Love Insurance Kompany First Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఫస్ట్ రివ్యూ

యువ హీరో, హీరోయిన్లు ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ( Love Insurance Kompany - LIK). ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విక్కీ ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమాను లలిత్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ నయనతార నిర్మాతగా, ఎల్‌కే విష్ణు కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యోగిబాబు, శ్రీమాన్, గౌరీ కిషన్, మాళవిక తదితరులు నటించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫిని, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్‌గా, టీ ముతురాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకొన్నది. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఏమిటి? ఈ చిత్రంపై ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Love Insurance Kompany First Review

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కథ విషయానికి వస్తే.. మొబైల్ టెక్నాలజీతో టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన ప్రేమ కథ. 2040 సంవత్సరంలో సాగే లవ్ స్టోరి. ఆ సమయంలో కూడా లవ్ ఎట్ ఫస్ట్‌ సైట్ కాన్సెప్ట్‌లో ప్రేమలో పడ్డ (ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి)కి ప్రేమకు సూర్య (ఎస్‌జే సూర్య) అడ్డంకిగా మారుతాడు. తన ప్రేమకు ఎదురైన అడ్డంకులు, ఛాలెంజ్‌లను అధిగమించి తన ప్రేమికురాలిని తన జీవిత భాగస్వామిగా చేసుకొన్నాడా? సూర్య స్థాపించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కండీషన్లు ఏమిటి? ఆ కంపెనీ పెట్టిన రూల్స్‌ ఏ విధంగా ఉన్నాయి? బ్రేకప్ సెటిల్మెంట్స్ ఎలా సాగాయి అనే కోణంలో వినోదభరితంగా ఈ సినిమా సాగుతుంది.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. అయితే ఈ సినిమా విషయంలో పెద్దగా అభ్యంతరాలు చెప్పకుండా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేముందు సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో కొన్ని సలహాలు, కొన్ని సూచనలు చేశారు. వారి ఓపినియన్స్ పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేశాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

LIK సినిమా కంటెంట్‌పై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన సెన్సార్ అధికారులు ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని 13 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని తమ నిబందనల్లో స్పష్టం చేశారు.

ఈ చిత్రం కంటెంట్ డిమాండ్ చేయడం, పాత్రలను డిజైన్ చేసిన విధానంతో సన్నివేశాలు పెరగడం జరిగింది. దాంతో ఈ సినిమా నిడివి కొంత ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమా నిడివిని 2 గంటల 36 నిమిషాలు అంటే.. సుమారుగా 156 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అనే విషయం సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా స్పష్టమైంది.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చాలాసార్లు రిలీజ్ వాయిదా పడటం వల్ల ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గి బజ్ పెద్దగా కనిపించడం లేదు. విఘ్నేష్ శివన్ చాలా కాలంగా సరైన హిట్ లేకపోవడంతో అంతగా అంచనాలు లేకపోయాయి. అలాగే వరుస ఫెయిల్యూర్స్ సతమతమవుతున్న కృతిశెట్టి ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకొన్నారు. ఇక ప్రదీప్ రంగనాథన్ వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆయనపై విజయ భారం మోపి ఉన్నారు. ఎస్ జే సూర్య క్యారెక్టర్ గురించి సెన్సార్ అధికారులు పాజిటివ్‌గా స్పందించినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X