The Mummy Review: ది మమ్మీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: జాక్ రేనార్, లైయా కోస్టా, నాటాలీ గ్రేస్, వెరోనికా ఫాల్కన్, మే కాలమావీ తదితరులు
దర్శకత్వం: లీ క్రానిన్
నిర్మాతలు: జేమ్స్ వాన్, జాసన్ బ్లమ్, జాన్ కెవిల్లే
సినిమాటోగ్రఫి: డేవ్ గార్బెట్
ఎడిటింగ్: బ్రయాన్ షా
మ్యూజిక్: స్టీఫెన్ మెకెన్
బ్యానర్: న్యూలైన్ సినిమా, బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్
రిలీజ్: 2026-04-17
కథ ఏమిటంటే?
టెలివిజన్ ఛానెల్‌లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అయిన చార్లీ కానన్ (జాక్ రేనార్) తన భార్య లారిసా కానన్ (లైయా కోస్టా), క్యాటీ (నటాలియా గ్రేస్), మరో ఇద్దరు సంతానంతో జీవిస్తుంటాడు. లైఫ్ హ్యాపీగా సాగుతున్న సమయంలో క్యాటీ కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత కొన్ని నెలలకు క్యాటీ ఆచూకీ తెలుస్తుంది. కానీ చార్లీ, లారిసా తమ కూతురు క్యాటీని చూసుకొందమని వెళ్లే.. మమ్మీగా మారిన రూపంలో అతి భయంకరంగా కనిపిస్తుంది. కూతురు చేసే విపరీత చేష్టలకు భయపడిపోతారు. అయితే క్యాటీని పరిస్థితిని అర్ధం చేసుకొని చార్లీ, లారిసా తమ ఇంటిలోకి తీసుకొచ్చి ఇంటిలో ప్రత్యేకమైన గదిలో పెడుతారు.

స్టోరీలో ట్విస్టులు ఇలా..
క్యాటీ అదృశ్యం కావడం వెనుక కారణం ఏమిటి? క్యాటీని ఎవరు మమ్మీగా మార్చారు. క్యాటీ మమ్మీగా మారిన తర్వాత ఎంత భయంకరంగా చేష్టలు చూపించింది. చూడటానికే దడ పుట్టించే రూపంలో ఉన్న కూతురు క్యాటీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొన్న తర్వాత అతి భయంకరమైన సంఘటనలు ఏమిటి? మమ్మీగా క్యాటీ సృష్టించిన విపత్కర సంఘటనలు ఏమిటి? మమ్మీ రూపం నుంచి క్యాటీ మళ్లీ వెనక్కి వచ్చిందా? మమ్మీ రూపం నుంచి క్యాటీ బయటకు రావడానికి తల్లిదండ్రులు చేసిన త్యాగం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లీ క్రోనిన్స్ ది మమ్మీ (Lee Cronin's The Mummy) సినిమా
కథ.
ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
లీ క్రోనిన్స్ ది మమ్మీ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో జాయ్‌ఫుల్‌గా మొదలవుతుంది. అయితే హారర్ థ్రిల్లర్ కథను చెప్పడానికి ఎంచుకొన్న స్క్రీన్ ప్లే, రాసుకొన్న సన్నివేశాలు ప్రేక్షకుడిని సినిమాకు ఎంగేజ్ చేసేలా ఉంటాయి. దర్శకుడు లీ క్రానిన్ అనుసరించిన స్క్రీన్ ప్లే, కథను చెప్పిన విధానం ఇంట్రెస్టింగ్‌గా ఫస్టాఫ్‌లో క్యాటీ మమ్మీగా మారడానికి కారణాలను సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా చెప్పడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చ. అయితే హారర్ ఎలిమెంట్స్‌ను కథలోకి జొ్పించిన విధానం లీ క్రానిన్ దర్శకత్వ ప్రతిభకు అద్ధం పట్టింది. ఫస్టాఫ్‌లో మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అంశాలు ఉండటంతో థ్రిల్లింగ్‌గా ఫీలవ్వడానికి అవకాశం ఉంటుంది.
సెకండాఫ్ రివ్యూ
అయితే సెకండాఫ్ ఆరంభంలో కథలోని అంశాలు డీటైల్‌గా చెప్పే ప్రయత్నం వల్ల సినిమా వేగం మందగించినట్టు అనిపిస్తుంది. సినిమా కథను సాగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండాఫ్‌లో 30 నిమిషాల తర్వాత ప్రేక్షకుడికి చూపించిన సన్నివేశాలు భయం పుట్టించేలా ఉంటాయి. కొన్నిసార్లు చూడలేనంతగా హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓవరాల్‌గా హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసే ప్రేక్షకులు మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను అందించారని చెప్పవచ్చు.
యాక్టర్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
చార్లీ కానన్‌గా జాక్ రేనార్, లారిసా కానన్‌గా లైయా కోస్టా, క్యాటీ నటాలీ గ్రేస్ పాత్రలే ఈ సినిమాకు కీలకం. అలాంటి పాత్రల్లో ముగ్గురు జీవించారనే చెప్పాలి. బాలనటి క్యాటీగా నటాలీయా గ్రేస్ చూపించిన నటన భేష్ అనిపించేలా ఉంటుంది. మమ్మీగా మారిన తర్వాత నటాలియా చూపించిన హావభావాలు గుండెలో దడ పుట్టిస్తాయి. తాను తప్ప మరొకరు ఈ పాత్రలో చేయలేరనంతగా నటించింది. మిగితా పాత్రల్లో నటించిన వారాంతా పర్వాలేదనిపిస్తారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ రివ్యూ
ఈ సినిమాకు ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి బ్యాన్ బోన్‌లా ఉంటాయి. హారర్ సినిమాకు కావాల్సిన వాతావరణాన్ని అద్బుతంగా సృష్టించారు. ప్రతీ అంశలో కూడా డీటెయిలిటీ బాగుంది. ఆర్ట్ వర్క్‌ను, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను డేవ్ గార్పెట్ తన కెమెరాలో సూపర్బ్‌గా బంధించారు. స్టిఫెన్ మెకెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. హారర్ సన్నివేశాలను మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు అదనపు బలంగా మారాయి. మమ్మీ ఫ్రాంచైజీలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోను నిరాశపరచదు. కాబట్టి ఈ సినిమాను ఈ వారం చూసే మూవీల జాబితాలో చేర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications