Lust Stories 2 Review బోల్డ్ క్యారెక్టర్‌లో ఇరగదీసిన కాజోల్.. లస్ట్ స్టోరీస్ 2 ఎలా ఉందంటే?

నటీనటులు: కాజోల్, కుముద్ జోషి
దర్శకత్వం: అమిత్ రవీంద్రనాథ్ శర్మ
నిర్మాతలు: ఆషీ దువా, రోని స్క్రీవాలా
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
రిలీజ్ డేట్: 2023-06-29

గ్రామ పెద్ద (కుముద్ మిశ్రా) వేశ్యవాటిక నుంచి చందా (కాజోల్‌)ను ఇష్టపడి తెచ్చుకొని పెళ్లి చేసుకొంటాడు. అయితే వేశ్యవాటికలో కంటే ఎక్కువగా నరకాన్ని ప్రతీ రోజు భర్త నుంచి చందా అనుభవిస్తూ ఉంటుంది. భర్త నిత్యం తాగి వచ్చి శారీరకంగా, లైంగికంగా వేధించినా భరిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కొడుకును ఉన్నత చదువులు చదివించాలనే కోరికతో ఉంటుంది. వేధింపులను తట్టుకోలేక చందా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొంటుంది.

చందా భర్త ఎలాంటి వేధింపులకు పాల్పడ్డాడు? భర్త చేసే అరాచకాన్ని చందా ఎలా భరించింది? భర్తను అడ్డు తొలగించుకోవడానికి చందా ఎలాంటి ప్లాన్ వేసింది? చందా వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? లేదా బెడిసి కొట్టిందా? చివరకు కొడుకును ఉన్నత చదువులు చదివించిందా? తన ప్లాన్ కొడుకు లాభం చేసిందా? అనే ప్రశ్నలకు సమాధానమే అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించిన లస్ట్ స్టోరీస్‌ 2 లో చివరి ఎపిసోడ్ కథ.

Lust Stories 2

వేశ్యా వాటికైనా.. ఇంటిలోనైనా మగాడి వాంఛలకు, వేధింపులకు మహిళ బలి కావాల్సిందే అనే ఎమోషనల్ పాయింట్‌తో దర్వకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ తెరకెక్కించారు. కాజోల్ పాత్ర చుట్టు అల్లుకొన్న భావోద్వేగాలు హార్ట్‌ను టచ్ చేస్తాయి. పాత్రలను డిజైన్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.

Lust Stories 2

భర్త వేధింపులకు గురయ్యే మహిళ పాత్రలో కాజోల్ మరోసారి బోల్డ్ ఫెర్పార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. చందా పాత్ర తప్ప కాజోల్ కనిపించని విధంగా పాత్రలో ఒదిగిపోయింది. కుముద్ మిశ్రా భూస్వామి, స్త్రీ లోలుడి పాత్రలో జీవించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Lust Stories 2

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. గ్రామాల్లో ఉండే గడి వాతావరణాన్ని, భూస్వాముల వ్యవహరశైలిని తెరకెక్కించిన తీరు సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభకు అద్దం పట్టింది. ఎమోషన్స్ పండించడానికి ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ బాగుంది. రీరికార్డింగ్ సీన్లను మరింత ఎమోషనల్‌గా మార్చింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదనే విషయం ప్రతీ ఫ్రేమ్ స్పష్టం చేస్తుంది.

Lust Stories 2

ప్లేస్ మారినా మహిళ ఫేట్ మారదు. మగవాడి అరాచకాలు మహిళలను ఎలాంటి మానసిక సంఘర్షణకు గురి చేస్తాయనే ప్రధానమైన పాయింట్‌తో లస్ట్ స్టోరీస్‌ 2లో కాజోల్ ఎపిసోడ్‌లో కనిపిస్తుంది. కాజోల్ ఫెర్ఫార్మెన్స్, కుముద్ మిశ్రా యాక్టింగ్, టెక్నికల్ అంశాలు బాగున్నాయి. పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో కూడిన ఎపిసోడ్. ఫ్యామిలీతో చూసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X