twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lucky Lakshman review ఫన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. బిగ్‌బాస్ సోహైల్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    |

    Rating: 2.75/5

    నటీనటులు : స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌ త‌దిత‌రులు
    కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏఆర్ అభి
    నిర్మాత : హరిత గోగినేని
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్
    సినిమాటోగ్రఫి: ఐ ఆండ్రూ
    మ్యూజిక్: అనూప్ రూబెన్స్
    పాటలు: భాస్కరభట్ల
    రిలీజ్ డేట్: 2022-12-30

    Lucky Lakshman కథ ఇలా..

    Lucky Lakshman కథ ఇలా..

    పేదరికంతో పెరిగిన యువకుడు లక్ష్మణ్ (సయ్యద్ సోహైల్ ర్యాన్) ఇంజినీరింగ్ స్టూడెంట్. పేదరికం కారణంగా జీవితంలో చిన్న చిన్న విషయాలు, కోరికల తీర్చుకోలేక రాజీపడాల్సి రావడంతో తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకొంటాడు. అలాంటి పరిస్థితుల్లో శ్రావ్య (మోక్ష) తనకు అండగా నిలుస్తుంది. డబ్బుకు కొరత లేకుండా చూసుకొంటూ లక్ష్మణ్‌కు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. అయితే అంతా సవ్యంగా సాగిపోతుందనుకొనే సమయంలో లక్ష్మణ్, శ్రావ్య మధ్య బ్రేకప్ జరుగుతుంది.

    Lucky Lakshman ట్విస్టులు..

    Lucky Lakshman ట్విస్టులు..


    లక్ష్మణ్ ఫ్యామిలీ ఎందుకు పేదరికంలోకి నెట్టివేయబడింది? లక్ష్మణ్ కోసం తల్లిదండ్రులు ఎలాంటి త్యాగం చేశారు? తల్లిదండ్రులను దూరంగా పెడుతూ.. వారి నుంచి విడిపోయిన లక్ష్మణ్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? లక్ష్మణ్‌కు సంపన్న కుటుంబానికి చెందిన శ్రావ్య ఎలా దగ్గరైంది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా ఎలా మారింది. లక్ష్మణ్, శ్రావ్యల మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది? ఒంటరివాడైన లక్ష్మణ్ తన స్నేహితులతో కలిసి మ్యారేజ్ బ్యూరో ఎందుకు పెట్టాడు? మ్యారేజ్ బ్యూరో పెట్టిన లక్ష్మణ్‌ ఎలాంటి ఫలితాలను సాధించాడు? తల్లిదండ్రులను దూరంగా బతుకుతున్న లక్ష్మణ్ రియలైజ్ అయ్యాడా? తల్లిదండ్రుల విషయంలో తప్పు చేశానని రియలైజ్ అయితే అందుకు కారణం ఏమిటి? శ్రావ్య మనసును ఎలా గెలుచుకొన్నాడు? చిన్నతనం నుంచి పేదరికంలో పెరిగిన లక్ష్మణ్.. బాగా డబ్బు సంపాదించి లక్కీ లక్ష్మణ్ ఎలా అయ్యాడనే ప్రశ్నలకు సమాధానమే Lucky Lakshman సినిమా కథ.

     Lucky Lakshman ఎలా ఉందంటే?

    Lucky Lakshman ఎలా ఉందంటే?


    లక్కీ లక్ష్మణ్ (Lucky Lakshman) సినిమా విషయానికి వస్తే.. నిరాశ, నిస్పృహలతో ఉన్న లక్ష్మణ్ ఓ హెటల్‌లో కూర్చొని ఉంటే.. ఆ ఓనర్ ఆయనను కదలించడంతో కథ ఫన్నీగా మొదలవుతుంది. సోహైల్ బాల్యంలో జరిగిన సంఘటనలు, కాలేజీలో జరిగిన వ్యవహారాలు, శ్రావ్యతో ప్రేమలో పడే వరకు కథ రెగ్యులర్‌గా, రొటీన్ కథనంతో సాగుతుంది. బ్రేకప్ వరకు అంతా ఊహించినట్టే జరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో రొటీన్ కథేనా అనే సందేహాలకు చెక్ పెడుతూ.. మ్యారేజ్ బ్యూరో ఎపిసోడ్‌తో అసలు కథలోకి వెళ్లడంతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ప్రీ క్లైమాక్స్‌లో కాదంబరి కిరణ్ ఎంట్రీతో సినిమాకు పరమార్థం చేకూర్చే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు రొటీన్, రెగ్యులర్‌గా అనిపించే ప్రేక్షకులకు ఒక్కసారిగా హార్ట్‌ను టచ్ చేసేంత ఫీల్‌ను కలిగించారు. మంచి ఫీల్‌గుడ్ నోట్‌తో కథను ముగించడం ఈ సినిమా అర్ధవంతంగా మారిందనిపిస్తుంది.

