Lucky Baskhar Twitter Review: లక్కీ భాస్కర్ ట్విట్టర్ రివ్యూ.. మైండ్ బ్లోయింగ్..!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ఒకరోజు ముందుగానే, అనగా అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ షోలు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 7 గంటల నుంచి భారీగా ప్రారంభం అవుతున్నాయి.

Lucky Baskhar Telugu Movie Twitter Review in Telugu  What is Dulquer Salman s fans Reaction

లక్కీ భాస్కర్ సినిమా దుల్కర్ సల్మాన్‌కు కమ్ బ్యాక్ మూవీ. టాప్ లెవెల్‌లో స్క్రీన్ ప్లే ఉంది. అంతే మొత్తంలో క్యారెక్టర్లు బలంగా ఉన్నాయి. ఓ మంచి సినిమా ఎలా తీయవచ్చోనని తీసి చూపించారు. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎలివేషన్ కేక పెట్టించాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

డైరెక్టర్ వెంకీ అట్లూరి సింపుల్ సబ్జెక్ట్‌ను రేసీ స్క్రీన్ ప్లేతో అద్బుతంగా చెప్పాడు. దుల్కర్ సల్మాన్.. మంచి స్క్రిప్ట్ ఇచ్చి.. యాక్షన్ అని అరవండి.. నేను ఎలా నటిస్తానో చూపిస్తాడు. దుల్కర్ సల్మాన్ నటన అద్బుతంగా ఉంది. ఇక థియేటర్లలోకి జనం కిక్కిరిసిపోవడమే తరువాయి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

లక్కీ భాస్కర్ నిజంగా అమేజింగ్‌గా ఉంది. సినిమా మొత్తాన్ని ఇంట్రెస్టింగ్‌గా మలచడంలో ఆయన గ్రేట్ జాబ్ చేశాడు. ఈ సంవత్సరంలో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లక్కీ భాస్కర్ మూవీ చూశాను. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. మిడిల్ క్లాస్ లైఫ్, 2, 3 ఎమోషనల్ సీన్లు, చాలా తక్కువ కామెడీ. ఇంటర్వెల్‌లో చూపించిన హై ఎలివేషన్.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు రచ్చ చేశాయి. బ్యాకింగ్ రంగంలోను, స్టాక్ మార్కెట్ కుంభకోణంలో ప్రధానంగా పేరు వినిపించిన హర్షద్ మెహతా గురించిన రెఫరెన్స్ బాగుంది. ఇది నిశ్శబ్దంగా వచ్చి హిట్ అవుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

లక్కీ భాస్కర్ కథ ఇంట్రెస్టింగ్, పవర్‌ఫుల్. ఫస్టాఫ్ జోష్‌ఫుల్‌గా సాగిన తర్వాత సెకండాఫ్‌లో మ్యాడ్ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి. వెంకీ అట్లూరీ జీనియస్ మైండ్. బ్యాంకింగ్ సిస్టమ్‌లో చోటు చేసుకొన్న భారీ కుంభకోణాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. దుల్కర్ సల్మాన్ ఆయన పాత్రలో ఒదిగిపోయి బ్రహ్మండమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ డ్రామాలో ఒకటి లక్కీ భాస్కర్. ఫర్‌ఫెక్ట్ అండ్ బ్రిల్లియంట్ నేరేషన్, మైండ్ బ్లోయింగ్ బీజీఎం. దుల్కర్ సల్మాన్, మీనాక్షి యాక్టింగ్ వేరే లెవెల్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లక్కీ భాస్కర్ సినిమా దీపావళీ విన్నర్ అనే ఫీలింగ్ కలిగిస్తున్నది. కథ రాసిన విధానం, దానిని ఎగ్జిక్యూట్ చేసిన డ్రామాను చూస్తే ప్రతీ స్థాయిలో ఈ సినిమా వర్క్ అవుతుందనిపిస్తున్నది. ఈ సినిమాలో నటించిన యాక్టర్లందరూ అద్బుతంగా నటించారు. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. భాస్కర్‌గా దుల్కర్ నటనతో ఆ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా అభిమానులకు వరంగా లభించిన నటుడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

లక్కీ భాస్కర్ సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సినిమాను సుమారుగా 150 పైగా షోలు ప్రదర్శిస్తున్నాం. అర్జున్ థియేటర్ కూకట్ పల్లిలో కూడా ఈ ప్రిమియర్‌ను యాడ్ చేశాం అని తెలిపారు.


లక్కీ భాస్కర్ సినిమా పెయిడ్ ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. తెలుగు స్టేట్స్‌లో 150 పైగా షోలు ప్రదర్శిస్తున్నారు. బజ్ భారీగా క్రియేట్ అవుతున్నది. ఈ టికెట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి అంటూ ట్వీట్ చేస్తున్నారు.


లక్కీ భాస్కర్ సినిమా యూనిట్‌కు సాయిధరమ్ తేజ్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియెన్స్ అందజేస్తుందని అనుకొంటున్నాను. వెండితెర మీద మంచి అనుభూతిని పొందండి అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X