twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవ్, లైఫ్ అండ్ పకోడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating: 2.5/5
    నటీనటులు: సంచితా పూనంచా, కార్తీక్ బీమల్ రెబ్బా, కళాజ్యోతి, హెబ్బాలే కృష్ణ, ఆకర్ష్ రాజ్ భగవతుల తదితరులు
    రచన, నిర్మాత, దర్శకత్వం: జయంత్ గాలి
    సమర్పణ: మధురు శ్రీధర్ రెడ్డి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి
    మ్యూజిక్: పవన్
    సినిమాటోగ్రఫి: జితిన్ మోహన్, సాగర్ జీవి
    ఎడిటింగ్: శశిధర్ చావలి, శ్రవణ్ కటికనేని
    బ్యానర్: కలర్ ఆఫ్ మై లైఫ్ ఫిల్మ్స్
    రిలీజ్ డేట్: 2021-03-12

    లవ్, లైఫ్ అండ్ పకోడి కథ

    లవ్, లైఫ్ అండ్ పకోడి కథ

    చిన్నతనం నుంచి వరుస బ్రేకప్స్‌కు గురైన అరుణ్ (కార్తీక్ బీమల్ రెబ్బా) మరోసారి రియా (సంచితా పూనంచా)తో రిలేషన్‌షిప్ పెట్టుకొంటాడు. పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకొని వారిద్దరూ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఓ దశలో పెళ్లి చేసుకొమని అరుణ్ ప్రపోజ్ చేస్తే నిర్మొహమాటంగా రియా తిరస్కరిస్తుంది.

     మూవీలో ట్విస్టులు

    మూవీలో ట్విస్టులు

    అరుణ్‌కు వరుస బ్రేకప్స్ ఎందుకు జరిగాయి? అరుణ్ తన తండ్రికి ఎందుకు దూరంగా ఉంటాడు? సహజీవనంలో వారికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అరుణ్ పెళ్లి ప్రపోజల్‌ను రియా ఎందుకు తిరస్కరించింది? రియా తల్లికి జీవితంలో చేదు అనుభవం ఎమిటి? చివరకు రియా, అరుణ్ మధ్య రిలేషన్‌షిప్‌కు క్లైమాక్స్ ఏమిటి? ఈ ప్రేమ కథలో పకోడి ప్రాధాన్యత ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే లవ్, లైఫ్ అండ్ పకోడి సినిమా కథ.

     ఫస్టాఫ్ ఎలా ఉంటుందంటే

    ఫస్టాఫ్ ఎలా ఉంటుందంటే

    లవ్, లైఫ్ అండ్ పకోడి ఫస్టాఫ్ విషయానికి వస్తే నేటి తరం అబ్బాయిలు, అమ్మాయిలు ఆలోచన తీరు, జీవించే విధానంతో కథ సాగుతుంది. పబ్ కల్చర్, డ్రగ్స్, మద్యంతో యువత జీవించే తీరును కళ్లకు దర్శకుడు కట్టినట్టు చూపించాడు. అయితే ఫీల్‌గుడ్ అంశాలు లేకుండా ఒకే మూసలో కథ సాగడం కాస్త బోర్‌గా అనిపిస్తుంది.

    సెకండాఫ్‌లో భావోద్వేగంతో

    సెకండాఫ్‌లో భావోద్వేగంతో

    ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి లవ్, లైఫ్ అండ్ పకోడి కథ వేగం పుంజుకొంటుంది. సరికొత్త పాయింట్స్‌తో ఆలోచించే విధంగా కథను దర్శకుడు నడిపించడం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. ప్రీ క్లైమాక్స్‌కు ముందు ఇచ్చే ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతుంది. చివర్లలో మంచి జస్టిఫికేషన్‌తో కథను ముగించడంతో సినిమా ఫీల్‌గుడ్‌ నోట్‌తో ఎండ్ అవుతుంది.

    దర్శకుడి పనితీరు

    దర్శకుడి పనితీరు

    దర్శకుడు జయంత్ గాలి రాసుకొన్న కథ, కథనాల్లో డీటెయిలిటీ ఎక్కువగా ఉండటంతో సినిమా స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. ఓ బలమైన పాయింట్ చెప్పడానికి కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. కాకపోతే రియా తల్లి సమస్యను, తన తండ్రికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అరుణ్ చెప్పిన పాయింట్‌తో అసలు కథను ప్రారంభించి భావోద్వేగానికి గురిచేస్తాడు. చివర్లలో రియా, అరుణ్ ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్‌ను డీల్ చేసిన విధానం బాగుంటుంది. అంతా కొత్తవారైనప్పటికీ.. వారి నుంచి ఫెర్ఫార్మెన్స్‌ను రాబట్టిన తీరుకు అభినందించాల్సిందే.

    నటీనటుల పెర్ఫార్మెన్స్

    నటీనటుల పెర్ఫార్మెన్స్

    ఆధునిక పోకడలతో జీవితం సాగించే యువతీ, యువకులకు ప్రతీకగా రియా, అరుణ్ పాత్రలు కనిపిస్తాయి. రియా పాత్రలో సంచితా చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు వచ్చే సీన్లలో రియా అదరగొట్టేసింది. ఇక అరుణ్‌గా కార్తీక్ కూడా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. కీలక సన్నివేశాల్లో మెచ్యురిటీ ప్రదర్శించాడు. మిగితా పాత్రల్లో నటీనటులు ఫర్వాలేదనిపించారు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    లవ్, లైఫ్ అండ్ పకోడి సింపుల్ పాయింట్‌తో తెరకెక్కిన పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. నేటి యువత అనుసరిస్తున్న సంబంధాలను చెప్పే న్యూఏజ్ సినిమా. సమాజంలో పెళ్లికి ముందే శారీరక సంబంధాలు పెట్టుకొంటూ లైఫ్‌ను లీడ్ చేస్తున్న సంఘటనల్లో పుట్టిన కథ అని చెప్పవచ్చు. రియా, అరుణ్ రిలేషన్స్, పబ్బులు, మద్యం, సెక్స్ అనే అంశాలతో వారు తమ జీవితాన్ని కొనసాగించిన తీరు నేటి సమాజంలోని యువత పోకడలకు అద్దం పడుతుంది. కలిసి జీవించడానికి పెళ్లి అనేది అవసరమా అంశంపై చర్చకు దారి తీసేలా ఈ చిత్రాన్ని దర్శకుడు జయంత్ గాలి చక్కగా తెరకెక్కించారు. యూత్‌‌ఫుల్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలను ఇష్టపడేవారికి లవ్, లైఫ్ అండ్ పకోడి తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే చాలా ఓపికగా సినిమాను చూడాల్సి ఉంటుంది.

    English summary
    Love, Life and Pakodi movie review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X