     సోహైల్ వన్ మ్యాన్ ఆర్మీగా

    సోహైల్ వన్ మ్యాన్ ఆర్మీగా


    సోహైల్ విషయానికి వస్తే.. రకరకాల ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అయినప్పటికే.. ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా.. అనుభవం ఉన్న నటుడిగా తెరపైన కనిపించాడు. హ్యుమర్, ఫన్, ఎమోషనల్ సన్నివేశాలతోపాటు ఓ పాటలో మాస్ హీరోలా మెరిశాడు. ఈ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మోక్ష కూడా తన పాత్ర పరిధి మేరకు ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకొన్నది.

     మిగితా పాత్రల్లో ఎవరెవరు? ఎలా అంటే

    మిగితా పాత్రల్లో ఎవరెవరు? ఎలా అంటే


    మిగితా పాత్రల్లో విషయానికి వస్తే.. సోహైల్ ఫ్రెండ్స్‌గా నటించిన వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దేవీ ప్రసాద్, కాదంబరి కిరణ్ కుమార్ పాత్రల పరిధి తక్కువైనా మంచి ఇంప్రెషన్ కలిగిస్తారు. హుందాగా వారి పాత్రల్లో ఒదిగిపోయారు. రాజా రవీంద్ర కూడా ఫీల్‌గుడ్ పాత్రలో కనిపించారు. ఇక బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ గీత్ రాయల్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా మారింది.

    సాంకేతిక విభాగాల గురించి

    సాంకేతిక విభాగాల గురించి


    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చాలా బ్యాక్‌బోన్‌గా నిలిచింది. సీన్ల పరంగా రైటింగ్ వీక్‌గా కనిపించినప్పటికీ.. ఆ లోపాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కప్పిపుచ్చిందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో డైలాగ్స్ హృదయాన్ని టచ్ చేస్తాయి. మళ్లీ ఇలాంటి కొడుకును కనలేం కదా లాంటి డైలాగ్స్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. అండ్రూ సినిమాటోగ్రఫి సీన్లను కలర్‌ఫుల్‌గా మార్చేసింది. దర్శకుడు అభి రాసుకొన్న పాయింట్ ఎమోషనల్‌గా ఉంది. కానీ ఫస్టాఫ్‌లో కథను ఎమోషనల్‌గా మార్చి ఉంటే.. డెఫినెట్‌గా ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. నిర్మాత హరిత గోగినేని అనుసరించిన నిర్మాణ విలువలు క్లాస్‌గా ఉన్నాయి.

    ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే?

    ఫ్యామిలీ వ్యాల్యూస్, ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్, లవ్ స్టోరి, ఎమోషన్స్ కలిసిన చిత్రం లక్కీ లక్ష్మణ్. అయితే ఫస్టాఫ్‌లో రైటింగ్ చాలా వీక్‌గా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో సన్నివేశాలు బలంగా రాసుకొని ఉంటే లక్కీ లక్ష్మణ్ ఫ్రెష్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఉన్న ఎమోషనల్ సీన్లు ఈ సినిమా వరకు మరో రేంజ్‌కెళ్లినట్టు అనిపిస్తుంది. బిగ్‌బాస్ ద్వారా విశేషంగా అభిమానులను సంపాదించుకొన్న సోహైల్ ఫ్యాన్స్‌కు లక్కీ లక్ష్మణ్ తప్పకుండా నచ్చుతుంది. ఈ వారాంతంలో ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీ, ఫన్ ఎంటర్‌టైనర్‌ చూడాలనుకొనే వారికి లక్కీ లక్ష్మణ్ మంచి అనుభూతిని పంచుతుంది.

    English summary
    Bigg Boss Telugu 4 fame Syed Sohel Ryan's latest movie is Lucky Lakshman. Mokksha, Devi Prasad, Sameer, Raja Ravindra, Kadambari Kiran, Geetu Royal are in lead roles. This movie hits the theatres on December 30th. Here is the Tleugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X