Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.5/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ, రాంకీ, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్, సచిన్ కేడ్కర్, సాయి కుమార్ తదితరులు
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: నాగవంశీ సూర్యదేవర, సాయి సౌజన్య
సినిమాటోగ్రఫి: నిమిష్ రవి
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
రిలీజ్ డేట్: 2024-10-31

భాస్కర్ (దుల్కర్ సల్మాన్) మగధ బ్యాంకులో క్యాషియర్. చాలీ చాలని జీతంతో మధ్య తరగతి జీవితాన్ని గడుపుతుంటాడు. కుటంబ సభ్యుల బాధ్యతలు, ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు అత్తింటి వారితో అవమానాలతో కాలం గడుస్తుంటుంది. ప్రమోషన్ పోయిందనుకొన్న సమయంలో ఉన్నట్టుండి.. ఏకంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టు వస్తుంది. ఈ క్రమంలో ఆంథోని (సింధూరపువ్వు రాంకీ) పరిచయంతో భాస్కర్ అక్రమ సంపాదనకు అలవాటు పడుతాడు. ఈ క్రమంలో ఆయనను సీబీఐ విచారించేందుకు సిద్దమవుతుంది.

Lucky Baskhar Movie Review in Telugu
భాస్కర్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ సుమతి (మీనాక్షి చౌదరీ) అతడినే కోరుకొని పెళ్లి చేసుకొన్నది? ఆంథోని పరిచయంతో భాస్కర్ బ్యాంకులో ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు? ప్రమోషన్ వచ్చిన తర్వాత బ్యాంకు డబ్బును ఎలా దుర్వినియోగం చేశాడు? స్టాక్ మార్కెట్‌లో కింగ్ హర్ష మెహ్రాతో సంబంధాలు ఆయనకు ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టాయి? సీబీఐ విచారణకు భాస్కర్ ఎలా సహకరించాడు? తన వద్ద ఉన్న 100 కోట్ల ఇవ్వాలని సీబీఐ ఆఫీసర్ (సాయికుమార్) డిమాండ్‌కు తలవొగ్గాడా? అప్పులతో కటిక దరిద్రాన్ని అనుభవించిన భాస్కర్.. చివరకు లక్కీ భాస్కర్ ఎలా అయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే లక్కీ భాస్కర్ సినిమా కథ.

సీబీఐ అరెస్ట్‌తో కథ ఇంటెన్స్‌గా, సీరియస్ నోట్‌లో ప్రారంభమైనప్పటికీ.. వెంటనే ఫ్యామిలీ జోన్‌లోకి తీసుకెళ్లి సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చిన విధానంతోనే కనెక్ట్ అయిపోతారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఇంటెలిజెంట్, బ్రిల్లియెంట్ స్క్రీన్ ప్లే సినిమాను ఓ రేంజ్‌కు చేర్చింది. ప్రతీ సీన్‌కు రేంజ్‌ను పెంచుకొని వెళ్లిన విధానం.. ప్రతీ సీన్‌లో ఎమోషన్స్ జొప్పించిన విధానం సినిమాకు బలంగా మారింది. ఇక డైలాగ్స్‌తో కేక పెట్టించాడు. ఇటీవల కాలంలో బెస్ట్ రైటింగ్ మూవీ. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ వెంకీ అట్లూరి అని చెప్పవచ్చు.

ఇక బలమైన స్క్రిప్టుకు హీరో దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. భాస్కర్‌గా ఆ పాత్రలో ఒదిగిన విధానం, ఆ పాత్రకు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆయన వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. కొన్ని సీన్లలో ఆయన చూపించిన హావభావాలు, చెప్పిన డైలాగ్స్ అదరహో అనేలా ఉంటాయి. ఇక మీనాక్షి చౌదరీ సుమతిగా తన పాత్రలో చక్కగా సెటిల్ అయిపోయింది. సెకండాఫ్‌లో ఆమె నటనను చూస్తే దుల్కర్‌తో పోటీపడి నటించిందా? అనిపించేలా ఉంటుంది.

ఇక ఈ చిత్రంలో నటించిన సచిన్ కేడ్కర్, సాయి కుమార్, సుధ,రాంకీ, కసిరెడ్డి, హైపర్ ఆది తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. కొన్ని సీన్లను సచిన్, సాయికుమార్ హైలెట్‌గా నిలిచారు. శ్రీనాథ్ మాగంటి రోల్‌గుర్తుండిపోయేలా నటించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు. యాంకర్ గాయత్రి భార్గవి మంచి పాత్రలో కనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్‌తో కేక పెట్టించాడు. అలాగే ఆర్ట్ వర్క్ కారణంగా సినిమా పీరియాడిక్ మూడ్‌ను ఎలివేట్ చేసింది. నవీన్ నూలి ఎడిటింగ్, నిమిష్ రవి సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్, సన్నివేశాలను రిచ్‌గా క్లాస్ టచ్‌తో కెమెరాలో బంధించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ ప్రమాణాలకు తగినట్టుగా నాగవంశీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపానికి, జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజిక్‌కు లక్కీ భాస్కర్ మూవీ ప్రమాణంగా నిలిచింది. దర్శకుడు రాసుకొన్న పాత్రలు, తెరపైన ఆయా నటులు బిహేవ్ చేసిన విధానం ఈ సినిమాకు బలంగా నిలిచాయి. సున్నితమైన కామెడీ, ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. లక్కీ భాస్కర్ ఈ దీపావళికి సినీ ప్రేక్షకులకు బెస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. డోంట్ మిస్. మంచి అనుభూతి కోసం థియేటర్‌లోనే చూడండి. పెట్టిన ప్రతీ పైసా వసూల్‌లా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X