Lingochha movie Review హిందూ, ముస్లిం లవ్ స్టోరీ.. లింగోచ్చా అంటే ఏమిటి?

Rating: 2.5/5

నటీనటులు: కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ కే, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కే నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు
దర్శకత్వం: ఆనంద్ బడా
నిర్మాత: యాదగిరి రాజు
సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల
సమర్పణ: జే నీలిమ
కథ, రచన: ఉదయ్ మదినేని
మ్యూజిక్: బికాజ్ రాజ్
ఎడిటర్: మ్యాడి అండ్ షాహి బదా
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎ ఆర్ సౌర్య
ప్రోడక్షన్ డిజైన్: అనిల్ కుమార్ తీగల
లైన్ ప్రోడ్యూసర్: సందీప్ తుంకూర్, శ్రీనాథ్ చౌదరి
రిలీజ్ డేట్: 2023-10-27

హైదరాబాద్ పాత బస్తీలో అల్లరి చిల్లరగా తిరిగే బార్బర్ కుమారుడు శివ.. నవాబు కుటుంబానికి చెందిన నూర్జహాన్‌‌ను చిన్నతనంలో తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. శివ, నూర్జహాన్ బాల్యంలోనే విడదీయలేనంత‌గా ఒకరినొకరు ఇష్టపడుతారు. అయితే ఉన్నట్టుండి నూర్జహాన్ దుబాయ్‌కి వెళ్లిపోతుంది. కానీ శివ మాత్రమే తన ప్రియురాలిని ఊహించుకొంటూ బతికేస్తుంటాడు. ఆ తర్వాత కొన్నేళ్లకి నూర్జహాన్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి మెడికల్ స్టూడెంట్‌గా ఎంబీబీఎస్ చదువుతుంటుంది.

Lingochha movie Review and Rating: Climax saved Karthik Ratnam love saga

నూర్జహాన్‌పై ఎలాంటి పరిస్థితుల్లో శివకు ప్రేమ పుడుతుంది? హైదరాబాద్‌ను వదిలేసి నూర్జహాన్ దుబాయ్‌కి ఎందుకు వెళ్లింది? ఎంబీబీఎస్ చదివే నూర్జహాన్‌ను తన ప్రేమ విషయంలో శివ ఎలా ఒప్పించాడు? పీకల్లోతూ ప్రేమలో మునిగిన ఆ ఇద్దరికి ఎదురైన ప్రతికూల పరిస్థితులేమిటి? తమకు అడ్డంకిగా నిలిచిన సమస్యను శివ, నూర్జహాన్ ఎలా ఎదురించారు? చివరకు నూర్జహాన్, శివ ప్రేమకు ముగింపు ఏమిటి? అసలు లింగోచ్చా అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలంటే లింగోచ్చా మూవీ చూడాల్సిందే.

Lingochha movie Review and Rating: Climax saved Karthik Ratnam love saga

లింగోచ్చా మూవీ బార్బర్ షాప్‌లో తాగుబోతు రమేష్, ఉత్తేజ్‌ మధ్య ఫన్‌ ఎలిమెంట్స్‌తో మూవీ స్టోరీ ప్రారంభమవుతుంది. అయితే శివ, నూర్జహాన్ చైల్డ్ ఎపిసోడ్ అవసరమైన దానికంటే ఎక్కువగా చూపించి సాగదీసిన ఫీలింగ్ కల్పించారు. ఫస్ట్ 30 మినిట్స్‌లో సన్నివేశాల్లో క్లాలిటీ లేకపోవడం వల్ల సాదాసీదా సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. నూర్జహాన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత శివ లవ్ ట్రాక్ కొంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. కానీ రొటీన్ సీన్లు ఉండటం కారణంగా కొత్తగా ప్రేమకథను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగదు. కానీ ఓల్డ్ సిటీ వాతావరణం.. హిందీ, ఉర్తూ, తెలుగు మిక్స్ డైలాగ్స్ సినిమాపై దృష్టిపెట్టేలా చేస్తాయి.

సెకండాఫ్‌లో తాగుడు, జబర్తస్త్ తరహా కామెడీ, ఫైట్లతో అలా సాగిపోతుంది. సినిమా చివరి 30 నిమిషాల వరకు రెగ్యులర్, రొటీన్ లవ్ స్టోరీ చూస్తున్నామనే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ చివరి 20 నిమిషాల్లో స్టోరీని, సన్నివేశాలను డీల్ చేసిన విధానం ఆనంద్ బడా దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిందనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ సన్నివేశాల పరంగా కొత్తగా ఆలోచించి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషనల్‌ పాయింట్‌తో ముగిసే లవ్ స్టోరికి ఓల్డ్ సిటీ నేటివిటి బలంగా కనిపిస్తుంది.

Lingochha movie Review and Rating: Climax saved Karthik Ratnam love saga

నటీనటుల విషయానికి వస్తే.. కార్తీక్ రత్నం ఎప్పుడూ తన పాత్ర పరిధికి మించి ఫెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఈ మూవీలో కూడా తన రోల్ వరకు చక్కగా నటించాడు. శివ పాత్రలో కొత్తగా కనిపించాడు. డ్యాన్స్‌లు, ఫైట్స్‌, డైలాగ్ డెలీవరితో ఆకట్టుకొన్నాడు. నూర్జహాన్‌గా సుప్యర్ధ సింగ్ ఒకే అనిపించారు. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ కథను డ్రైవ్ చేయడానికి ఉపయోగపడ్డారు. మిగితా పాత్రల్లో నటించిన వారి పాత్రల మేరకు ఒకే అనిపించారు.

లింగోచ్చా మూవీ టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు బికాజ్ రాజ్ అందించిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫి ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. హైదరాబాద్ అందాలను, మురికి వాడలను సహజసిద్దంగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకా కొన్ని కత్తెర్లు పడాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. యాదగిరిరాజు, మల్లేష్ కంజర్ల,జీ నీలిమ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Lingochha movie Review and Rating: Climax saved Karthik Ratnam love saga

హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. ఈ సినిమాకు క్లైమాక్స్ బలంగా ఉంది. పేరున్న నటీనటులు లేకపోవడం, టైటిల్ సరిగా లేకపోవడం కొంత మైనస్. ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం వల్ల రొటీన్ మూవీ చూసినట్టు ఉంటుంది. కానీ భారమైన హృదయంతో ప్రేక్షకుడిని ఓ అనుభూతిని కలిగించే క్లైమాక్స్ ఉండటం కొంత ఊరటగా అనిపిస్తుది. చాలా మంది కొత్తవారున్నప్పటికీ.. తమ ప్రతిభతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాదీ కల్చర్ ఆధారంగా సాగే సినిమాలను, ప్రేమ కథలను ఇష్టపడేవారికి లింగొచ్చా నచ్చే అవకాశం ఉంది. చివరగా లింగోచ్చా అంటే ఓ ఆట.. ఏడు రాళ్ల పలకలు పెట్టి బంతితో కొట్టే గ్రామీణ క్రీడ. తెలంగాణలో పిచ్చి బంతి, రకరకాల పేర్లతో పిలుస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X