twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    LKG movie review : పొలిటికల్ సెటైర్ సినిమా ఎలా ఉందంటే?

    |

    Rating : 2.5/5
    స్టార్ క్యాస్ట్ : ఆర్జే బాలాజీ, ప్రియా ఆనంద్‌, సంపత్‌,
    కధ: ఆర్జేబాలాజీ అండ్‌ ఫ్రెండ్స్‌
    దర్శకత్వం: కె.ఆర్‌.ప్రభు

    గతంలో తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ కంటే ఎక్కువగా డబ్బింగ్ చేసే ట్రెండ్ గట్టిగా ఉండేది. ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోవడంతో తమిళ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తెలుగులో డబ్ చేసి అందించే ప్రయత్నం చేస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇదే కోవలో ఆర్జే బాలాజీ హీరోగా నటించిన ఎల్కేజీ సినిమా నిన్నటి నుంచి ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతోంది. 2019లో రిలీజ్ అయిన తమిళంలో మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో ? ఇది తెలుగు ప్రేక్షకులను మెప్పించే అంశాలు సినిమాలో ఉన్నాయా లేదా ? అనేది రివ్యూ లో తెలుసుకుందాం.

    కథేమిటంటే

    కథేమిటంటే

    ఎప్పటికైనా రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తూ ఉండే లంకవరపు కుమార్ గాంధీ అలియాస్ ఎల్కేజీ తన తండ్రి లాగా నమస్కారాలు పెడుతూ కాలం గడిపేయకూడదని భావిస్తూ వీలైనంత త్వరలో మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావిస్తూ ఉంటాడు.. అందుకు తగ్గట్టుగానే కౌన్సిలర్ గా గెలిచిన ఎక్కేజీ జనాన్ని ఎలా మాయ చేయాలి ? వారిని తన వైపు ఎలా తిప్పుకోవాలి అనే అంశాలను అవపోసన పడతాడు.

    ముఖ్యమంత్రి చావుబతుకుల్లో ఉన్నాడని తెలిసి ఆయన చనిపోతే ఆ టికెట్ తాను ఎలా తెచ్చుకోవాలి అని ప్లాన్ చేసి చివరికి టికెట్ దక్కించుకుంటాడు ? ఆ టికెట్ మీద ఎల్కేజీ గెలుస్తాడా ? సీఎం కావాలనుకునే అతని కోరిక ఫలిస్తుందా ? అనేదే సినిమా.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం లంకవరపు కుమార్ గాంధీ ఎవరు ? అతని లక్ష్యం ఏమిటి ? అనే విషయాలను ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా దర్శకుడు చూపించాడు. అలాగే కథలో ఉన్న ఒక ట్విస్ట్ ను సెకండాఫ్ లో బాగా చూపించారు. సాధారణంగా ఈ పొలిటికల్ అంశాలకు సంబంధించిన సినిమాలు తమిళనాట చాలానే వచ్చాయి. కానీ పొలిటికల్ సెటైర్ వేస్తూనే ప్రజలను ఆలోచింపజేసేలా సినిమాను రూపొందించాడు దర్శకుడు.

    దర్శకుడి పని తీరు

    దర్శకుడి పని తీరు

    రాజకీయ నేతలు ఎదగడానికి పదవి చేజిక్కించుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేస్తారు? ప్రజలను ఎలా మోసం చేస్తారు ? అనేవి అనేక సినిమాల్లో చూపించారు. ఈ సినిమాలో కూడా అలాగే చూపించి ఆకట్టుకున్నారు. దర్శకుడు ప్రభు సోషల్ మీడియాను నమ్ముకున్న వారికి క్షణాల్లో ఎలా క్రేజ్ లభిస్తోంది ? ఎలా కొన్ని రోజుల్లోనే పాపులారిటీ సంపాదిస్తున్నారు ? అనే విషయాలను బాగా చూపించడమే కాక నేటి రాజకీయాల్లో ఎదగాలంటే కావలసిన విషయాలు ఏమిటి అనే విషయాల మీద ఫోకస్ పెట్టడంలో సఫలమయ్యారు అని చెప్పాలి.

    నటీనటుల పనితీరు

    నటీనటుల పనితీరు

    నటీనటుల విషయానికి వస్తే ఎల్కేజీగా ఆర్.జి బాలాజీ నటన చాలా బాగుంది. అయితే అతని ప్రేయసిగా చూపించాలని భావించిన ప్రైవేట్ పోల్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే సరళతో కెమిస్ట్రీ మాత్రం కుదరలేదు. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అనవసరపు సీన్స్ లేకుండా నేరుగా పాయింట్ లోకి తీసుకువెళ్తారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    టెక్నికల్ విషయానికి వస్తే

    టెక్నికల్ విషయానికి వస్తే

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే సినిమాకి దర్శకత్వం వహించిన ప్రభు దాదాపు మంచి మార్కులు అందుకున్నట్లే. ఈ సినిమాకి స్వయంగా కథ అందించిన ఆర్జే బాలాజీ ఆయన స్నేహితులు కూడా కథ ద్వారా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన విధు అయ్యన్న విజువల్స్ ఆకట్టుకున్నాయి.. తమిళ సినిమా కావడంతో తెలుగులో పాటలు పెద్దగా ఆసక్తికరంగా లేవనే చెప్పాలి. మొత్తం మీద చూస్తే టెక్నికల్ పరంగా ఎక్కడా వంక పెట్టాల్సిన పనిలేదు.

    ఫైనల్ గా

    ఫైనల్ గా

    ఇక ఫైనల్ గా ఎలా అయినా ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలని భావించిన ఎల్కేజీ చివరికి సీఎం అయ్యాక ప్రజలకు ఇచ్చే మెసేజ్ ప్రేక్షకులు అందరినీ ఆకర్షింప చేస్తుంది. తుపాకీ కంటే ఓటు బలమైన ఆయుధం అని చెప్పడమే కాక ఓటుకు నోటు ఇచ్చే రాజకీయ నాయకులు ఎంత తప్పు చేస్తున్నారి వాటిని తీసుకుంటూ కూడా అంతే తప్పు చేస్తున్నారని బల్లగుద్ది చెప్పడం ప్రజలకు టచ్ అయ్యే అంశం. అయితే తమిళనాడు లాంటి పొలిటికల్ గా యాక్టివ్గా ఉండే రాష్ట్రాల్లో జరిగే అంశాలను ఎక్కువగా ఈ సినిమాలో సెటైరిక్ గా చూపించారు. అయితే మొత్తం మీద ఈ కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు కథలైన వాళ్లంతా ఆనందంగా ఈ సినిమా చూసేయొచ్చు.

    English summary
    LKG is a 2019 Indian Tamil-language political satire film produced by Ishari K. Ganesh under the banner Vels Film International, directed by K. R. Prabhu. It was released on telugu at aha. here is the review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X