twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Story movie Review.. సెన్సిబుల్ సబ్జెక్ట్‌తో సాయిపల్లవి, చైతూ మ్యాజిక్

    |

    Rating:
    3.0/5
    Star Cast: సాయిపల్లవి, నాగచైతన్య, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని, ఆనంద చక్రపాణి
    Director: శేఖర్ కమ్ముల

    ఫిదా లాంటి ఘన విజయం సాధించిన మూవీ తర్వాత సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో లవ్ స్టోరి సినిమా వస్తుందనే సరికి భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక నాగ చైతన్య కూడా ఈ సినిమా భాగం కావడం మరింత ఆసక్తిని పెంచింది. ఇక ట్రైలర్లు, టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో మోత మోగించడం సంచలనంగా మారింది. కులం, లింగపరమైన తారతమ్యాలు కథాంశంగా రూపొందించారనగానే ఈ సినిమా హిట్ అనే గురి ప్రేక్షకుల్లో పెరిగింది.

    ఇలా భారీ అంచనాలతో సెప్టెంబర్ 24వ తేదీన లవ్ స్టోరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను లవ్ స్టోరి చేరుకొన్నదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమా కథ ఏంటి? శేఖర్ కమ్ముల అటెంప్ట్ చేసిన విషయాల గురించి సమీక్షించుకోవాల్సిందే...

    లవ్ స్టోరి కథ ఏమిటంటే..

    లవ్ స్టోరి కథ ఏమిటంటే..

    ఆర్మూర్‌కు చెందిన రేవంత్ (నాగచైతన్య) తక్కువ కులానికి చెందిన వాడు. అదే ఊరుకు చెందిన మౌనిక (సాయి పల్లవి) ఉన్నత కులానికి చెందిన వారు. వివక్షను తట్టుకోలేక పట్టణానికి వెళ్లి డ్యాన్స్ స్కూల్ రేవంత్ నడుపుతుంటాడు. తన బాబాయ్‌ (రాజీవ్ కనకాల)తో ఉన్న సమస్య నుంచి తప్పించుకోవడానికి మౌనిక హైదరాబాద్‌కు చేరుతుంది. అక్కడే జరిగిన రేవంత్, మౌనిక పరిచయం ప్రేమ వరకు సాగుతుంది. పెళ్లికి కులమతాలు అడ్డుగోడలుగా నిలుస్తాయి.

    లవ్ స్టోరి సినిమాలో ట్విస్టులు

    లవ్ స్టోరి సినిమాలో ట్విస్టులు

    చిన్నతనంలో రేవంత్‌ ఎలాంటి వివక్షను అనుభవించాడు? ఆ వివక్ష వల్ల సమాజంపై రేవంత్‌కు ఎలాంటి అభిప్రాయం కలిగింది. మౌనిక‌కు బాబాయ్‌తో ఉన్న సమస్య ఏమిటి? కులమతాల అడ్డుగోడలను పడగొట్టేందుకు రేవంత్, మౌనిక ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? పెళ్లి చేసుకొని దుబాయ్‌కి పారిపోవాలని ప్రయత్నించిన మౌనిక తన మనసును ఎందుకు మార్చుకొన్నది? అకృత్యాలకు పాల్పడిన బాబాయ్‌కి ఎలాంటి గుణాపాఠం నేర్పేందుకు మౌనిక, రేవంత్ ప్రయత్నించారు. చివరికి బాబాయ్‌కి ఎలాంటి శిక్షను అనుభవించారనే ప్రశ్నలకు సమాధానమే లవ్ స్టోరి సినిమా కథ.

    ఫస్టాఫ్‌లో కీలక అంశాలు

    ఫస్టాఫ్‌లో కీలక అంశాలు

    రేవంత్ బాల్యంలో జరిగిన సున్నిత అంశాలతో ఎమోషనల్‌గా లవ్ స్టోరి కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఫీల్‌గుడ్ లవ్ స్టోరి, సాయి పల్లవి మానసిక సంఘర్షణ సినిమాను డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాయి. కానీ శేఖర్ కమ్ములు నెమ్మదిగా కథ చెప్పే అంశం ఫస్టాఫ్‌లో కొంత సహనానినకి పరీక్ష పెట్టినట్టు ఉంది. అయితే ప్రేక్షకుడి మదిలోకి కథను ఇంజెక్ట్ చేసే అంశం మాత్రం పక్కాగా సాగింది. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, కథకు పునాది వేసే పని కానిచ్చారనే విషయం బోధపడుతుంది.

