Lockdown Movie Review: లాక్‌డౌన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, చార్లీ, నిరోషా, ప్రియావెంకట్, ఇందుమతి, అభిరామి, ప్రియా గణేష్ తదితరులు
దర్శకత్వం: ఏఆర్ జీనా
నిర్మాత: సుభాస్కరన్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
మ్యూజిక్: ఎన్ఆర్ రంగనాథన్, సిద్దార్థ్ విపిన్
సినిమాటోగ్రఫి: కేఏ శక్తివేల్
ఎడిటింగ్: వీజే సాబు జోసెఫ్A
రిలీజ్ డేట్: 2025-12-05
స్క్రీనింగ్: IFFI వరల్డ్ ప్రీమియర్

అనిత (అనుపమ పరమేశ్వరన్) మంచి లక్షణాలు ఉన్న దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. డిగ్రీ పూర్తి కాగానే మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. జాబ్ ఇచ్చిన సందర్భంలో తన స్నేహితుడు, హెచ్ఆర్ ప్రదీప్ ఓ పార్టీకి తీసుకెళ్తాడు. ఆ పార్టీలో ఓ డ్రింక్ తాగుతుంది. ఆ తర్వాత ఓసారి ఓ వేడుకలో డ్యాన్స్ చేస్తూ సృహతప్పి కిందపడుతుంది. ఆ తర్వాత వైద్యులు పరీక్షించి అనిత గర్బవతి అని డిసైడ్ చేస్తారు. అయితే గర్బాన్ని తొలగించుకొనేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌డౌన్ విధిస్తారు.

Lockdown Movie Review and Rating  Anupama Parameshwaran s Award winning performance touches the hearts

తన ప్రమేయం ఏమీ లేకుండానే ప్రెగ్నెన్సీ రావడంతో అనిత పరిస్థితి ఏమిటి? గర్బాన్ని తొలగించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఏమిటి? గర్బాన్ని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నంలో లాక్ డౌన్ విధించడంతో అనిత ఏం చేసింది? 30 వేల రూపాయలకు గర్బాన్ని తొలగిస్తానని డబ్బు తీసుకొన్న డాక్టర్ కరోనాకు గురైతే ఆమె పరిస్థితి ఏమిటి? మరో వైద్యుడిని సంప్రదిస్తే అనిత ఎదురైన వేధింపులు ఏమిటి? ఇంతకు అనిత గర్బాన్ని తొలగించుకొన్నదా? లాక్‌డౌన్ ఆమెను ఎలాంటి మానసిక వ్యధకు గురి చేసింది. అనిత మానసిక పరిస్థితి అదోలా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే లాక్‌డౌన్ సినిమా కథ.

దర్శకుడు ఏఆర్ జీనా రాసుకొన్న లాక్‌డౌన్ బ్యాక్ డ్రాప్ కథ చాలా విభిన్నమైనది. తెలియని తప్పుకు గర్బం తెచ్చుకొన్న యువతి పడిన కష్టాలను పాయింట్లుగా చేసుకొని రాసుకొన్న కథ అత్యంత ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే రొటీన్, రెగ్యులర్ పాయింట్స్ టచ్ చేయకుండా కేవలం స్క్రీన్ ప్లే ఆధారంగా, భావోద్వేగ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది. అనుపమ పరమేశ్వరన్ పాత్రను తీర్చి దిద్దిన విధానం, అలాగే సెకండాఫ్‌లో డ్రామాతో కథను నడిపించిన విధానం దర్శకుడి విజన్, ప్రతిభకు అద్దం పట్టింది.

అనితగా అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో నటించిందని చెప్పడం కంటే.. జీవించిందనే చెప్పాలి. బాధితురాలి, కుటుంబ పరువు ప్రతిష్టలు, సమాజం చూసే చూపు లాంటి అంశాలతో కడుపులో పెరిగే బిడ్డను మోసే పాత్రలో లీనమై నటించింది. సినిమా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లలో అనుపమ తన పెర్ఫార్మెన్స్ ఇరుగదీసింది. అవార్డు విన్నింగ్ నటనతో మెప్పించింది. తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. చార్లీ, నిరోషా మధ్య తరగతి తల్లిదండ్రులుగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

లాక్‌డౌన్ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు హైలెట్‌గా కనిపిస్తాయి. ఎన్ఆర్ రంగనాథన్, సిద్దార్థ్ విపిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాల్లో ఎమోషన్స్‌ను హై రేంజ్లో ఎలివేట్ చేశాయి. శక్తివేల్ సినిమాటోగ్రఫి బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్లు బాగున్నాయి. తెర మీద లాక్ డౌన్ మూడ్‌ను బాగా చూపించారు. ఇక సాబు జోసెఫ్ ఎడిటింగ్ ఈ సినిమాను గ్రిప్పింగ్‌గా, రేసీగా మార్చింది. ఇప్పటి వరకు సుభాస్కరన్, లైకా అంటే భారీ బడ్జెట్ చిత్రాలే గుర్తుకు వస్తాయి. కానీ లాక్ డౌన్ సినిమా భారీ కంటెంట్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్‌గా చిన్న సినిమాతో ముందుకు వచ్చారు. తక్కువ బడ్జెట్'తో ఫీల్ గుడ్ కంటెంట్‌తో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X