LGM Telugu Movie Review ఇవానా రొమాంటిక్ కామెడీ ఎలా ఉంది? MS Dhoni ఖాతాలో హిట్టు పడిందా?

Rating:
2.5/5
Star Cast: Ivana, Harish Shankar, Nadiya
Director: Ramesh Tamilmani

నటీనటులు: హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు
రచన, సంగీతం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రమేష్ తమిళమణి
నిర్మాతలు: సాక్షి ధోని, వికాస్ హసీజా
సినిమాటోగ్రఫి: విశ్వజిత్ ఓ
ఎడిటింగ్: ప్రదీప్ రాఘవ్
ఆర్ట్: అరుణ్ వెంజమూడు
బ్యానర్: ధోని ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2023-08-04

LGM Telugu Movie

సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే గౌతమ్ (హరీష్ కల్యాణ్), మీరా (ఇవాన) రెండేళ్లుగా ప్రేమించుకొంటారు. ప్రేమించుకోవడానికి ముందు చేసుకొన్న ఒప్పందం తర్వాత మీరా ముందు గౌతమ్ పెళ్లి ప్రపోజల్ పెడుతాడు. అయితే జీవితాంతం కలిసి ఉండాల్సిన అత్త (నదియా) గురించి తెలుసుకోవడానికి కొన్ని రోజులు ఆమెతో గడపాలని మీరా కండిషన్ పెడుతుంది. ఆ క్రమంలో కూర్గ్ ప్రదేశానికి వెకేషన్‌కు మీరా, గౌతమ్ ఫ్యామిలీలు వెళ్తారు.

LGM Telugu Movie

ప్రేమకు ముందు మీరా, గౌతమ్ ఎలాంటి ఒప్పందం చేసుకొన్నారు? కూర్గ్‌కు వెళ్లిన తర్వాత మీరాను పెళ్లి చేసుకోవద్దని గౌతమ్ ఎందుకు నిర్ణయం తీసుకొన్నాడు? ఆ తర్వాత అత్త, కోడళ్లు (నదియా, ఇవాన) ఇద్దరు కలిసి గోవా టూర్‌కు ఎందుకు వెళ్లారు? గోవా టూర్‌లో అత్తా కోడళ్లకు ఎలాంటి అనుభూతి కలిగింది? గోవా టూర్‌కు వెళ్లిన వారు అడవిలో దుండగులకు చిక్కిన వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? పులితో సహా బోనులో చిక్కుకొన్న అత్తా కొడళ్లు ఎలా తప్పించుకొన్నారు? చివరకు అత్త మనసు మీరాకు నచ్చిందా? గౌతమ్, మీరా పెళ్లి చేసుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే LGM మూవీ కథ.

LGM

పెళ్లి ప్రపోజల్‌తో మొదలైన స్టోరి సరైన రీతిలో పట్టాలెక్కకపోవడంతో సినిమా ఒడిదుడుకులుగా సాగిపోతుంటుంది. రెండు సీన్లు బాగున్నాయనుకొంటే.. వెంటనే మరో రెండు సీన్లు బోర్ కొట్టించేలా ఉంటాయి. దాంతో ప్రేక్షకుడు కథలో లీనమై ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ లభించదు. రెండు ఫ్యామిలీలు టూర్‌కు వెళ్లిన తర్వాత కూడా కథలో వేగం, వినోదం పెద్దగా ఆకట్టుకోదు. ఫస్టాఫ్‌లో హరీష్ కల్యాణ్, ఆర్జే విజయ్ మధ్య కొన్ని సీన్లు కామెడిని పండిస్తాయి. ఫస్టాఫ్‌లో యోగిబాబు నవ్వించే అవకాశమే ఇవ్వలేదు.

LGM

ఇక సెకండాఫ్‌లో అత్తాకోడళ్లు ఇవానా, నదియా గోవా టూర్‌కు వెళ్లిన తర్వాత కొంత కథలో జోష్ కనిపిస్తుంది. పబ్ సాంగ్, ఫారిన్ వ్యక్తితో నదియా రొమాంటిక్ మూమెంట్స్ ఫర్వాలేదనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో యోగిబాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్నివేశాల్లో వినోదం పడింది. కామెడీతో క్లైమాక్స్‌ కొంత ఫర్వాలేదనించేలా ముగుస్తుంది.

LGM

నటీనటుల విషయానికి వస్తే.. కథలో దమ్ము లేకపోయినా.. హీరో హరీష్ కల్యాణ్, హీరోయిన్ ఇవానా తమ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. కామెడీ పండించడానికి ఆర్జే విజయ్‌కు పెద్దగా స్కోప్ లేకపోయింది. యోగిబాబు అక్కడక్కడ నవ్వులతో ఆలరించాడు. నదియా డిగ్నిఫైడ్‌గా కనిపించింది.

LGM Telugu Movie

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రొమాంటిక్ కామెడీకి బలంగా ఉండే పాటలు ఈ సినిమాలో లేకపోవడం తేలిపోయిందనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. రైటింగ్ పార్ట్ ఈ సినిమాకు బ్యాడ్. బలమైన సన్నివేశాలు, హ్యుమర్‌తో కూడిన డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. వారికి ఫస్ట్ సినిమా కాబట్టి ప్రొడక్షన్‌పై పూర్తిగా అవగాహన లేదనిపిస్తుంది.

LGM

రొమాంటిక్, కామెడీగా రూపొందిన LGM మూవీకి సంబంధించి స్టోరి పాయింట్ బాగానే ఉంది. కానీ కథ, కథనాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. సింగిల్ పేరెంట్‌గా పెరిగిన గౌతమ్ క్యారెక్టర్ విషయంలో గానీ.. భర్తకు దూరమైన నదియా క్యారెక్టర్‌ విషయంలో ఎమోషనల్ కంటెంట్ మిస్ అయింది. యోగిబాబు క్యారెక్టర్ డిజైన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫస్టాఫ్‌ స్లోగా సాగితే.. సెకండాఫ్‌లో కొంత జోష్ కనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే టైంపాస్ మూవీ అనుకొని బయటకు రావొచ్చు. యూత్‌కు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాకు బలంగా కనిపిస్తాయి. వారాంతంలో ఈ సినిమాపై ఓ లుక్కేయండి.. మిక్స్‌డ్ ఎక్స్‌పీరియెన్స్ పొందే అవకాశం ఉంది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే హిట్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X