Leo Movie Review ఫ్యామిలీ ఎమోషన్స్‌తో లియో.. విజయ్, లోకేష్ కాంబినేషన్ వర్కవుట్ అయిందా? లియో రివ్యూ

Rating:
3.0/5

నటీనటులు: విజయ్, సంజయ్ దత్, త్రిషా, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్, సాండీ మాస్టర్, మనోబాలా, అభిరామి, మడొన్నా సెబాస్టియన్, కిరణ్ రాథోడ్ తదితరులు
రచన, దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
బ్యానర్: సెవన్ స్క్రీన్ స్టూడియో
నిడివి: 164 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-10-19

లియో కథ: హిమచల్ ప్రదేశ్‌లోని థియోగ్ ప్రాంతంలో కాఫీ షాప్ పెట్టుకొని భార్య, ఇద్దరు పిల్లలతో సాధారణమైన జీవితం గడిపే పార్తీబన్ (విజయ్)‌ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకొంటాయి. అప్పటి వరకు ప్రశాంతమైన లైఫ్‌ను కొనసాగిస్తున్న పార్తీబన్‌ ఫ్యామిలీ మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. పార్తీబన్‌ను చూసి లియో (విజయ్)గా భావించి.. ఆయనను, అతడి కుటుంబాన్ని చంపేందుకు ఆంథోని దాస్ (సంజయ్ దత్), హరోల్ దాస్ (అర్జున్ సర్జా) ప్రయత్నిస్తుంటారు.

Vijay Performance, Lokesh Kanagaraj taking lead movie into success zone

లియో మూవీలో ట్విస్టులు: పార్తీబన్ లైఫ్‌లో చోటు చేసుకొన్న సంఘటనలు ఏమిటి? ఆయన కుటుంబ సభ్యులను గుండాలు ఎందుకు వెంటాడుతుంటారు? తన కుటుంబాన్ని రక్షించుకొనేందుకు పార్తీబన్ ఎంతకు తెగించాడు? ఇంతకు లియో ఎవరు? లియో కారణంగా పార్తీబన్‌కు, ఆయన ఫ్యామిలీకి ఎలాంటి కష్టాలు వచ్చిపడ్డాయి. పార్తీబన్ కుటుంబాన్ని ఆంథోని, హరోల్ దాస్ ఎందుకు వెంటాడారు? పార్తీబన్, లియో ఒకరేనా? చివరకు తనకు ఎదురైన సమస్యలను పార్తీబన్‌ ఎలా ఎదురించాడు?ఆంథోని, హరోల్ దాస్‌ను ముఠా నుంచి ఎదురైన పరిస్థితులను ఎలా పరిష్కరించుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే లియో సినిమా.

Leo Movie Review and Rating

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?: విజయ్ హై ఎనర్జీ ఎంట్రీతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో లియో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొదలువుతుంది. పార్తీబన్ కాఫీ షాప్‌లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటన కారణంగా భార్య, కొడుకు, కూతురు ప్రాణాలు ముప్పు ఏర్పడటంతో కథ హై ఎమోషనల్ జోన్‌లోకి వెళ్తుంది. ఇక జోషి ఆండ్రూస్ (గౌతమ్ వాసుదేవ మీనన్) క్యారెక్టర్ ఎంట్రీతో యాక్షన్ స్థాయి మరింత పెరుగుతుంది. పార్తీబన్ ఫ్యామిలీని, గుండాలు వేటాడటం లాంటి సంఘటనలతో సినిమా ఫుల్ మాస్, కమర్షియల్ సినిమా అని అర్థమవుతుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు ఆంటోని దాస్ (సంజయ్ దత్) ఎంట్రీతో మంచి ట్విస్టుతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. సీన్లలో మంచి ఎనర్జీ, జోష్, స్క్రీన్ ప్లే పరుగులు పెట్టిస్తుంది.

