Love Insurance Kompany Movie Twitter Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ట్విట్టర్ రివ్యూ

ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఏప్రిల్ 9న అమెరికాలో ఈ సినిమాకు ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే..

Love Insurance Kompany Movie Twitter Review in Telugu  Is Pradeep Ranganathans Movie hits the bulls eye

ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్, నేపథ్యంతో కూడిన ఫ్యూచర్ రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. ఇది దీని ఎగ్జిక్యూషన్ ఆశించినంత గొప్పగా లేదు. ఈ సినిమాలో చెప్పుకోదగిన విషయం మాత్రం.. భవిష్యత్ ప్రపంచాన్ని తీర్చిదిద్దిన విధానం. కొన్నిసార్లు ఇది వింతగా ఉన్నప్పటికీ.. ఫస్టాఫ్‌లో కొంత వినోదాన్ని పంచుతుంది. నేపథ్యం ఆసక్తికరంగా ఉండి.. ఎంగేజింగ్‌కి మంచి స్కోప్ ఉన్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు.

సెకండాఫ్‌ బలహీనంగా ఉంది. సినిమా అక్కడక్కడే తిరుగుతూ కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ప్రదీప్, ఎస్‌జే సూర్యల మధ్య సాగే సన్నివేశాలు పండినా.. ఈ సినిమాను లాక్కురావడానికి అవి ఏ మాత్రం సరిపోవు. అయితే నిర్మాణ విలువలు మాత్రం అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అక్కడక్కడా సరదాగా సాగినా.. మొత్తంగా ఆశించిన స్థాయిలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదు. దీనికి నా రేటింగ్ 2.25/5 అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

విఘ్నేష్ శివన్ డిఫరెంట్ అటెంప్ట్‌తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. 10, 20 ఏళ్ల ముందు భవిష్యత్తుని ఊహించి అద్భుతంగా స్టోరీ రాసుకున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అదిరిపోయింది. కొన్ని గ్రాఫిక్స్ తప్పితే టెక్నికల్‌గా ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉంది. డీవోపీకి పాజిటివ్ మార్క్స్ ఇవ్వొచ్చు. ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. కామెడీ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. ప్రదీప్‌కి ఎస్‌జే సూర్య, యోగి బాబుల నుంచి చక్కటి సహకారం లభించింది. అయితే బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ కష్టమే.. అయితే మల్టీప్లెక్స్‌లలో మాత్రం మంచి రెస్పాన్స్ రావొచ్చు. లవ్ ఇన్సూరెన్స్ మూవీకి నా రేటింగ్ 2.75/5 అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

భవిష్యత్‌లో చెన్నై ఎలా ఉంటుందనే నేపథ్యంలో వినూత్నమైన సినిమాను అందించాలనే పట్టుదల ప్రశంసనీయం. సినిమా అంతటా గాడ్జెట్స్, ఫ్యాషన్ సెలక్షన్ బాగుంది. యాప్ వర్సెస్ హార్ట్ అనే ఆలోచన ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించింది. అయితే సెకండాఫ్‌ మాత్రం చిరాకుగా, నిస్సారంగా అనిపిస్తుంది. అనిరుధ్, ఎస్‌జే సూర్య, ప్రదీప్‌లు తమ భుజాలపై మోయడానికి ప్రయత్నించినా పట్టు చిక్కలేదు. కృతిశెట్టి చాలా అందంగా ఉంది. చూడదగ్గ సినిమా అంటూ ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచి కాన్సెప్ట్ కానీ విఘ్నేష్ శివన్ ఎగ్జిక్యూషన్ సరిగా లేదు. చాలా సన్నివేశాలు వాస్తవానికి సంబంధం లేనట్లుగా అనిపిస్తాయి. యాప్ వర్సెస్ హార్ట్ కన్‌ఫ్లిక్ట్‌తో కూడిన ఇంటర్వెల్ దీనికి మంచి ఉదాహరణ. ఇది ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా నవ్వించడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ చాలా హాస్య సన్నివేశాలు పండలేదు. ముఖ్యంగా శ్రీమాన్ పాత్రతో తండ్రి సెంటిమెంట్‌కు సంబంధించిన సీన్స్ వర్కవుట్ కాలేదు.

గతంలో తన హై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీసిన ప్రదీప్.. ఇక్కడ మాత్రం నిరాశగా కనిపిస్తున్నాడు. అభిమానులు ఆశించిన రేంజ్‌లో ప్రదీప్ ఆకట్టుకోలేదు. ప్రదీప్, ఎస్‌జే సూర్యలను విఘ్నేష్ శివన్ సరిగా ఉపయోగించుకోలేదు. ఈ సినిమాకు సానుకూల అంశం ఏదైనా ఉందంటే అది అనిరుధ్ సంగీతం మాత్రమే. కృతిశెట్టి తన అద్భుతమైన నటనతో బలమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా అంతటా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది అని ఓ ట్విట్టర్ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X