Love Marriage First Review: లవ్ మ్యారేజ్ మూవీ ఫస్ట్ రివ్యూ
తమిళ సినిమా పరిశ్రమలో నిర్మాణ సంస్థలు అస్యూర్ ఫిల్మ్స్, రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యువ దర్శకుడు షణ్ముగ ప్రియన్ తొలిసారి దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం లవ్ మ్యారేజ్. డాక్టర్ శ్వేతా శ్రీ, శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ ప్రభు, మలయాళ యువ హీరోయిన్, డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ ఫేమ్ సుస్మితా భట్ జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఫ్యామిలీ, కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించి సెన్సార్ అప్ డేట్స్ వివరాల్లోకి వెళితే..
తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మీనాక్షి దినేష్, రమేష్ తిలక్, గజరాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటింగ్, సీన్ రోల్డాన్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా శక్తి ఫిలింస్ ద్వారా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను సెన్సార్ అధికారులు వీక్షించారు.

వయసు మీద పడి పెళ్లి కాని ప్రసాదులో మారిన రామచంద్రన్ అలియాస్ రామ్ అనే యువకుడి కథ. మూడు పదుల వయసుపై బడినా రామ్‌కు పెళ్లి కాకపోవడంతో సమాజం ప్రభావం, ఒత్తిడి ఆయనపై పడుతుంది. అలాంటి సరైన వధువుకు కోసం రామ్ వెతకడం.. ఆయనను ఏద కారణం చెప్పి అమ్మాయిలు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి పెళ్లి చేసుకొన్నాడు? సంఘం నుంచి ఆయనకు ఎలాంటి ఒత్తిడి ఎదురైందనే ప్రశ్నలకు సమాధానంగా లవ్ మ్యారేజ్ సినిమాను తెరకెక్కించారు.
లవ్ మ్యారేజ్ సినిమా మంచి సామాజిక సందేశం, పెళ్లి విషయంలో సమాజం కట్టుబాట్ల వలన తలెత్తే సమస్యను అధారంగా చేసుకొని సున్నితమైన హాస్యంతో ఈ సినిమాను రూపొందించడంపై సెన్సార్ అధికారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక క్లిష్టమైన అంశానికి కామెడీ జోడించి, ఎమోషన్స్ పడించిన తీరు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందనే టాక్ సెన్సార్ అనంతరం సినీ వర్గాల్లో వినిపించింది.
లవ్ మ్యారేజ్ సినిమాకు నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితీరు బలంగా నిలిచింది. కోలీవుడ్‌లో తనకటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న విక్రమ్ ప్రభు స్టాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. నోటా, ఎనిమీ, నీతమ్ ఓరు వనమ్ సినిమాలకు కో డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా పనిచేసిన షణ్ముగం తన తొలి చిత్రాన్ని తీర్చి దిద్దిన విధానం బాగుందనే విషయం తమిళ సినీ వర్గాల్లలో ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి ఇదే అభిప్రాయం వెల్లడి అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.
సోషల్ మెసేజ్, ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన లవ్ మ్యారేజ్ సినిమాలోని కంటెంట్‌పై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకుండానే సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాకు యూ (U) సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 6 నిమిషాలు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను ఎమోషనల్‌గా నిర్మించడంపై నిర్మాత, దర్శకులను సెన్సార్ అధికారులు ప్రశంసించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











