Love Guru Review సిస్టర్ సెంటిమెంట్‌తో విజయ్ ఆంటోని.. లవ్ గురు మూవీ సమీక్ష

Rating: 2.5/5

నటీనటులు: విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు
రచన దర్శకత్వం: వినాయక్ వైద్యనాథన్
సినిమాటోగ్రఫీ: ఫరూక్ జే బాష
మ్యూజిక్: భరత్ ధనశేఖర్
ఎడిటింగ్, నిర్మాత: విజయ్ ఆంటోనీ
బ్యానర్: విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
సమర్పణ: మీరా విజయ్ ఆంటోనీ
రిలీజ్ డేట్: 2024-04-11

మలేషియాలో ఓ కంపెనీలో బాస్‌గా పనిచేసే అరవింద్ (విజయ్ ఆంటోని) తన లైఫ్‌లో తాను అమితంగా ప్రేమించిన వ్యక్తికి దూరమవుతాడు. ఆ బాధ అతడిని వెంటాడుతుంటుంది. తన జీవితంలో ప్రేమ కరువు కావడంతో వయసు మీద పడినా పెళ్లికి దూరంగా ఉంటాడు. అలాంటి సమయంలో తన బంధువుల అమ్మాయి లీల (మ‌‌ృణాళిని రవి) ఆమెకు ఇష్టంగా లేకుండా పెళ్లి చేసుకొంటాడు. దాంతో అరవింద్‌ను లీల దూరం పెడుతుంది.

తన జీవితంలో ఇష్టమైన వ్యక్తిని అరవింద్‌ ఎలా కోల్పోయాడు? ఆ సంఘటన అతడిపై ఎలాంటి ప్రభావం చూపించింది. లీలను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకొన్నాడు? సినీ యాక్టర్ కావాలనుకొన్న లీలకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు అడ్డుగా నిలిచాయి? లీలను హీరోయిన్‌గా చేసేందుకు అరవింద్ నిర్మాతగా, హీరోగా ఎందుకు మారాడు? లీల ప్రేమను గెలుచుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏ మేరకు సఫలమయ్యాయి? చివరకు లీల తన భర్తకు చేరువైందా? అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ గురు సినిమా కథ.

Love Guru Movie Review in Telugu  Vijay Antony all Rounder performance

అరవింద్‌ను ఓ పీడకల వెంటాడటం ద్వారా ఓ ఎమోషనల్ పాయింట్‌తో మూవీ కథ మొదలవుతుంది. లీలను మొదటి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. వారి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటమనే కథలో ఓ సమస్యగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే తన అభిప్రాయాలు, మనోభావాలు, జీవితలక్ష్యాలకు వ్యతిరేకంగా పెళ్లి చేయడాన్ని లీల జీర్ణించుకోలేకపోతుంది. ఆ కారణాల వల్ల భర్త అరవింద్‌ను దూరం పెట్టడంతో ఆమె ప్రేమను పొందడానికి మొబైల్ ఫోన్‌లో వేరే గొంతుతో మాట్లాడుతూ ఓ నాటకం ఆడటం కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌లో కామెడీ సన్నివేశాలు బాగా పండాయి.

ఇక సెకండాఫ్‌లో లీలను హీరోయిన్‌గా చేయడానికి స్వయంగా నిర్మాతగా, హీరోగా మారడంతో కథంతా మూవీ షూటింగ్ మధ్య నడుస్తుంది. కానీ సినిమా ద్వితీయార్థం చాలా ఫ్లాట్‌గా సాగిపోతుంది. ఫ్యామిలీ డ్రామా ఎక్కువ కావడంతో కథకు కనెక్ట్ కాలేకపోతాం. సెకండాఫ్ పేలవమైన సీన్లతో రొటీన్‌గా కంటెంట్‌తో సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక విజయ్ ఆంటోని రెగ్యులర్‌గా అనుసరించే సిస్టర్ సెంటిమెంట్‌తో ముగుస్తుంది.

విజయ్ ఆంటోని, మృణాళిని రవి తమ పాత్రల్లో ఓదిగిపోయారు. ఫన్, ఎమోషన్స్, సెంటిమెంట్ ఫ్లేవర్‌తో ఉండే పాత్రలను తమ ప్రతిభతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం అంతా ఊహించినట్టే ఉండటం వల్ల వారిద్దరూ కూడా గొప్ప ఫీలింగ్‌ను, అనుభూతిని పంచడంలో తడబాటు పడ్డారు. యోగిబాబు, వీటీవీ గణేష్ కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్. వారిద్దరూ తమ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలీవరితో ఆకట్టుకొన్నారు. ఇలవరసు, తలైవసల్ విజయ్, మిగితా పాత్రల్లో నటించే వారు ఒకే అనిపించారు.

Love Guru Movie Review in Telugu  Vijay Antony all Rounder performance

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్స్. భరత్ ధనశేఖర్ అందించిన బీజీఎం కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు విజయ్ ఆంటోని ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. సెకండాఫ్‌లో కొంత నిడివి తగ్గిస్తే ఇంకా బెటర్ ఫీల్ ఉండేది. వినాయక్ వితైనాథన్ పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ అనుసరించే నిర్మాణ విలువలు బాగున్నాయి.

Love Guru Movie Review in Telugu  Vijay Antony all Rounder performance

లవ్ గురు సినిమా విషయానికి వస్తే.. ఇష్టపడి పెళ్లి చేసుకొన్న భార్య దూరంగా పెడితే భర్త పడే మానసిక వేదన, ఆమె ప్రేమను గెలుచుకోవడానికి హీరోచేసిన ప్రయత్నాలు ప్రధాన పాయింట్‌గా సిస్టర్ సెంటిమెంట్ జోడించి నిర్మించిన చిత్రం లవ్ గురు. ఈ సినిమా చూసినంత సేపు షారుక్ ఖాన్, అనుష్కశర్మ నటించిన రబ్ దే బనా దియా జోడి అనే సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా స్పూర్తి పొంది తీసినట్టు అనిపిస్తుంది. కానీ సిస్టర్ సెంటిమెంట్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కథ పాతదే.. బ్యాక్ డ్రాప్ కొత్తది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X