Love Insurance Kompany Movie Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి, ఎస్‌జే సూర్య, యోగి బాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక, ఆనంద రాజ్ తదితరులు
దర్శకత్వం: విఘ్నేష్ శివన్
నిర్మాత: నయనతార
బ్యానర్: రౌడీ పిక్చర్స్
సమర్పణ: విక్కీ ఒరిజినల్, లలిత్ కుమార్
సహ నిర్మాత: ఎల్‌కే విష్ణు కుమార్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫి: రవి వర్మన్
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
ప్రొడక్షన్ డిజైనర్‌: టీ ముతురాజ్
రిలీజ్ డేట్: 2026-04-10

ప్రేమ పేరుతో మోసపోయే వారికి పరిహారం ఇప్పించాలనే లక్ష్యంతో సూర్య (ఎస్‌జే సూర్య) యాప్ ఆధారితంగా నడిచే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) ని స్థాపిస్తాడు. యువతీ, యువకులు నుంచి ఆదరణ లభించడంతో దేశవ్యాప్తంగా LIK యాప్‌ టాప్ రేంజ్‌లో దూసుకెళ్తుంది. మొబైల్ ప్రపంచానికి దూరంగా ఆర్గానిక్ వరల్డ్‌లో జీవించే వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్) ఆ యాప్‌కు జాకీగా వ్యవహరిస్తాడు. ఆయన చెప్పే మాటలకు ధీమా (కృతిశెట్టి)తోపాటు అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. ఓ సినిమాటిక్ సన్నివేశంలో వాసు, ధీమా తొలి చూపులోనే ప్రేమించుకొంటారు. ధీమా కోసం తొలిసారి మొబైల్ కొనుక్కొని LIK యాప్‌లో రిజిస్టర్ చేసుకొని లవ్ ట్రాక్ నడిపిస్తారు. అయితే సూర్య ప్రవేశపెట్టిన లవ్ టెస్ట్‌లో ధీమా, వాసు ఫెయిల్ అవుతారు. అయితే తన నిజమైన ప్రేమను యాప్ గుర్తించే శక్తి లేదు అంటూ సూర్యకు వాసు సవాల్ విసురుతాడు.

2040 సంవత్సరంలో సాగే కథలో ఆర్గానిక్ వరల్డ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆర్గానిక్ వరల్డ్‌లో మొబైల్ ఫోన్ ఎందుకు ఉపయోగించకూడదనే నిబంధన ఉంది? తండ్రి మాటను జవదాటని వాసు మొబైల్ ఫోన్ ఎందుకు ఉపయోగించకూడదని అనుకొంటాడు? సూర్య స్థాపించిన LIK సంస్థలో వాసు ఉద్యోగం ఎలా నడించింది? తండ్రి నిర్ణయాలకు వ్యతిరేకంగా మొబైల్‌ను వాడటం వాసు ఎందుకు చేశాడు? LIK పెట్టిన లవ్ టెస్ట్‌లో ఫెయిల్ అయితే ధీమా ఎందుకు బ్రేకప్ చెప్పింది? ధీమాకు తన ప్రేమ స్వచ్ఛమైనదని వాసు చెప్పే ప్రయత్నాన్ని ధీమా ఎందుకు అర్ధం చేసుకోలేకపోయింది? సూర్య నడిపే యాప్ డేటా అంతా తప్పు అని వాసు నిరూపించాడా? ధీమా ప్రేమను వాసు ఎలా గెలుచుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే LIK సినిమా కథ.

