లర్ తరహా సినిమా చూడాలంటే.. లీడర్ మూవీని ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications











