twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger Movie Review విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో.. పూరీ నాకౌట్ పంచ్ పడిందా అంటే?

    |

    Rating: 2.75/5

    టాలీవుడ్‌లో అదిరిపోయే డైలాగ్స్ .. మంచి స్క్రీన్ ప్లేతో కథను పరిగెత్తించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే.. పూరీ జగన్నాథ్‌ పేరే ముందుగా చెప్పుకొంటారు. ఇక హిట్టు, ఫ్లాప్ అనే విషయంతో సంబంధం లేకుండా ఈ మధ్య అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు లైగర్ అని పేరు పెట్టగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇక ప్రమోషన్స్‌తో సినిమాపై విజయ్ దేవరకొండ మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇలాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? పూరీ జగన్నాథ్ మళ్లీ సత్తా చాటాడా అనే విషయాల్లోకి వెళితే..

    లైగర్ సినిమా కథేంటంటే?

    లైగర్ సినిమా కథేంటంటే?

    కరీంనగర్‌కు చెందిన బాలమణి (రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్‌ (విజయ్ దేవరకొండ)ను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ చేయాలనుకొంటుంది. మార్షల్ ఆర్ట్స్‌లో చాంపియన్ మార్క్ అండర్సన్ (మైక్ టైసన్)ను పిచ్చిగా లైగర్‌ ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో ముంబైలోని మార్షల్ ఆర్ట్స్ కోచ్‌ (రోనిత్ రాయ్) వద్ద లైగర్‌ను చేర్పిస్తుంది. ఇదిలా ఉండగా లైగర్‌ను మొదటి చూపులోనే తానియా (అనన్య పాండే) ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల లైగర్‌ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. లైగర్‌తో బ్రేకప్ తర్వాత తానియా ఓ మాఫియా అధినేత చేతిలో కిడ్నాప్‌కు గురి అవుతుంది.

    లైగర్ మూవీలో ట్విస్టులు

    లైగర్ మూవీలో ట్విస్టులు

    బాలమణి తన కొడుకుకు లైగర్ అని పేరు ఎందుకు పెట్టింది? లైగర్‌ను ఎందుకు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌ను చేయాలనుకొన్నది? లైగర్‌ ప్రేమను ఎందుకు తానియా రిజెక్ట్ చేసింది? తానియాతో బ్రేకప్ తర్వాత లైగర్ పరిస్థితి ఏమిటి? అమెరికాకు వెళ్లిన లైగర్‌కు మార్క్ అండర్సన్ (మైక్ టైసన్) ఎలాంటి పరిస్థితుల్లో ఎదురుపడ్డాడు. తాను అభిమానించే మార్క్ అండర్సన్‌ను లైగర్ ఎందుకు ఎదురించాల్సి వస్తుంది? తానియాను కిడ్నాప్ ఎవరు చేశారు? కిడ్నాపర్ నుంచి తానియాను లైగర్ ఎలా రక్షించాడు అనే సింపుల్ కథకు సమాధానమే లైగర్ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఆరంభంలో మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో లైగర్ సినిమా కథ మొదలవుతుంది. తన జీవితంలో జరిగిన విషయాలను లైగర్ చెప్పడం ద్వారా కథ ముందుకు వెళ్తుంది. కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్లడం, అక్కడ కొన్ని అవమానాలకు గురికావడం లాంటి అంశాలతో కథ ఓ మాదిరిగా సాగుతుంది. లైగర్ మార్షల్ ఆర్ట్స్ కోచ్ వద్ద చేరడం.. అనన్య పాండే లవ్ ట్రాక్ సరదాగా, యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగిపోతుంది. ఆలీ, గెటప్ శ్రీను కామెడీ పంచులు సినిమాలో హ్యుమర్‌ను పెంచింది. అనన్య పాండేతో లవ్ ట్రాక్ కిక్ ఎక్కించేలా లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్, విజయ్ యాక్షన్, ఫైట్స్ సినిమాను మరింత యూత్‌ఫుల్‌గా మారుస్తుంది. చిన్న ఎమోషనల్ ఎపిసోడ్‌తో లైగర్ ఫస్టాఫ్ ముగుస్తుంది.

    సెకండాఫ్  ఎలా ఉందంటే?

    సెకండాఫ్ ఎలా ఉందంటే?

    ఇక సెకండాఫ్‌లో బ్రేకప్ తర్వాత ఇంటర్నేషనల్ ఛాంపియన్‌ కావడానికి లైగర్ ప్రయత్నించడం.. జాతీయ ఛాంపియన్ తర్వాత విదేశాలకు వెళ్లే విషయం రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తో సెకండాఫ్‌ నిండిపోతుంది. చివర్లలో మైక్ టైసన్ ఎపిసోడ్ సీరియస్‌గా ఉంటుందనుకొంటే.. పూరీ తన మార్కుకు భిన్నంగా కామెడీతో కథను ముగించడం మరికొంత నిరాశను కలిగించినట్టు అనిపిస్తుంది.

    పూరీ జగన్నాథ్ మేకింగ్ ఎలా ఉందంటే?

    పూరీ జగన్నాథ్ మేకింగ్ ఎలా ఉందంటే?

