twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవర్స్ డే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Lovers Day Movie Review | Priya Prakash Varrier | Roshan Abdul Rahoof | Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ రావుఫ్, నూరీన్ షరీఫ్
    Director: ఒమర్ లులు

    ఇంటర్నెట్ సెన్సేషన్, వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకే ఒకసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టేసింది. తన మొదటి సినిమా లవర్స్ డే (మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రికార్డుస్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 2 వేలకుపైగా థియేటర్లలో రిలీజ్ కానున్నది. టీజర్, తాజాగా విడుదలైన లిప్‌లాక్ వీడియో సినిమాపై భారీగా క్రేజ్ పెంచాయి. ఆడియో రిలీజ్‌కు అల్లు అర్జున్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లవర్స్ డే చిత్రం ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియా వారియర్‌కు ఏ రేంజ్ హిట్‌ను అందించింది? తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి ఏ స్థాయి విజయం అందుకోబోతున్నారు? దర్శకుడు ఒమర్ లులు హ్యాట్రిక్ కొట్టాడా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     లవర్స్ డే మూవీ స్టోరి

    లవర్స్ డే మూవీ స్టోరి

    ప్రియా వారియర్ (ప్రియా వారియర్), రోషన్ (రావూఫ్ రోషన్) గాథా (నూరీన్ షరీఫ్) అప్పుడప్పుడే కాలేజీలో చేరిన విద్యార్థులు. తొలిచూపులోనే రోషన్, ప్రియా వారియర్ ప్రేమలో పడుతారు. గాథాతో రోషన్, ప్రియా స్నేహంగా ఉంటూ కాలం గడిపేస్తుంటారు. ఈ క్రమంలో వారి జీవితంలో ఓ గొడవ, కొన్ని సంఘటనలు చోటుచేసుకొంటాయి. దాంతో రోషన్‌కు ప్రియా బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత గాథా మనసుకు రోషన్ చేరువవుతాడు. గాథాకు రోషన్ తన ప్రేమను వ్యక్తం చేయాలని నిర్ణయించుకొన్న సమయంలో మరో విషాదం చోటుచేసుకొంటుంది.

     లవర్స్ డే‌లో ట్విస్టులు

    లవర్స్ డే‌లో ట్విస్టులు

    ప్రియా వారియర్, రోషన్ మధ్య ప్రేమ వ్యవహారం ఎంత రసవత్తరంగా నడిచింది. అంతా సవ్యంగా ఉందనుకొనే సమయంలో రోషన్‌కు ప్రియా బ్రేకప్ ఎందుకు చెప్పింది. ప్రతీసారి తనను సమస్యల్లోంచి గట్టెక్కించే గాథాతో రోషన్ ప్రేమలో పడ్డాడు. కాలేజీ జీవితంలో కొందరు అకతాయిలతో చోటుచేసుకొన్న గొడవ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. గాథా, రోషన్ ప్రేమ చివరకు ఎలా విషాదంగా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే లవర్స్ డే.

     లవర్స్ డే ఫస్టాఫ్‌ అనాలిసిస్

    లవర్స్ డే ఫస్టాఫ్‌ అనాలిసిస్

    లవర్స్ డే చిత్రం చక్కటి కాలేజీ వాతావరణంలో ప్రారంభమవుతుంది. సమకాలీన పరిస్థితుల్లో యువతీ, యువకుల మధ్య కనిపించే సరదా, చిలిపి సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. తొలిభాగం కొంత ప్రశాంతంగా, అతి నెమ్మదిగా సాగిపోవడం ప్రేక్షకులకు అసహనం కలిగించేలా ఉంటుంది. ఓ ఫీల్‌గుడ్ అంశంతో సినిమా ప్రథమార్థం ముగిసిపోతుంది.

     లవర్స్ డే సెకండాఫ్ అనాలిసిస్

    లవర్స్ డే సెకండాఫ్ అనాలిసిస్

    రెండో భాగంలో లవర్స్ డే చిత్రంలో ఉండే మలుపులతో కూడిన కథ మొదలవుతుంది. బస్ జర్నీలో జరిగిన ఓ సంఘటన కథకు ప్రాణంగా మారుతుంది. కాకపోతే ఎవరూ ఊహించని విధంగా ప్రియా వారియర్, రోషన్ బ్రేకప్ చెప్పుకోవడం, ఆ తర్వాత గాథాతో ప్రేమలో పడటం సినిమాపై ఆసక్తిని రేపుతుంది. చివర్లో ట్రాజెడీ ఎండింగ్‌తో సినిమా ముగియడం భావోద్వేగంగా ఉంటుంది.

     దర్శకుడు ఒమర్ లులు గురించి

    దర్శకుడు ఒమర్ లులు గురించి

    దర్శకుడు ఒమర్ లులు బలమైన కథ, సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. కేవలం ప్రియా వారియర్, రోషన్, నూరిన్ నటన, క్రేజ్‌తో సినిమా నిలబడగలిగిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కొత్తవారితో బ్లాక్‌బస్టర్ చిత్రాలు రూపొందించిన ఒమర్ లవర్స్ డే సినిమాకు వచ్చే సరికి తడబాటుకు గురయ్యాడు. ఓదశలో పేలవమైన సన్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడా అనిపిస్తుంది. అద్భుతంగా తీయాల్సిన ఓ కథకు అన్యాయం చేశాడనే ఫీలింగ్ కలగడం చాలా సమంజసంగా అనిపిస్తుంది.

