Love Mouli Review యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ.. నవదీప్ హిట్టు కొట్టాడా? లవ్ మౌళి రివ్యూ!

Rating:
2.5/5

చిత్రం: లవ్ మౌళి
నటీనటులు: నవదీప్, పంఖూరి గిద్వానీ, చార్వీ దత్తా, భావన సాగి, రానా దగ్గుబాటి (స్పెషల్ అప్పీయరెన్స్) తదితరులు
దర్శకత్వం: అవనీంద్ర
నిర్మాత: సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
మ్యూజిక్ డైరెక్టర్: గోవింద్ వసంత
సినిమాటోగ్రాఫర్స్: అజయ్ శివశంకర్
ఎడిటర్: అవనీంద్ర
రిలీజ్ డేట్: 2024-06-06

దేశంలోనే గొప్ప పెయింటర్లలో మౌళి (నవదీప్) ఒకరు. అయితే సమాజంతో సంబంధం లేకుండా తన కంటూ ఓ లోకం క్రియేట్ చేసుకొంటాడు. (Love Mouli Movie Review) తన గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకొని మేఘాలయలోని చిరపుంజిలోని తన రిస్టార్డులో పెయింటింగ్ వేసుకొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఇక తన స్నేహితురాలు హారిక (భావన సాగి) గొడవపడుతాడు. అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలో తెలియదు.

Love Mouli Movie Review in Telugu  Navdeep  Pankhuri Gidwani chemistry worked out well

అసలు నీకు ఎలా బతకాలో కూడా తెలియదు. నీ కోసం బిజినెస్ తెస్తుంటే.. నీవు నా పేరు చెడగొడుతున్నావు అంటూ విడిపోతారు. అప్పుడు తనకు ఎలాంటి అమ్మాయి కావాలి అనే ఆలోచనలో పడినప్పుడు ఓ అఘోరా (రానా) కలిసి ఓ బ్రష్ ఇస్తాడు. ఆ బ్రష్‌తో పెయింటింగ్ వేస్తే.. తనకు ఎలాంటి అమ్మాయి కోరుకొంటే అలాంటి అమ్మాయి మౌళి జీవితంలోకి వస్తుంది.

అయితే మౌళి తనకు నచ్చేలా ఎలాంటి అమ్మాయిల పెయింటింగ్ వేశారు? ఆ పెయింటింగ్ ప్రకారం వచ్చిన చిత్ర (పంఖూరి గిద్వానీ) తో ఎలాంటి బంధం ఏర్పడింది. అలా చిత్ర రూపంలో తన ముందు ప్రత్యక్షమైన అమ్మాయిలతో ఎలాంటి రొమాన్స్, జర్నీ సాగింది? అలా తన జీవితంలోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు మౌళికి ఎలాంటి అనుభూతిని పంచారు. చివరికి మౌళి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని కోరుకొన్నాడు. తాను కోరుకొన్న అమ్మాయి భార్యగా వచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ మౌళి సినిమా కథ.

Love Mouli Movie Review in Telugu  Navdeep  Pankhuri Gidwani chemistry worked out well

లవ్ మౌళి సినిమాను పాయింట్ వైజ్‌గా చూస్తే చాలా రొమాంటిక్‌గా, స్క్రీన్ మీద అద్బుతంగా ఉంటుంది. కానీ ఓవరాల్‌గా ఓ కథగా, సినిమా చూస్తే ఏదో మిస్ అయిందనే అసంతృప్తి కలుగుతుంది. వాస్తవానికి నేటితరం అబ్బాయిల చంచల స్వభావం.. లవ్ పట్ల ఉండే అభిప్రాయాలను మౌళి రూపంలో చూపించే ప్రయత్నం చేశారనే ఫీలింగ్ కలుగుతుంది.

సినిమాలో నలుగురు అమ్మాయిలతో చేసిన రొమాన్స్.. ఆ అమ్మాయిలతో జరిగిన జర్నీ ఓ హ్యుమన్ సైకాలజీ ప్రతిబింబిస్తుంది. అయితే విడివిడిగా సెన్సిబుల్ రొమాంటిక్ సీన్లు మంచి ఫీల్‌తో ఉంటాయి. కానీ ఓవరాల్‌గా ఒక సినిమాకు కావాల్సిన డెస్టినీ, పర్సస్ మిస్ కావడం వల్ల పూర్తి సినిమాగా రూపొందలేదనే అభిప్రాయం కలుగుతుంది. Love Mouli Movie Review

ఇప్పటి వరకు నవదీప్‌కు ఉండే ఇమేజ్.. ఆయన పాత్రల ద్వారా చూపించిన ఫెర్ఫార్మెన్స్ వేరుగా ఉంటుంది. కానీ లవ్ మౌళి సినిమాలో చూస్తే.. ఒక డిఫరెంట్.. మెచ్యుర్డ్ నటుడిగా నవదీప్ కనిపిస్తాడు. ఎపిసోడ్స్ వైజ్‌గా సాగే కథలో నవదీప్‌‌ను తెర మీద విభిన్నమైన నటుడిగా చూసే ఛాన్స్ లభించిందనే చెప్పాలి. Love Mouli Movie Review సినిమాను మొత్తంగా తన భుజాలపై మోయగలనని నిరూపించుకొన్నారు. ఇక ఈ సినిమాలో మిస్ ఇండియా పంఖూరి గిద్వానీ ఫుల్ మార్కులు కొట్టేసింది. ఓ దశలో నవదీప్‌ను కూడా డామినేట్ చేసిందేమిటి అనే ఫీలింగ్ కలుగుతుంది. చిత్ర చేసిన రొమాంటిక్ సీన్లు, ఎమోషనల్ సీన్లు ఈ సినిమాకు హైలెట్‌గా చెప్పుకోవచ్చు.

Love Mouli Movie Review in Telugu  Navdeep  Pankhuri Gidwani chemistry worked out well

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అజయ్ శివశంకర్ సినిమాటోగ్రఫి, గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక వర్షాపాతం ఉనన చిరపుంజి అందాలను అజయ్ తెరకెక్కించిన తీరు బాగుంది. స్క్రీన్ అంతా మంచి పెయింటింగ్ కాన్వాస్‌లా అనిపించేలా సన్నివేశాలను చిత్రీకరించారు. సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

లవ్, రొమాన్స్, ఎమోషన్స్ అంశాలతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం లవ్ మౌళి. నేటితరం యువత అభిప్రాయాలకు అద్దంపట్టేలా ఉంటుంది. కథను మరింత బలంగా రాసుకొని.. సరైన ముగింపును మరింత సినిమాటిక్‌గా ఉంటే.. మరో అర్జున్ రెడ్డి లాంటి సినిమా అయి ఉండేదనిపిస్తుంది. ఏది ఏమైనా యూత్‌ను ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అంచనాలు లేకుండా వెళితే. సినిమా ఓ కొత్త అనుభూతిని పంచే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X