    ప్రతీ సినిమాలో బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ దట్టించే పూరీ జగన్నాథ్.. ఈ సినిమాలో అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించడు. రెగ్యులర్, రొటీన్ ఫార్మాట్‌తో కథ లేకుండానే కేవలం విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌తో మ్యాజిక్ చేయాలనే సాహసం చేశాడనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్రను ఎమోషనల్ తీర్చిదిద్దిన పూరీ.. మిగితా పాత్రలు చాలా పేలవంగా డిజైన్ చేశాడు. కథకు అవసరమైనప్పుడు క్యారెక్టర్లను సన్నివేశాల్లోకి లాగే రెగ్యులర్ ఫార్మాట్‌తో ముందుకెళ్లాడు. నత్తి అనేది సినిమా ఫ్లోకు అడ్డుపడిందా అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికి.. చాలా చోట్ల డైలాగ్స్‌తో పూరీ మెరుపులు మెరిపించాడు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే అభిమానులు సంతోషపడి ఉండే వారేమో అనిపిస్తుంది. కథ లేకుండా పూరీ సినిమా తీయడం షాక్ కలిగించే అంశం.

    విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అదుర్స్

    విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అదుర్స్

    విజయ్ దేవరకొండ ఎప్పటి మాదిరిగానే ఫెర్ఫార్మెన్స్‌తో మెరుపులు మెరిపించాడు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఫ్యాన్స్‌నే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా థ్రిల్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. పాటలు, ఫైట్స్‌తో చెలరేగిపోయాడు. బలమైన కథ లేకపోయినప్పటికీ.. విజయ్ తన టాలెంట్‌తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్‌ ఇమేజ్‌తో ఉన్న విజయ్.. ఇక నుంచి కమర్షియల్, మాస్ హీరోగా ఈ సినిమాతో ఎస్టాబ్లిష్ కావడం మంచి పరిణామం అని చెప్పవచ్చు.

    ఇక మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే..

    ఇక మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే..

    రమ్యకృష్ణ మరోసారి మంచి పాత్రలో అద్బుతమైన ఎమోషన్స్‌ను పలికించింది. సినిమాకు ఆమె నటన పాజిటివ్ అంశంగా మారింది. ఇక అనన్య పాండే ఈ సినిమాకు పూర్తిగా మైనస్. గ్లామర్ పరంగాను, అలాగే ఫెర్ఫార్మెన్స్ పరంగాను ఆకట్టుకోలేకపోయింది. ఆలీ, గెటప్ శ్రీను అక్కడక్కడ నవ్వులు పూయించారు. రోనిత్ రాయ్, విష్ పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. ఇక మైక్ టైసన్ విషయమే పూర్తిగా నిరాశను కలిగిస్తుంది. చంకీ పాండే గెస్ట్ అప్పీరియెన్స్ మాదిరిగా ఉంటుంది.

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..


    విష్ణు శర్మ సినిమాటోగ్రఫి ఎక్సలెంట్‌గా ఉంది. సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. రెండు పాటలు తప్ప.. మిగితా పాటలు అంతగా కనెక్ట్ కాలేకపోయాయి. ఎడిటర్ జునైద్ సిద్దీఖి వర్క్ బాగుంది. బలహీనమైన స్క్రిప్టు ఉన్నప్పటికీ.. సన్నివేశాలను చకచకా పరుగులు పెట్టించారు. ఆర్ట్, ఇతర విభాగాల పనితీరు బాగుంది.

    నిర్మాణపరమైన విషయాలకు వస్తే..

    నిర్మాణపరమైన విషయాలకు వస్తే..

    కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సి ఉండేది. అయితే విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, మైక్ టైసన్ తప్పిస్తే.. పాత్రల కోసం ఎంపిక చేసిన నటీనటులు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాను లావిష్‌గా, మంచి క్వాలిటీతో అందించడం వారికి సినిమాపై ఉన్న అభిరుచిని తెలియచెప్పింది. వారు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో లవ్, యాక్షన్, ఎమోషనల్ పాయింట్లతో తెరకెక్కిన చిత్రం లైగర్. కొత్తదనం లేని కథనం, పూరీ మార్క్ మేకింగ్ కనిపించకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. సాధారణంగా పూరీ సినిమాలో లవ్ ట్రాక్ బ్రహ్మడంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో అదే సినిమాకు మైనస్‌గా మారింది. స్క్రిప్టు పరంగా అనేక లోపాలు ఉన్నప్పటికీ.. విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టేలా చేసింది. ఎమోషనల్‌ కంటెంట్ సరిగా పండకపోవడం మరో మైనస్. అయితే యాక్షన్ సీన్లు మాత్రం తెలుగు సినిమా స్టాండర్ట్స్‌ను పెంచేలా ఉన్నాయి. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్ రెస్సాన్స్ బట్టి ఈ సినిమా సక్సెస్ రేంజ్ తెలిసే అవకాశం ఉంది. రొటీన్, రెగ్యులర్ కథ ఉన్నప్పటికీ.. విజయ్ దేవరకొండ కోసం లైగర్ వన్ టైమ్ వాచ్.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్
    మాస్ ప్రేక్షకులకు నచ్చే డైలాగ్స్
    రెండు పాటలు, బీజీఎం
    రమ్యకృష్ణ ప్రజెన్స్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    కొత్తదనం లేకపోవడం
    అనన్య పాండే
    లవ్ ట్రాక్ ఆకట్టుకోలేకపోవడం

    లైగర్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    లైగర్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను, మైక్ టైసన్ తదితరులు
    కథ, డైలాగ్స్, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
    నిర్మాతలు: కరణ్ జోహర్, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరూ యష్ జోహర్
    సినిమాటోగ్రఫి: విష్ణుశర్మ
    ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ
    మ్యూజిక్: సునీల్ కశ్యప్
    బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, పూరీ జగన్నాథ్
    రిలీజ్ డేట్: 2022-08-025

    పంచ్ లైన్: నాకౌట్ పంచ్ మిస్

    English summary
    Liger Review: Liger movie hits the theatres on August 25th. Here is the exclusive review from Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X