Lenin First Review: లెనిన్ మూవీ ఫస్ట్ రివ్యూ

యువ హీరో, హీరోయిన్లు అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Lenin CBFC Reivew

చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామంలో లెనిన్, భారతీ అనే యువ జంట ప్రేమ కథ చుట్టు అల్లుకొన్న రూరల్ డ్రామాను ఇటీవల కాసర్ల రాధిక, మద్దూరు భార్గవి రెడ్డి, కందుకూరి రాజశేఖర్, నార్కెట్‌పల్లి ప్రేమ్‌రాజ్, రాహుల్ గోవాల్కర్ (ఈవో)తో కూడిన జట్టు ఈ మూవీని వీక్షించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 15వ సీన్ నంబర్‌లో డైలాగ్‌ను మార్చారు. తలను నరకడం, తలలేని శరీర భాగం విజువల్‌ నిడివిని తగ్గించాలని సూచించారు. అలాగే కొన్ని శరీర భాగాలను డార్క్ చేశారు. రక్తపు ధారలు, హింసకు సంబంధించిన క్లోజప్ షాట్స్ తగ్గించాలని సూచించారు. అలాగే కత్తిపోట్ల సీన్‌ను బ్లర్ చేయాలని సెన్సార్ బోర్డు సభ్యులు సూచించారు. దాంతో చిత్ర యూనిట్ తగిన మార్పులు, చేయడంతో ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక సెన్సార్ బోర్డు సభ్యులు వీక్షించిన తర్వాత, జరిగిన మార్పులు, చేర్పుల అనంతరం ఈ మూవీకి యూఏ16+ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు దాటిన వారికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో మూవీని చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ జారీ చేసిన పత్రంలో వెల్లడించారు. ఇక ఈ సినిమా కథ, కథనాలు డిమాండ్ చేయడంతో ఈ మూవీ నిడివిని 2 గంటల 38 నిమిషాలకు పరిమితం చేశారు. అంటే ఈ సినిమా రన్ టైమ్ 158.33 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

లెనిన్ సినిమా కథ, కథనాల విషయనికి వస్తే.. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు విజన్, స్క్రీన్ ప్లే పాజిటివ్ అంశంగా ఉంటుంది. కథను గ్రిప్పింగ్ చెప్పిన విధానం, అఖిల్‌ను గ్రామీణ యువకుడిగా చూపించిన విధానం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. భారతీ పాత్రలో భాగ్యశ్రీ భోర్సే టాలెంట్‌ను వెలికి తీసిన విధానం హైలెట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలోని కొన్ని ట్విస్టులు ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తాయి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా తెర మీద ఆవిష్కరించారు. ఎమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో ఈ సినిమా భావోద్వేగా సాగుతుందనే టాక్ సెన్సార్ తర్వాత వినిపిస్తున్నది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: lenin akhil bhagyasri borse
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X