For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  LOL Salaam Review: అందరూ కొత్త వాళ్లతోనే చేసిన సిరీస్ ఎలా ఉందంటే?

  |

  తారాగణం: కివిష్ కౌటిల్య, శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్ మరియు ఇతరులు
  దర్శకుడు: నాని బండ్రెడ్డి
  రేటింగ్: 2/5

  ప్రేక్షకులకు డిజిటల్ కంటెంట్ అలవాటైన తర్వాత ఈ మధ్య ఎక్కువగా వెబ్ సిరీస్ల మీద కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇది వరకు ఎక్కువగా వెబ్ సిరీస్ అంటే డబ్బింగ్ చేసినవి మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు నేరుగా తెలుగులో కూడా విభిన్న అంశాలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే కోవలో తెరకెక్కిన ఒక వెబ్ సిరీస్ ఈరోజు జీ5 వేదికగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.. కామెడీ సిరీస్ అంటూ ముందు నుంచి ప్రచారం చేసిన lol సలాం అనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంది ? ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది సమీక్ష లో తెలుసుకుందాం

  కధేమిటంటే

  కధేమిటంటే

  రెడ్డి, నాయుడు, వర్మ, జాన్, ఖాన్ ఇలా ఐదుగురు 5 విభిన్న ప్రాంతాలకు చెందిన వారు ఒకే రూమ్ లో కలిసి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వేధిస్తూ ఉంటుంది. ఆ సమస్యల వలన ఒత్తిడికి లోనై ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దామనుకుని భావించి వీరంతా కలిసి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నుంచి బొగాతా వాటర్ ఫాల్స్ కి వెళ్లాలని భావిస్తారు. వెళ్లే దారిలో అనేక అడ్డంకులు ఎదురవగా ఎలాగొలా చివరికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో రెడ్డి అనుకోకుండా నక్సల్స్ పెట్టిన ఒక ల్యాండ్ మైన్ మీద కాలు వేస్తాడు. దీంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది, రెడ్డి ల్యాండ్ మైన్ మీద నుంచి కాలు తీశాడా ? రెడ్డి ల్యాండ్ మైన్ మీద కాలు వేస్తే స్నేహితులు ఏం చేశారు, అనే పాయింట్ చుట్టూ ఈ కథను అల్లుకున్నారు. అయితే ఇందులో మంత్రిగా నటించిన హర్షవర్ధన్ కు అడవిలో చిక్కుకున్న కుర్రవాళ్ళకు, ఆయనకు లింకేమిటి అనే విషయాలు మాత్రం సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే

  కథలో ట్విస్టులు

  కథలో ట్విస్టులు

  కథలో ఏ మాత్రం ట్విస్టులు లేకుండా ఉండడమే పెద్ద ట్విస్ట్ అనుకున్నట్టు ఉన్నాడు దర్శకుడు, ఎలాంటి సస్పెన్స్ లేకుండా కథలోకి తీసుకువెళ్ళి చాలా విసుగు తెప్పించాడు అని మాత్రం చెప్పవచ్చు. ఇండిపెండెంట్ ఫిలిం లాగా గంట, గంటన్నరలో చేసే సినిమాలను సాగదీసి వెబ్ సిరీస్ పేరుతో రిలీజ్ చేస్తున్నారన్న భావన ఈ సిరీస్ చూశాక మాత్రం కలుగక మానదు. మంత్రి అడవిని తగలబెట్టాలని అనుకోవడం, అందులో ఉన్న గూడెం ప్రజలు మొత్తం ఆపదలో పడటం, అనుకోకుండా అడవికి వెళ్ళిన స్నేహితులు వల్ల వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అనే పాయింట్ మీద దర్శకుడు కథ రాసుకున్నాడు. అయితే పెద్దగా సస్పెన్స్ కానీ, ఎలాంటి ట్విస్టులు లాంటివి మాత్రం ఈ సిరీస్లో ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. కామెడీ సిరీస్ అని ప్రచారం జరిగిన ఈ సిరీస్ లో అది కూడా మరీ అంతగా ఏమీ లేదు.