    సెకండాఫ్‌లో డ్రామా ఎలా అంటే..

    సెకండాఫ్‌లో డ్రామా ఎలా అంటే..

    ఇక రెండో భాగం విషయానికి వస్తే.. చివరి 30 నిమిషాలే సినిమాకు ప్రాణం. అసలు కథ అప్పుడే పరుగులు పెడుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు దర్శకుడు శేఖర్ కమ్ములు విషయాన్ని ఊరించి ఊరించి చెప్పే ప్రయత్నం చేయడం మరోసారి ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. కానీ ఎప్పుడైతే కీలక పాయింట్‌ను ఎత్తుకొన్నాడో అప్పుడే సినిమా హిట్ వైపు ప్రయాణిస్తున్నదనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా కమర్షియల అంశాల కారణంగా రొటీన్ క్లైమాక్స్‌తో తన విజన్‌కు తెర వేశాడని ఫీలింగ్ కలుగుతుంది.

    దర్శకుడు శేఖర్ కమ్ముల విజన్

    దర్శకుడు శేఖర్ కమ్ముల విజన్

    కులం, మత వివక్ష లాంటి సున్నితమైన, క్లిష్టమైన అంశానికి తోడు, పిల్లలపై లైంగిక దాడులు అనే సెన్సిబుల్ పాయింట్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్తగా కథను చెప్పేందుకు ప్రయత్నించాడు. కుల, మతాల నేపథ్యంగా వచ్చిన చిత్రాలు ఇటీవల ప్రేక్షకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను చర్చించేలా వెండితెర మీద ఎంచుకొన్న శేఖర్ కమ్ముల పంథా బాగుంది.

    ఎక్కువగా ఆ సున్నితమైన అంశాన్ని బహిరంగంగా చెప్పకుండానే అంతర్గతంగా భావోద్వేగాలను జోడించిన చెప్పిన తీరు మరీ బాగుంది. లవ్ స్టోరి ద్వారా శేఖర్ కమ్ముల కొత్త ఆలోచనలను ప్రేక్షకుల్లో నాటారు అని చెప్పవచ్చు. టాప్ డైరెక్టర్లు ఇలాంటి కథతో సాహసం చేయడానికి జంకుతారనేది వాస్తవం. అలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడి విజన్ సఫలమైందని చెప్పవచ్చు.

    నాగచైతన్య ది బెస్ట్‌గా

    నాగచైతన్య ది బెస్ట్‌గా

    నాగచైతన్య విషయానికి వస్తే.. సాధారణ మధ్య తరగతి యువకుడు రేవంత్‌ పాత్రలోకి దూరిపోయాడు. రేవంత్ పాత్ర ద్వారా వినోదం అందించడమే కాకుండా గుండెను పిండేసే ఎమోషన్స్‌‌తో కొత్తగా తెర మీద కనిపిస్తాడు. భావోద్వేగమైన పాత్రతో ప్రేక్షకుడిని కొన్ని సీన్లలో ఎమోషనల్‌గా ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. రేవంత్ పాత్ర నాగచైతన్య కెరీర్ బెస్ట్ అని చెప్పవచ్చు. డ్యాన్స్, ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నాడు.

    సాయి పల్లవి మరోసారి మ్యాజిక్

    సాయి పల్లవి మరోసారి మ్యాజిక్

    సాయి పల్లవి మరోసారి మౌనికగా మ్యాజిక్ చేసింది. ఎప్పటిలానే ఎమోషన్స్‌తోపాటు డ్యాన్సులతో ఇరగదీసింది. సున్నితమైన, క్లిష్టమైన పాత్రను అద్భుతంగా పండించింది. గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకొన్నదని చెప్పవచ్చు. కమర్షియల్ అంశాలతోపాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రను చాలా సునాయసంగా తెర మీద పడించింది. సాయి పల్లవి నటనకు మరోసారి ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు.