    ప్రియా వారియర్ నటనా ప్రతిభ

    ప్రియా వారియర్ నటనా ప్రతిభ

    లవర్స్ డే సినిమాకు కర్త, కర్మ, క్రియ ప్రియా వారియర్. తనకు లభించిన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. బలహీనంగా కనిపించే సన్నివేశాల్లో కూడా తన హావభావాలతో ఆకట్టుకొన్నది. తెర మీద గ్లామర్‌ను పండించింది. పాటల్లోను డ్యాన్సులతో అలరించింది. తొలిభాగంలో కథ మరింత బలంగా ఉంటే ప్రియ వారియర్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉండేది.

     రోషన్ రావూఫ్ ఫెర్ఫార్మెన్స్

    రోషన్ రావూఫ్ ఫెర్ఫార్మెన్స్

    రోషన్ అబ్దుల్ రావూఫ్ విషయానికి వస్తే చాలా ఈజ్‌తో నటించాడు. డ్యాన్సుల్లో అదరగొట్టాడు. చిలిపిగా ఆకట్టుకొన్నాడు. భావోద్వేగమైన నటనతో మెప్పించాడు. భవిష్యత్‌లో మంచి కథతో సినిమా లభిస్తే హీరోగా నిలదొక్కుకొనే అవకాశాలు ఉన్నాయి. తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు.

    కీలక పాత్రలో నూరీన్ షరీఫ్

    కీలక పాత్రలో నూరీన్ షరీఫ్

    నూరీన్ షరీఫ్ గాథా పాత్రతో ప్రేక్షకులకు చేరువయ్యారని చెప్పవచ్చు. కథకు బలంగా నిలిచే ప్రధానమైన పాత్రలో నటించి మెప్పించారు. సెకండాఫ్‌లో, ముఖ్యంగా క్లైమాక్స్‌లో నూరిన్ నటన హైలెట్ అనిచెప్పవచ్చు. గ్లామర్‌గా ఆకట్టుకొన్నది. బలమైన పాత్ర దొరికితే న్యాయం చేసే ప్రతిభ కనిపించింది. ఇక ఈ సినిమాలో నటించిన మిగితా నటీనటులు, తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

    మ్యూజిక్ గురించి

    మ్యూజిక్ గురించి

    లవర్స్ డే సినిమాకు షాన్ రెహ‌మాన్‌ అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్. పాటలు సినిమాకు ప్రాణం పోశాయి. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే అంశాలతో పాటలు సాగుతాయి. కాలేజీ కుర్రకారుకు నచ్చే విధంగా సాహిత్యం, సంగీతం బ్రహ్మండంగా కుదిరాయి. శ్రీదేవికి నివాళులర్పిస్తూ చేసిన పాట ఎమోషనల్‌గా ప్రేక్షకులను టచ్ చేస్తుంది.

     శీను సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫి

    శీను సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫి

    లవర్స్ డే మూవీ సంబంధించి శీను సిద్ధార్థ్‌ అందించిన సినిమాటోగ్రఫి మరో అదనపు ఆకర్షణ. ప్రకృతి నేపథ్యంగా చిత్రీకరించిన సన్నివేశాలు తెరపైన ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య సీన్లలో భావోద్వేగం దట్టించి చిత్రీకరించిన సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా ఉంటాయి.

    ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    లవర్స్ డే చిత్రంలో ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. అచ్చు విజ‌య‌న్‌ ఎడిటింగ్‌ కొన్ని లోపాలు కనిపించాయి. కొన్ని సన్నివేశాలు కథ వేగానికి అడ్డుపడినట్టు అనిపిస్తాయి. సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా అందించిన స్క్రీన్ ప్లే సరిగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకు అదే మైనస్ పాయింట్ అనిచెప్పవచ్చు.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మలయాళంలో రూపొందిన ఒరు ఆడార్ లవ్ చిత్రాన్ని తెలుగులో సుఖీభవ బ్యానర్‌పై లవర్స్ డే సినిమాను గురురాజ్, వినోద్‌రెడ్డి ప్రేక్షకులకు అందించారు. డబ్బింగ్, మాటలు, పాటలు తెలుగుదనం ఉట్టిపడేలా రూపకల్పన చేశారు. మంచి ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాను ప్రేక్షకులకు చేరువ చేశారు. డబ్బింగ్ చిత్రం అనిపించకుండా మంచి నిర్మాణ విలువలను పాటించడంలో సఫలమయ్యారు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    యూత్, కాలేజీ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని రూపొందించిన ప్రేమ కథా చిత్రం లవర్స్ డే. యూత్ చిత్రమంటే అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా విలువలను పాటించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసే విధంగా క్లీన్‌గా రూపొందించారు. అయితే కథ, కథనాల బలహీనంగా ఉండటం కొంత మైనస్ అనిచెప్పవచ్చు. యువతీ, యువకులను ఆకట్టుకొనే అంశంపైనే ఈ సినిమా విజయం ఏ రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది.

     ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    బలం, బలహీనతలు

    • ప్రియ ప్రకాశ్ వారియర్
    • మ్యూజిక్
    • సినిమాటోగ్రఫి
    • ప్రొడక్షన్ వ్యాల్యూస్
    • మైనస్ పాయింట్స్

      • కథ, కథనాలు
      • డైరెక్షన్
      • పరభాష నటీనటులు
      •  తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        న‌టీన‌టులు: ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు
        సాంకేతిక నిపుణులు :
        కెమెరా
        : శీను సిద్ధార్థ్‌
        ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌
        సంగీతం: షాన్ రెహ‌మాన్‌
        స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
        క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు
        నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

    English summary
    Sensation girl Priya Prakash Warrior's Lovers day is set to release on February 14th. This movie's Audio release function on January 23rd. Stylish Star Allu Arjun is the Chief guest for the audio fuctions. A Guru Raj and Vinod Reddy are the producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X