Love Insurance Kompany Movie Review

మొబైల్ ఫోన్ వాడకం ద్వారా యువత ఎలా తమ జీవితాన్ని నాశనం చేసుకొంటున్నారు, సెల్ఫీలు, రీల్స్, చాటింగ్ పేరుతో బంగారు భవిష్యత్తును కాలరాస్తున్నారు అనే పాయింట్‌తో ఫ్యూచరిస్టిక్ ఐడియాతో 2040 సాగే కథను దర్శకుడు విఘ్నేష్ శివన్ రాసుకొన్న విధానం, పాత్రలను డిజైన్ చేసుకొన్న తీరు, కథకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించిన విజన్‌ను తప్పు పట్టడానికి ఒక శాతం కూడా ఛాన్స్ కనిపించదు. యూత్‌ను టార్గెట్ చేసి యాప్‌లు చేస్తున్న జీవన విధ్వంసంపై సెటైర్లు విసిరిన తీరు బాగుంది. సూర్య పాత్ర చుట్టూ రాసుకొన్న సన్నివేశాలు, ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి లవ్ ట్రాక్‌ను నడిపిన విధానం హైలెట్‌గా ఉంది.

తొలి భాగంలో పాత్ర, కాన్సెప్ట్ పరిచయం చకచకా చేసి కథలో కి తీసుకెళ్లి ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. సూర్య, ప్రదీప్, కృతి పాత్రల పరిచయం సన్నివేశాలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. సెకండాఫ్‌లో ఆర్గానిక్ వరల్డ్ నేపథ్యంగా సాగే ఎపిసోడ్ కొంత సాగదీసినట్టు ఉండటమే కాకుండా బోర్‌గా అనిపిస్తాయి. హీరో, విలన్ ఛాలెంజ్ చేసి కాన్సెప్ట్ రొటీన్‌గా ఉంటుంది. కానీ ఫస్టాఫ్‌లో ప్రదీప్ సిస్టర్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ సోషల్ మెసెజ్‌తో సాగడం మూవీకి ఫీల్ గుడ్ అంశాలుగా మారాయని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో రోబోలతో ఫైట్, ప్రీ క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని అందించాయి.

ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్‌జే సూర్య మూల స్తంభాలుగా నిలిచారు. సూర్య వన్ మ్యాన్ షోత సినిమాలోని సన్నివేశాలను పరుగులు పెట్టించారు. ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన యాక్టింగ్‌, స్క్రీన్ ప్రజెన్స్‌తో మ్యాజిక్ చేశాడు. కొద్దికాలంగా వరుస వైఫల్యాలను చవిచూస్తున్న కృతిశెట్టికి గ్లామర్‌తోపాటు యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రను పూర్తిగా ఉపయోగించుకొని కమ్ బ్యాక్ నటనను చూపించారు. యోగిబాబు, ఇతర నటీనటులు కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాల్లో తన వంతు సహకారం అందించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సీన్లలో కేక పెట్టించాడు. రవివర్మన్ ఫోటోగ్రఫి, ఫ్యూచర్ వరల్డ్‌ను సృష్టించిన విధానం బాగుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ వర్క్ హైలెట్‌గా అనిపిస్తాయి. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ మరో ప్లస్ పాయింట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై హీరోయిన్ నయనతార అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

మొబైల్ ఫోన్లు చేస్తున్న జీవన విధ్వంసాన్ని కథగా రూపొందించిన లవ్, రొమాంటిక్, ఫూచరిస్టిక్ సినిమా. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ కొడుకు డైరెక్టర్‌గా అల్లు అర్జున్ సినిమా అంటూ.. చిరంజీవి మనవడు హీరోగా సినిమా అంటూ కొన్ని రెఫరెన్స్‌లు తెలుగు ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంటాయి. సోషల్ మీడియాలో వాడే భాషను డైలాగ్స్‌గా మలిచిన విధానం యూత్‌ఫుల్‌గా ఉన్నాయి. మొబైల్ ఫోన్ల వాడకాన్ని వ్యతిరేకించే వారు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యాప్‌లను వాడే యూత్‌కు ఈ సినిమా నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రొడక్షన్ పరంగా రిచ్, క్లాస్, డీసెంట్ మేకింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఫన్‌తో సాగే ఈ సినిమాను చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో ఈ మూవీని చేర్చుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X