    రాజీవ్ కనకాల, ఆనంద చక్రపాణి పాత్రలు

    రాజీవ్ కనకాల, ఆనంద చక్రపాణి పాత్రలు

    ఇతర పాత్రల విషయానికి వస్తే.. రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత మంచి పాత్రలో తన రేంజ్‌ను చూపించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా పండించాడు. సాయిపల్లవి తండ్రిగా ఆనంద చక్రపాణి గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. ఈశ్వరీ భాయ్, దేవయాని పాత్రలు ఎమోషనల్‌గా సాగాయి. ఉత్తేజ్‌ మరోసారి ఆకట్టుకొనే పాత్రలో కనిపించారు.

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే..

    ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ లవ్ స్టోరికి హీరో. పాటలు, రీరికార్డింగ్ లవ్ స్టోరికి బలమైన అంశాలుగా నిలిచాయి. ఇక విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. నిజమాబాద్, ఆర్మూర్ పల్లె అందాలను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా ప్రతీ ఫ్రేమ్ లవ్లీగా ఉండేలా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్, అని మాస్టర్, శేఖర్ మాస్టర్ డ్యాన్సులు సినిమాకు మరో అదనపు ఆకర్షణగా మారాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    అలాగే నిర్మాణ విలువల విషయానికి వస్తే.. ఏషియన్ ఫిలింస్ లాంటి ప్రముఖ సంస్థ లవ్ స్టోరి మూవీకి సున్నితమైన, క్లిష్టమైన సబ్జెక్ట్‌ను ఎంచుకోవడమే సినిమా సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయింది. ఇలాంటి కథను కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పడం, అలాగే నటీనటుల ఎంపిక ఈ బ్యానర్‌కు ప్లస్ అవ్వడమే కాకుండా వారికి సినిమాపై ఉన్న అభిరుచిని చెప్పాయి. కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు అనుసరించిన వ్యాల్యూస్ బాగున్నాయి.

    తుది తీర్పు..

    తుది తీర్పు..


    లవ్ స్టోరి విషయానికి వస్తే.. కుల, బాలలపై లైంగిక దాడుల నేపథ్యంగా ఎమోషనల్‌గా తెరకెక్కిన చిత్రమని చెప్పవచ్చు. అయితే సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, అలాగే స్లో నేరేషన్ సినిమాకు కొంత ప్రతికూలంగా మారాయి. అయితే శేఖర్ కమ్ముల టేకింగ్, కథ చెప్పే విధానం ఆ లోపాలను సరిదిద్దాయని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. సాయిపల్లవి, నాగచైతన్య తెర మీద చేసిన మ్యాజిక్ నచ్చుతుంది. అయితే లవ్ స్టోరిలో ఫిదా లాంటి మ్యాజిక్ మాత్రం కనిపించదు. సున్నితమైన, సమాజాన్ని ఆలోచింప జేసే కథలను ఇష్టపడే వారికి లవ్ స్టోరి విపరీతంగా నచ్చుతుంది. కమర్షియల్ సినిమాలను ఆదరించే వారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లాస్ పాయింట్స్
    సాయి పల్లవి, నాగచైత్య పెర్ఫార్మెన్స్
    శేఖర్ కమ్ముల టేకింగ్
    డ్యాన్స్‌లు, పాటలు
    ఎమోషనల్ కంటెంట్

    మైనస్ పాయింట్స్
    సాగదీత, స్లో నేరేషన్
    అసంతృప్తికి గురిచేసే క్లైమాక్స్

    Recommended Video

    Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
     నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: సాయిపల్లవి, నాగచైతన్య, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని, ఆనంద చక్రపాణి తదితరులు
    కథ, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
    నిర్మాతలు: కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు
    ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐర్ల నాగేశ్వర్ రావు
    కో ప్రొడ్యూసర్: భాస్కర్ కాటమశెట్టి
    సినిమాటోగ్రఫి: విజయ్ సీ కుమార్
    ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
    మ్యూజిక్: పవన్ సీహెచ్
    రిలీజ్ డేట్: 2021-09-24

    English summary
    Love Story movie Review and Rating: Sai Pallavi, Naga Chaitanya remarkable performances
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X