Leo Movie Review and Rating

సెకండాఫ్‌లో ట్విస్టులు: ఇక సెకండాఫ్‌లో ఆంటోని, హరోల్ దాస్‌కు సంబంధించిన ఫ్లాష్ ఎపిసోడ్‌‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా మరింత క్యూరియాసిటిని పెంచేస్తుంది. కాకపోతే కథ అక్కడక్కడే ప్రీ క్లైమాక్స్ వరకు తిరగడం కొంత బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎలిసా దాస్ ( మడోన్నా సెబాస్టియన్) ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ట్విస్టులు, సన్నివేశాల్లో కొత్తదనం కేక పెట్టించేలా ఉంటుంది. లోకేష్ రాజ్ రాసిన కథ, కథనాలు సినిమాకు మరింత బలంగా మార్చాయి.

Leo Movie Review and Rating

విజయ్, త్రిషా, మడొన్నా గురించి: నటీనటుల విషయానికి వస్తే.. విజయ్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అనిపిస్తుంది. హై ఎనర్జీతో చేసిన ఫైట్స్, ఎంట్రీ సీన్‌లో హైనా అనే జంతువుతో చేసి యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు కీలకంగా మారింది. ఎమోషన్స్ పరంగాను, అలాగే యాక్షన్ పరంగాను విజయ్ మరోసారి చెలరేగిపోయాడు. రొటిన్‌కు భిన్నంగా త్రిషా గ్లామర్ పాత్రలో కాకుండా ఇద్దరు పిల్లల తల్లిగా భావోద్వేగమైన, భారమైన పాత్రలో ఒదిగిపోయింది. మడోన్నా సెబాస్టియన్ ఓ కీలక పాత్రలో మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. పోలీస్ కానిస్టెబుల్ నెపోలియన్ పాత్రలో జార్జ్ మార్యన్ పెర్ఫార్మెన్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోయినా ప్రజెన్స్ గుర్తుండి పోతుంది.

Vijay Performance, Lokesh Kanagaraj taking lead movie into success zone

సంజయ్ దత్, అర్జున్ సర్జా ఫెర్ఫార్మెన్స్: ఇక లియో సినిమాకు సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవన్ పాత్రలు మరింత స్ట్రెంత్‌ను ఇచ్చాయి. విజయ్ పాత్ర చుట్టు తిరిగే ఈ మూడు పాత్రలు ఫెర్ఫార్మెన్స్ బ్రహ్మండంగా ఉంటుంది. ఖల్ నాయక్ సంజయ్ దత్ మరోసారి మంచి పాత్రతో దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అలాగే అర్జున్ సర్జా సెకండాఫ్‌లో తన పాత్రతో డామినేషన్ చూపించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్.. హుందాగా తన పాత్రతో మరోసారి ఆకట్టుకొంటాడు. విజయ్ స్నేహితుడిగా మన్సూర్ ఆలీ ఖాన్ కూడా ఫర్వాలేదనిపిస్తారు.

అనిరుధ్ బీజీఎం గురించి: లియో టెక్నికల్ విషయానికి వస్తే.. మూవీని హై రేంజ్‌కు తీసుకుపోవడంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన పాత్ర పోషించాయి. అనిరుధ్ మరోసారి సన్నివేశాలను తన బీజీఎంతో బాగా ఎలివేట్ చేశారు. సినిమా అత్యంత బలంగా అనిరుధ్ మ్యూజిక్ నిలిచింది. ఈ సినిమాకు నిడివి కొంత మైనస్. 10 నుంచి 15 నిమిషాలు తగ్గించి ఉంటే సినిమా ఇంకా బెటర్ ఫీల్ వచ్చి ఉండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి.

Leo Movie Review and Rating

ఫైనల్‌గా లియో ఎలా ఉందంటే?: లియో సినిమా గురించి ఫైనల్‌గా చెప్పుకోవాలంటే.. ఫ్యామిలీ ఎమోషన్స్, సిస్టర్ సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌తోసాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో మితిమీరిన హింస, రక్తపాతం మైనస్‌గా కనిపిస్తాయి. ఎప్పటి లానే లోకేష్ కనకరాజ్ తన గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్‌తో తుపాకుల మోత మోగించాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్, అడుగడుగున యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్‌తోపాటు బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు బాగానే ఉన్నాయి. అవన్నీ వర్కవుట్ అయితే భారీ విజయం సాధించడానికి చాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ సత్తా ఏమిటో తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X