   దర్శకత్వం విషయానికి వస్తే

  దర్శకత్వం విషయానికి వస్తే

  తానే రచించి, వెబ్ సిరీస్ గా రూపొందించిన నాని బండ్రెడ్డి ఈ కామెడీ సిరీస్ కి కాస్త పొలిటికల్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అమృతం సీరియల్ ఫేమ్ హర్షవర్ధన్ ఒక మంత్రిగా కనిపించగా ఆయన ఒక అడవి మొత్తాన్ని ఒక కార్పొరేట్ కంపెనీకి దారాదత్తం చేయడానికి దాన్ని మొత్తం తగలబెట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే లైన్ గా అనుకున్నప్పుడు బాగానే ఉన్నా ఈ కంటెంట్ 6 ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేటప్పటికి కాస్త సాగదీసిన ఫీలింగ్ కనిపిస్తుంది. కామెడీ పుట్టించాలంటే ప్రయత్నించినా ఏ మాత్రం కామెడీ పండలేదు.

  నటీనటుల విషయానికి వస్తే

  నటీనటుల విషయానికి వస్తే

  రెడ్డి అనే పాత్రలో నటించిన కౌటిల్య నటన ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే దర్శకుడు నటనను రాబట్టుకోవడంలో కూడా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఇక మిగతా పాత్రల్లో నటించిన శ్రీనివాసరెడ్డి, భరద్వాజ్, పవన్ కుమార్, రోహిత్ కృష్ణ వర్మ వీళ్లంతా సిరీస్ ను ముందుకు నడిపించడానికి తమ వంతు ప్రయత్నం తాము చేశారు. అయితే హర్షవర్ధన్ లాంటి ఒకరిద్దరు తప్ప అందరూ కొత్త ముఖాలే. ఇక హర్ష వర్ధన్ క్రూయల్ పొలిటీషియన్ గా తనదైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సిరీస్ మొత్తం మీద కనబడిన మూడే మూడు లేడీ పాత్రలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు.

   టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే

  టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే

  ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ సిరీస్ ఆద్యంతం లో బడ్జెట్లో పూర్తి చేయడానికి ప్రయత్నించడంతో టెక్నికల్ పరంగా కూడా సిరీస్ ఆకట్టుకోలేక పోయింది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కెమెరా సినిమాటోగ్రాఫర్ రాకేష్ నారాయణ నైట్ సీన్స్ లో కాస్త ని ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ మొత్తం మీద గందరగోళ పరిస్థితి ఏర్పడి టెక్నికల్ విషయాల్లో కూడా కనిపించలేదు అని చెప్పాలి.

  Jagame Thandhiram Review, Dhanush's Kabali, హైప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ || Filmibeat Telugu
   ఫైనల్ గా ఈ విషయం ఏమిటంటే

  ఫైనల్ గా ఈ విషయం ఏమిటంటే

  ఈ సిరీస్ మొత్తం కామెడీగా కనిపిస్తూనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. కానీ ఎక్కడా కామెడీగా అనిపించకపోవడం సిరీస్ కి పెద్ద మైనస్. అలాగే అసలు ఏమాత్రం లాజిక్ లేని సీన్స్ తో విసిగిస్తుంది ఈ సిరీస్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్ ని జీఫైవ్ సంస్థ ఎలా కొనుగోలు చేసింది అనేదే. ఒక మనిషి ల్యాండ్ మైండ్ మీద కాలు పెట్టి పోయే పరిస్థితుల్లో ఉంటే దాని చుట్టూ కథ నడపడం అనేది చాలా సినిమాల్లో చూశాం కానీ ఈ సిరీస్ మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది అని చెప్పక తప్పదు.

  English summary
  'LOL Salaam', a Telugu web series, is now streaming on ZEE5. Here we tell you in our review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X