Lokah Chapter 1: Chandra Review: లోక చాప్టర్ 1: చంద్ర రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: కల్యాణి ప్రియదర్శన్, నెస్లేన్, సాండీ మాస్టర్, అరుణ్ కురియన్, విజయ రాఘవన్, టొవినో థామస్ (గెస్ట్), దుల్కర్ సల్మాన్ (గెస్ట్), సౌబిన్ షాహిర్ (గెస్ట్) తదితరులు

దర్శకత్వం: డొమినిక్ అరుణ్
నిర్మాత: దుల్కర్ సల్మాన్
సినిమాటోగ్రఫి: నిమిష్ రవి
ఎడిటింగ్: చామన్ ఛాకో
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
బ్యానర్: వేఫారర్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-08-28

కల్లియాన్‌కట్టు నీలీ అలియాస్ చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) అనే మిస్టరియస్ యువతి ఓ లక్ష్యాన్ని పెట్టుకొని బెంగళూరుకు చేరుకొంటుంది. బెంగళూరులో జరిగే అవయవాల వ్యాపారం జరిపే మాఫియాను వెంటాడుతూ ఉంటుంది. ఆ క్రమంలో సన్నీ (నస్లేన్)ను కలుసుకొంటుంది. బెంగళూరులోని మాఫియా, అక్కడి ఇన్స్‌పెక్టర్ నచియప్ప (శాండీ మాస్టర్), ఇతర పోలీసులు చంద్రను టార్గెట్ చేస్తారు. చంద్రకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మాఫియా కిడ్నాప్ చేస్తారు.

కల్లియాన్‌కట్టు నీలీ ఎందుకు చంద్రగా మారింది? చంద్రకు ఉన్న వ్యాధి ఏమిటి? నీలీ నుంచి చంద్రగా మారిన ఆమె గతం ఏమిటి? ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠాను ఎందుకు ఎదురించాలని భావించింది? సన్నీతో చంద్ర ప్రయాణం ఎలా సాగింది? బెంగళూరు పోలీసులు చంద్రను ఎందుకు టార్గెట్ చేశారు? మాఫియా చేతికి చంద్ర చిక్కిన తర్వాత చేతన్ (టొవినో థామస్) చేసిన మ్యాజిక్ ఏమిటి? యుద్ధ వీరుడి (దుల్కర్ సల్మాన్) పాత్ర ఎంట్రీ కథను ఎలా మలుపు తిప్పింది? కూలీ ఫేమ్ సౌబీన్ షాహిర్ స్పెషల్ ఎంట్రీ ఎలాంటి అనుభూతిని కలిగించింది? చివరకు చంద్ర తన లక్ష్యాన్ని నేరవేర్చుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే లోక సినిమా కథ.

Lokah Chapter1 Chandra Review

భారతీయ సినిమా పరిశ్రమలో సూపర్ హీరోలే కథలే చూశాం కానీ..సూపర్ హీరోయిన్ స్టోరీలు చాలా తక్కువగా వచ్చి ఉంటాయి. అయితే కల్లియాన్‌కట్టు నీలీ అనే గిరిజన యువతి అటవీ ప్రాంతపు వాసులకు దేవతగా ఎలా మారింది? అనంతరం సోషల్ లైఫ్‌లోకి అడుగుపెట్టి చంద్రగా ఎందుకు మారాల్సి వచ్చిందనే పాయింట్‌తో దర్శకుడు అరుణ్ రాసుకొన్న పాయింట్ బాగుంది. చాాలా సందర్భాల్లో కథలో క్లారిటీ మిస్ అవ్వడం చాలా కన్‌ఫ్యూజన్‌గా అవుతుంది. కానీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడానికి సౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ లాంటి అతిథి పాత్రలు కథలోకి జొప్పించి ఆడియెన్స్‌కు థ్రిల్ మూమెంట్స్ కల్పించాడు. అయితే పవర్‌ఫుల్‌గా హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసి కథను నడిపించిన తీరు బాగుంది. అయితే నీలి అనే అమ్మాయి చంద్రగా ఎందుకు మారిందనే విషయాన్ని వివరంగా చెప్పి ఉంటే.. ఇంకా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యి ఉండేది అనిపిస్తుంది.

నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కల్యాణి ప్రియదర్శన్‌ను ఇప్పటి వరకు చూసిన విధం వేరు... లోక (తెలుగులో కొత్త లోక) తర్వాత చూసే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. పవర్‌ఫుల్‌గా కనిపించడమే కాకుండా చాలా ఎమోషనల్‌గా ఫెర్ఫార్మ్ చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టింది. రక్త పిశాచిని పోలిన సూపర్ హీరోయిన్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఈ సినిమాకు వన్ ఉమెన్ షోగా మారింది. ఇక ఈ కథలో నస్లేన్ కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్‌గానే కనిపించినప్పటికీ.. సినిమాకు కావాల్సిన వినోదాన్ని అందించాడు. విలన్ షేడ్ పాత్రలో సాండీ మాస్టర్ అకట్టుకొంటాడు. సెకండాఫ్‌లో గెస్ట్ పాత్రల ఎంట్రీలతో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను మరింత క్రేజీగా మార్చారు. ఇతర పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

లోక సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. సినిమా కోసం వాడిన కలర్ టోన్ సన్నివేశాలను రిచ్‌గా మార్చాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉన్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాంటేజ్ సాంగ్ బాగుంది. నిర్మాతగా దుల్కర్ సల్మాన్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వేఫారర్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ ప్రమాణాలు క్లాస్‌గా ఉన్నాయి.

రక్త పిశాచాల బ్యాక్ డ్రాప్, సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్‌తో ఆర్గాన్ ట్రాఫికింగ్ అంశాలతో లోక్ చాప్టర్ 1: చంద్ర మూవీ ఓ డిఫరెంట్ వరల్డ్‌గా కనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకొన్న విభిన్నమైన కథ, పాత్రధారుల విలక్షణమైన నటన బాగున్నప్పటికీ.. కథ విషయంలో క్లారిటీ, కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సినిమా ఓ ఫ్రాంచైజీగా మారనున్న నేపథ్యంలో ముందు ముందు వచ్చే చాప్టర్స్‌లో బ్యాక్ గ్రౌండ్ కథను రివీల్ చేస్తారేమో అని సరిపెట్టుకోవాలి. ఓ డిఫరెంట్ మూవీని చూడాలనే వారికి లోక (కొత్త లోక) కచ్చితంగా డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా. వీలైతే థియేటర్‌‌లోనే ఎంజాయ్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X