Lenin Twitter Review: లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
Lenin Twitter Review: అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా తెరకెక్కిన లవ్,ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ మూవీని తెరకెక్కించగా, అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. ఈ సినిమాలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీని అందించగా, థమన్ ఎస్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలీ నిర్వహించారు. యాక్షన్ సన్నివేశాలను దిలీప్ సుబ్బరాయన్, రామ్-లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్ రూపొందించగా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో లెనిన్ మూవీపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..

అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన ఓ అభిమాని ట్విట్టర్ (X) వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంటెన్స్‌గా, ఎంగేజింగ్‌గా సాగిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఫ్రెండ్‌షిప్, లవ్ ట్రాక్‌లను దర్శకుడు అద్భుతంగా హ్యాండిల్ చేశాడని ప్రశంసించాడు. అఖిల్, భాగ్యశ్రీ భోర్సే మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని, ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు పూర్తిగా ఊహించని విధంగా ఉండి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
'లెనిన్' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది . సినిమా చూసిన మరో అభిమాని ట్విట్టర్ (X)లో 'బ్లాక్‌బస్టర్ రిపోర్ట్స్' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అఖిల్ తన గత చిత్రాలతో పోలిస్తే నటన చాలా బాగుందడని ప్రశంసించాడు. అలాగే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నాడు. అఖిల్, భాగ్యశ్రీ భోర్సే మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తెలిపాడు. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉన్నాయని, చివరకు "హిట్టు బొమ్మ బాయ్స్" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మరో అభిమాని ట్విట్టర్ (X) వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. సినిమా తొలి గంట కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ప్రీ-ఇంటర్వెల్‌కు ముందు వచ్చే 30 నిమిషాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని వెల్లడించాడు. అలాగే రెండో భాగం వరుస ట్విస్టులతో ఆసక్తికరంగా సాగిందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచిందని ప్రశంసించాడు. మొత్తంగా చూస్తే అఖిల్ కెరీర్‌లో ఇది గొప్ప సినిమా అని, తప్పకుండా థియేటర్లలో చూడదగ్గ చిత్రమని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
'లెనిన్' సినిమా చూసిన మరో అభిమాని ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. అఖిల్ తన కెరీర్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇది పర్ఫెక్ట్ మూవీ అని, సినిమాలో అఖిల్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని పేర్కొన్నాడు. అలాగే సీనియర్ నటుడు శివాజీ నటన ఎంతో అద్భుతంగా ఉందని, బ్రహ్మాజీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసించాడు. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని, BGM ఫైర్ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
మరోకరు ట్విట్టర్ (X)లో తాను ఊహించిన దానికంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉందని పేర్కొన్నాడు. ఆరంభం నుంచే సినిమా ఎంతో ఇంటెన్స్‌గా, ఎంగేజింగ్‌గా సాగిందని, కథ, ఎమోషన్స్, డ్రామాను ఎలాంటి బోరింగ్ సన్నివేశాలు లేకుండా ఆసక్తికరంగా చూపించారని ప్రశంసించాడు. ముఖ్యంగా స్నేహం, ప్రేమ ట్రాక్‌లను దర్శకుడు ఎంతో అందంగా తెరకెక్కించాడని, ప్రతి ప్రధాన పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎమోషనల్ సన్నివేశాలు మరింత ప్రభావవంతంగా అనిపించాయని తెలిపాడు. అలాగే అఖిల్, భాగ్యశ్రీ భోర్సే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని, శివాజీ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాలు పూర్తిగా ఊహించని విధంగా ఉండి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయని అంటూ తన ట్వీట్‌లో వెల్లడించాడు.


Click it and Unblock the Notifications